NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Manjummel Boys OTT Release: మరోసారి మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ పై క్రేజీ బజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Manjummel Boys OTT Release: మలయాళం లో సూపర్ హిట్ విజయం అందుకుని లాంగ్ టైమ్ లో కూడా భారీ వసూళ్లను సాధిస్తున్న మూవీ ” మంజుమ్మెల్ బాయ్స్ “. ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కోసం నిరక్షణ కొనసాగుతుంది. ఫిబ్రవరి 22వ తేదీన మలయాళం లో ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఆ ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డ్ లను తిరగ రాసింది ఈ మూవీ. హిస్టరీ క్రియేట్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఈ సూపర్ హిట్ మూవీ తెలుగులో సైతం థియేటర్లోకి ఏప్రిల్ 6న వచ్చింది. అంచనాలకు మించి తెలుగులోనూ భారీ కలెక్షన్స్ సాధించింది. థియేట్రికల్ రన్ ఇంకా సాగుతుండడంతో ఈ మూవీ ఓటిటి రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ మూవీ ఓటిటి రిలీజ్ కోసం చాలామంది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Manjummel Boys OTT Release updates
Manjummel Boys OTT Release updates

గతంలో ఈ మూవీ స్ట్రీమింగ్ కు వస్తుందంటూ కొన్ని తేదీలపై ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు. ఆ గడువు వెళ్లినప్పటికీ రేపు మాపు అంటున్నారు కానీ ఈ మూవీ యొక్క ఓటీటీ రిలీజ్ డేట్ ని మాత్రం ప్రకటించడం లేదు. తాజాగా ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు ఎప్పుడు రాబోతుందో ఒక సమాచారం అందింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ + హాట్స్టార్ ఓటిటి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీని మే మూడవ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మే మూడు నా మలయాళం , తెలుగు తో పాటు మరిన్ని భాషల్లో డబ్బింగ్ కింద ఈ చిత్రాన్ని హాట్ స్టార్ తీసుకొస్తుందని బజ్ నడుస్తుంది.

దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి మే 3న అయిన ఈ మూవీ ఓటిటి లో వస్తుందా.. లేదా ఇంకేమైనా ట్విస్టులు ఇస్తారో తెలీదు. అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకున్న మలయాళ మూవీ గా ఈ మూవీ చరిత్ర సృష్టించింది. రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి మలయాళ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇప్పటివరకు ఈ చిత్రానికి సుమారు రూ.226 కోట్ల వసూళ్లు వచ్చాయి. మలయాళం లో రికార్డులను సృష్టించిన ఈ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లను రాబట్టడం విశేషం. ఏప్రిల్ 6వ‌ ఈ మూవీ తెలుగు లో కూడా రిలీజ్ అయింది.

రిలీజ్ అనంతరం ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. థియేటర్లలో టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ వంటి అగ్ర హీరోల సినిమాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని తలదన్నుకుంటూ భారీ వసూళ్లను నమోదు చేస్తుంది ఈ మూవీ. మరి ఈ మూవీ మే 3న ఓటీటీ లోకి వస్తుందా లేదా మరింత ఆలస్యం అవుతుందో చూడాలి. ఒకవేళ కనుక ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ను మరింత ఆలస్యం చేస్తే ఈ మూవీపై ఉన్న హైప్స్ మొత్తం పోతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక తేదీలను అంచనా వేసిన ప్రేక్షకులు ఇక ఓర్పుగా ఉండేందుకు ప్రయత్నించడం లేదు. మరి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మే మూడవ తారీఖున ఈ మూవీని ఓటీటీలో విడుదల చేస్తారో లేదో చూడాలి.

Related posts

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu