NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

Krishna Mukunda Murari Today Episode May 1 2024 Episode 459 highlights

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: కృష్ణ మురారి ఇద్దరు హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. కృష్ణ ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేక పోతానేమోనని చాలా బాధపడ్డాను కానీ ఈ సరోగసి ద్వారా పిల్లల్ని కనడానికి మనకి మార్గం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని మనం ఇంట్లో వాళ్లకి చెప్పేయాలి ఏసిపి సార్ అని అంటుంది దానికి మురారి ఇప్పుడే కాదు కృష్ణ మనం టైం చూసుకొని చెబుదాము అప్పటిదాకా నువ్వు ఇంట్లో ఏం జరిగినా సైలెంట్ గా ఉండు అని అంటాడు. మనం ఆ సరోగసికి ఒప్పుకున్న అమ్మాయిని కూడా కలవాలి అని అంటుంది కృష్ణ ముందు ఒప్పుకొని తర్వాత మనం వైదేహిని ఒప్పించి కలుద్దాము అని అంటాడు. అప్పుడే ఎదురుగా ఒక ముసలావిడ పండ్లు పెట్టుకొని అమ్ముతూ ఉంటుంది. మురారి కార్ ఆపుతాడు ఏమైంది అని అడుగుతుంది కృష్ణ ఆమె చూడు ఎంత కష్టపడుతుందో పాపం ఇంటికి పంపించేయాలి ఇంత ఎండలో ఎంత కష్టంగా ఉందో ఆమెకి అని అంటాడు. ఇంటికి వెళ్ళమంటే వెళ్తుందా ఏసీబీ సార్ అని అంటుంది. మా మామిడి పండ్లను మనమే కొనేస్తే వెళ్తుంది కద కృష్ణ అని అంటాడు. మురారి ఆమె దగ్గరికి వెళ్లి పండ్లు బుట్ట మొత్తం ఎంత అని అడిగితే ఆవిడ 2000 అని చెప్తుంది మురారి 3000 ఇచ్చి ఈ బుట్టంతా నేను తీసుకున్నాను కదా ఇంక నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటాడు దానికి ఆవిడ మీరు చల్లగా ఉండాలి బాబు అని అంటుంది. కృష్ణా మురారి వైపు చూస్తూ మీరు చాలా మంచి వాళ్ళు అని అంటుంది. కానీ నాకు ఒకటే అర్థం కావట్లేదు మనం ఇంత మంచిగా ఆలోచిస్తుంటే దేవుడికి మాత్రం మన గురించి ఎందుకు ఇలా ఆలోచించాడు అని అంటుంది. మంచిగానే చేశాడు కృష్ణ మనకి పిల్లలు లేరని బాధపడుతుంటే సరోగసి అనే ఒక పద్ధతి ఉందని మనకి తెలిసేలా చేశాడు. ఇలా ఎందుకు ఆలోచించకూడదు అని అంటాడు ఇక ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు.

Krishna Mukunda Murari Today Episode May 1 2024 Episode 459 highlights
Krishna Mukunda Murari Today Episode May 1 2024 Episode 459 highlights

ఇక మరోవైపు భవానీ దేవి ఫంక్షన్ హడావిడి చేస్తూ ఉంటుంది. ఫంక్షన్ అయితే పెట్టావు కానీ నీ కోడలు లేదు అని భవాని ఫ్రెండ్స్ అడుగుతారు. రేవతి అయితే ఫోన్ చేయమంటావా అక్క వాళ్ళకి అని అంటుంది అవసరం లేదులే నువ్వు ఇప్పుడు ఫోన్ చేసి మళ్లీ నోరు జారుతావు వాళ్ళు రానివ్వు అని అంటుంది అప్పుడే కృష్ణ మురారి ఇద్దరూ వస్తారు. వాళ్ళని చూసి వెంటనే ఇంట్లో అందరూ కూడా సంతోషంతో ఉంటారు వాళ్ళు మాత్రం ఆశ్చర్యపోతారు. ఇదేంటి మనం వెళ్లేటప్పుడు లేని ఫంక్షన్ వచ్చేటప్పటికి ఏర్పాటు చేశారు ఎవరిదాని ఆలోచిస్తూ లోపలికి వస్తారు మామిడికాయలు బుట్ట మురారి చేతిలో పట్టుకొని తీసుకువస్తాడు మధు ఎదురు వచ్చి మామిడికాయలు బుట్టను తీసుకుంటాడు. కృష్ణుని చూసి భవాని దేవి ఆనందంతో ఉప్పొంగిపోతుంది కృష్ణుని హాగ్ చేసుకొని నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది కృష్ణ అని అంటుంది. వెంటనే రేవతి కూడా కృష్ణ దగ్గరికి వచ్చి కృష్ణని హగ్ చేసుకుని తన ఆనందాన్ని మొత్తం తెలుపుతుంది ఏమైంది అని అడుగుతుంది కృష్ణ. ఏమీ తెలియనట్టు నువ్వు మాకే సపరేట్ చేద్దాం అనుకుంటే తిరిగి నేనే మీకు సప్రైజ్ ఇచ్చాను అని అంటుంది మేము మీకు సప్రైజ్ ఇవ్వడం ఏంటి అని అంటుంది కృష్ణ. ఇంకా దాచి పెట్టాలని చూడండి కృష్ణ నువ్వు తల్లివి కాబోతున్నట్లు నాకు అర్థమైంది అని అంటుంది. దానితో ఒకసారిగా కృష్ణ షాక్ అవుతుంది మురారి వైపు చూస్తుంది మురారి కూడా అప్పటికే షాప్ లో ఉంటాడు. వీలైతే ఇలా అనుకుంటున్నారు అని కృష్ణ మనసులో అనుకుంటుంది ఇక భవాని నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావని అనుకోలేదు కృష్ణ నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా నీ మీద అనుమానం వచ్చి నేను హాస్పిటల్ కి కాల్ చేశాను అని అంటుంది దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది కృష్ణ. హాస్పిటల్ కి కాల్ చేస్తే వాళ్లు మీరు పిల్లలు డాక్టర్ దగ్గర ఉన్నారని చెప్పారు అప్పుడే అర్థమైపోయింది నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం కన్ఫామ్ చేసుకున్నాకే పార్టీ ఏర్పాటు చేశాను అని అంటుంది. దానికి కృష్ణ అది కాదు అత్తయ్య నేను ఒకసారి చెప్తాను వినండి అని అంటుంది. ఇంక నువ్వు ఏం చెప్పక్కర్లేదు మాకు అంతా అర్థం అయిపోయింది నువ్వు ఈ మామిడికాయలు బుట్టని తీసుకొచ్చినప్పుడు అది ఇంకా కన్ఫామ్ అయిపోయింది అని అంటుంది ఇక దాంతో మురారి ఏదో ఒక ముసలావిడకి హెల్ప్ చేద్దాం అనుకుంటే వీళ్ళకి ఇలా అర్థమైందా అని అనుకుంటాడు. పక్కనే ఉన్న రజిని వీళ్ళ వాలకం చూస్తుంటే నాకెందుకో డౌట్ గా ఉంది ఒకసారి కృష్ణ ఏం చెప్తుందో వినొచ్చు కదా అని అంటుంది. పక్కనే ఉన్న భవాని ఫ్రెండ్స్ కూడా మాకు కూడా అలానే అనిపిస్తుంది అని అంటుంది. భవాని కోపంగా రజనీవైపు ఇలాంటి అప్సెట్ మాటలు మాట్లాడొద్దని చెప్పాను కదా నేను హాస్పిటల్ కి ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకున్నాకే, ఫంక్షన్ ఏర్పాటు చేశాను ఇప్పుడు ఈ మామిడి పండ్లు చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా అని అంటుంది దాంతో కృష్ణ కూడా ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఉంటుంది ఇక మురారి కృష్ణ ని రెడీ ఐ రా అండి అని పంపిస్తుంది భవాని. రేవతి భవాని ఇద్దరు సంతోషంలో మునిగిపోతారు.

Krishna Mukunda Murari Today Episode May 1 2024 Episode 459 highlights
Krishna Mukunda Murari Today Episode May 1 2024 Episode 459 highlights

ఇక మరోవైపు కృష్ణ రూమ్ లోకి వచ్చి బాధపడుతూ ఉంటుంది మురారి వచ్చి ఎవరు చూడకుండా తలుపులు వేస్తాడు ఏంటి కృష్ణ బాధపడుతున్నావా అని అడిగితే ఏం చేయమంటారు అని అంటుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని కాస్త బాధని దాచుకోవాలి అని అంటాడు. బాదం దాచుకోవడం సాధ్యమవుతుందా ఏసీబీ సార్ అని అంటుంది. కింద వాళ్ళ హడావిడి చూస్తుంటే నేను వాళ్లకి ఎంత మోసం చేస్తున్నానో అర్థమవుతుంది అని అంటే మనం చేస్తున్నది మోసం కాదు, బాధని భరిస్తున్నాం అంతే అని అంటాడు. ఇవాళ కాకపోతే రేపైనా నిజం తెలుస్తుంది కదా అప్పుడైనా నేను మోసం చేశానని అందరూ నన్ను నిలదీస్తారు కదా అని అంటే అప్పుడు కూడా మనం చెప్పాల్సింది చెబుదాంలే అని అంటాడు మురారి కానీ నాకెందుకు వాళ్ళ ముందుకు వెళ్లాలంటే చాలా భయంగా ఉంది అని అంటుంది. చూడు కృష్ణ మనమే తప్పు చేయట్లేదు మనం బాధను భరించి పక్కన వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాము. దీన్నే మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అని అంటాడు. ఇలా ఎంతకాలం అని అంటుంది కొంతకాలంవరకు తప్పదు అని అంటాడు మురారి.కృష్ణ బాధపడుతూ ఉంటుంది మురారి ఓదారుస్తూ ఉంటాడు చూడు కృష్ణ మనకు దేవుడు ఇంత బాధలో కూడా ఒక సంతోషాన్ని ఇచ్చాడు అదే సరోగసి ఈ సరోగసి ద్వారా మనం పిల్లల్ని కనొచ్చన్న విషయం అర్థమైంది అదే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నీకు పిల్లలు కలుగుతున్నందుకు పార్టీ ఏర్పాటు చేశారు అనుకో అంతేకానీ బాధపడొద్దు కృష్ణ అని అంటాడు. నాకు చాలా భయం గా ఉంది ఏసీబీ సార్ కింద చూశారు కదా పెద్ద అత్తయ్యని అత్తయ్యని చూస్తుంటే నాకు, వాళ్లకి నేను అంత అబద్దం చెప్తున్నాను అర్థం అవుతుంది అని అంటుంది అవన్నీ ఆలోచించొద్దు కృష్ణ అని అంటాడు. అప్పుడే ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది నువ్వు కళ్ళు తుడిచిపోయే వచ్చినట్టున్నారు అని మురారి డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా రేవతి ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode May 1 2024 Episode 459 highlights
Krishna Mukunda Murari Today Episode May 1 2024 Episode 459 highlights

ఇక రేవతి కృష్ణ మురారి దగ్గరికి వస్తుంది ఎండన పడి వచ్చారు కదా కాస్త మజ్జిగ తాగండి అని తీసుకువస్తుంది. మురారి కి గ్లాస్ ఇస్తుంది కృష్ణకి మజ్జిగ ఇవ్వబోతూ నేను నీకు నిన్ను ఒకటి అడగాలే తింగరి అని అంటుంది. అప్పటికే కృష్ణ చాలా బాధగా ఏడుస్తూ ఏడుపును దాచుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడూ నన్ను అమ్మ అని అంటావు కదా నేను నీకు అత్తయ్యని కాదు అమ్మని అని అంటావు అలానే అన్ని విషయాలు నాతో పంచుకుంటావు. ఏ విషయం నీకు మనసులో దాచుకోలేవు అలాంటిది ఇంత పెద్ద విషయాన్ని నాతో చెప్పకుండా ఎందుకే దాచి పెట్టావు అని అంటుంది. నువ్వు మొదటి నాతో చెప్పినట్టయితే నేను ఎంత సంతోషించే దానివో తెలుసా? ఈ వార్త మొదటి నా చెవులు పడితే బాగుంటుంది అని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా అని అంటుంది. మీ ఇద్దరి మధ్య ఇటువంటి పరపత్యాలు లేకుండా మీకు పిల్లలు కలగాలని ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నాను. ఏ దేవుడు ఇప్పుడు కరుణించి ఈ వార్త తెలిసింది నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. కాకపోతే నువ్వు కడుపులో ఏది దాచుకోలేవు కదా అన్నీ నాకు చెప్పేస్తావు కదా అలాంటిది ఇది ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నా అని అంటుంది. దాంతో కృష్ణ బాధపడుతూ ఏడుస్తుంది అయ్యో నేను ఏదో సరదాకి అన్నాను నాకు చెప్తే బాగుండేది అని అన్నాను కానీ నువ్వు ఇలా దాచి పెట్టినందుకు నేను నిన్ను ఏమనట్లేదు అని అంటుంది. అయినా మా వాడే చెప్పద్దన్నాడా వాడి వైపు చూస్తున్నావంటే అదే అయ్యుంటుంది అందరితో పాటు అమ్మ కూడా సప్రైజ్ ఇద్దాం అని అన్నాడు అన్నా అనే ఉంటాడులే మా వాడు, నువ్వైతే కచ్చితంగా చెప్పేసే దానివి వాడు దాచిపెట్టమంటే దాచిపెట్టు ఉంటావు అంతేనా అని అంటుంది. దానికి కృష్ణ బాధపడుతుంది నేను ఊరికే సరదాగా అన్నాను బాధపడవకు ఇది ఆనందపడే సమయం త్వరగా ఫ్రేష్ అయి కిందకి వచ్చేసేయండి ముందు ఈ మజ్జిగ తాగు అని ఇస్తుంది. ఇక రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణ చూశారా ఎసిపి సార్ అత్త ఏమన్నదో నేను కడుపులో ఏమి దాచుకోలేను అంట అందుకే దేవుడి బిడ్డని కూడా దాచుకోవద్దు అని తీసేసినట్టున్నాడు అని అంటుంది. కృష్ణ బాధపడొద్దు అని చెప్పాను కదా అని అంటాడు మురారి బాధపడకుండా ఎలా ఉంటానో చూపిస్తారు సంతోషాన్ని దాచుకోగలం కానీ బాధని ఎలా దాచుకుంటాము అని అంటుంది. మురారి ఓదారుస్తూ ఉంటాడు.

Krishna Mukunda Murari Today Episode May 1 2024 Episode 459 highlights
Krishna Mukunda Murari Today Episode May 1 2024 Episode 459 highlights

ఇక మరోవైపు ముకుందా ఇంట్లోకి వస్తు, రెండు పనులు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి ఇక కృష్ణ మురారి ఇద్దరు సరోగసి కోసం సంతకం పెట్టడమే ఆలస్యం తర్వాతే ఇక నా ప్లాన్ మొత్తం కంప్లీట్ అయినట్టే అని అనుకుంటుంది. అప్పుడే ఎదురుగా ఆదర్శం వచ్చి ముకుందని పిలుస్తాడు వచ్చావా అని ఆ మనసులో అనుకుంటుంది ముకుంద. నవ్వుతూ ఆదర్శ్ దగ్గరికి వెళ్తుంది ఏంటి ముకుందా అంత సంతోషంగా ఉన్నావని అడుగుతాడు. ఏం నేను సంతోషంగా ఉండకూడదా అని అంటుంది. అయ్యో అలా అని కాదు అని అంటే అదేంటి నాకు సంతోషంగా ఉండే హక్కు కూడా లేదా అని అంటుంది అయ్యో ముకుందా నేను అలా మాట్లాడట్లేదు నువ్వు సంతోషంగా ఎందుకు ఉన్నావు కారణం చెప్తే నేను కూడా సంతోషిద్దామని అని అంటాడు. మనసులో ముకుందా నేను ఎందుకు సంతోషంగా ఉన్నానో తెలిస్తే గుండె పగిలి చస్తావు అని అనుకుంటుంది. అయినా ముకుందా జాబ్ కోసం వెతుక్కోవడానికి వెళ్ళావా అని అడుగుతాడు లేదు అని అంటుంది. మా అమ్మ ఇంట్లోని స్థానం గురించి చెప్తానంది కదా అందుకని బయట జాబ్ కూడా చూసుకుంటున్నావేమోనని అని అంటాడు ఏదైనా ఆవిడ చెప్పేది నా మంచికే కదా అందుకే నేను దాని గురించి తర్వాత ఆలోచిద్దాం అనుకుంటున్నాను అని అంటుంది. నా సంగతి పక్కన పెట్టండి ఇంట్లో ఏంటి హడావిడి ఇదంతా ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఎందుకు అని అంటుంది. ఆవిడ గారు నెల తప్పరు ట ఇంట్లో ఫంక్షన్ ఏర్పాటు చేశారు అని అంటాడు. ఓహో సరోగసి ద్వారా పిల్లనికంటూ ఇంట్లో గర్భవతిగా నాటకం ఆడుతున్నారా ఎంతకాలం ఆడుతారు నేను చూస్తాను కదా అని మనసులో అనుకుంటుంది. ఎవరి ఆనందం వాళ్లది మనం ఎందుకు కాదనాలి అయినా మీకు కృష్ణ మీద కోపం ఉంటే అది మీ మనసులో దాచుకోండి బయటికి చెప్తే ఇప్పుడు అందరూ మిమ్మల్ని దోషిగా చూస్తారు అలాంటప్పుడు ఎందుకు మన మనసులో కోపాన్ని బయట పెట్టాలి అవసరం వచ్చినప్పుడు నేను వాడుకుంటాలే అని మనసులో అనుకుంటుంది. నాకు కొంచెం పని ఉంది నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది ముకుంద. ఇక మరోవైపు భవానీ దేవి ఫంక్షన్ కి కృష్ణుని రెడీ చేస్తూ ఉంటుంది కృష్ణ బాధపడుతూ ఉంటుంది భవానీ దేవి అన్నీ బంగారు ఆభరణాలు కృష్ణకి పెడుతూ చాలా సంతోషంగా ఉంటుంది కృష్ణ మాత్రం భవాని దేవి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక చాలా తయ అని అంటుంది ఈ ఒక వడ్రానం పెట్టుకొని బలవంతంగా కృష్ణుని రెడీ చేసి కిందకి తీసుకువెళ్తుంది భవాని. ఇక ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు ముకుందా అక్కడి కిందకి వచ్చి అదంతా చూసి ఏం నాటకాలు ఆడుతున్నావ్ కృష్ణ. ఇప్పుడు కనక ఇది అబద్దం అని తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఇంట్లో అని అంటుంది. ఇక అందరూ కృష్ణకి ఫంక్షన్ చేస్తారు. ఫంక్షన్ అయిపోయేసరికి ముకుందా కృష్ణ దగ్గరికి వెళ్లి కంగ్రాచులేషన్స్ అని చెప్తుంది దాంతోపాటు మురారి దగ్గరకు కూడా వెళ్లి కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉంటుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari Today Episode May 1 2024 Episode 459 highlights
Krishna Mukunda Murari Today Episode May 1 2024 Episode 459 highlights

రేపటి ఎపిసోడ్లో ఫంక్షన్ పూర్తయ్యేసరికి, డాక్టర్ వైదేహి కృష్ణ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఎక్స్క్యూజ్మీ మేడం అని అంటుంది దాంతో భవాని ఎవరమ్మా అని అడుగుతుంది. ఇక్కడ సరోగసి కి మదర్ కావాలన్నారండి దాని గురించి మాట్లాడడానికి వచ్చాను అని అంటుంది. ఆ మాట విని ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు కృష్ణ వెంటనే కుర్చీలో నుంచి లేచి మురారి పక్కకు వెళ్లి కంగారుగా చూస్తుంది ఇక మురారి కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు. ముకుంద మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella