NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

Ramayana: హిందువుల పవిత్ర గ్రంథమైన‌ రామాయణాన్ని ఇప్ప‌టికే ఎంద‌రో ద‌ర్శ‌కులు వెండితెర‌పై ఆవిష్క‌రించారు. ఈసారి నితేష్ తివారీ వంతు వచ్చింది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్ తో నితేష్ తివారీ బాలీవుడ్ లో రామాయ‌ణ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఎంద‌రో తార‌లు భాగం అవుతున్నారు. ఇటీవ‌ల యాన‌మల్‌ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ర‌ణ‌బీర్ క‌పూర్ రాముడిగా, టాలీవుడ్ న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి సీత‌గా న‌టిస్తున్నారు. క‌న్న‌డ స్టార్ య‌శ్‌, అరుణ్ గోవిల్, లారా దత్తా, బాబీ డియోల్, విజయ్ సేతుపతి, సన్నీ డియోల్, ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌దిత‌రులు ఈ చిత్రంలో ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

బాలీవుడ్ రామాయ‌ణ‌లో రావణాసురిడి పాత్రలో న‌టించ‌డ‌మే కాకుండా య‌శ్‌ మరో బాధ్యతను కూడా తీసుకున్నారు. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సహ నిర్మాతగా య‌శ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ ఇప్ప‌టికే అధికారికంగా ప్ర‌క‌టించింది. మొత్తం మూడు భాగాలుగా రామాయ‌ణ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు. అలాగే కొన్ని నెలల పాటు ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొన్న ఈ సినిమా ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది.

ముంబైలో నితేష్ తివారీ షూటింగ్ ను ప్రారంభించారు. న‌టీన‌టుల లుక్స్ లీక్ అవ్వ‌కూడ‌ద‌ని సెట్స్‌లోకి సెల్‌ఫోన్‌లను నిషేధించారు. అయిన‌ప్ప‌టికీ చిత్ర టీమ్ కు షాకులు త‌ప్ప‌డం లేదు. కొన్ని రోజుల క్రితం రామాయణం సెట్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. వాటిల్లో అరుణ్ గోవిల్ దశరథ్ రాజుగా, లారా దత్తా కైకేయి గెటప్‌లో కనిపించారు. ఇక తాజాగా సీతారాముల గెట‌ప్స్ లో ఉన్న‌ సాయి ప‌ల్ల‌వి, ర‌ణ‌బీర్ క‌పూర్ ల లుక్స్ ఆన్ లైన్‌లో లీక్ అయ్యాయి. మెరూన్ క‌ల‌ర్ సాంప్రదాయ దుస్తుల్లో ఇద్ద‌రూ మెరిసిపోయారు.

ముఖ్యంగా సాయి ప‌ల్ల‌వి సీతగా యువరాణి లుక్‌లో ఎంతో న్యాచుర‌ల్ గా క‌నిపించి ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం రామాయణ నుండి లీకైన ర‌ణ‌బీర్ క‌పూర్‌, సాయి పల్ల‌వి లుక్స్ నెట్టింట ఓ రేంజ్ లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఎటువంటి ప్ర‌క‌ట‌న లేకుండా గ‌ప్ చుప్ షూటింగ్ ప్రారంభించిన‌ప్ప‌టికీ చిత్ర యూనిట్ కు లీకుల బెడ‌ద మాత్రం త‌ప్పడం లేదు. కాగా, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న రామాయ‌ణ కోసం ర‌ణ‌బీర్ క‌పూర్ మ‌రియు సాయి ప‌ల్ల‌వి భారీ రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్నారు. గ‌త చిత్రం యానిమ‌ల్ కోసం రూ. 30 కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకున్న ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయ‌ణ కోసం ఏకంగా రూ. 75 కోట్లు డియాండ్ చేశాడ‌నే టాక్ ఉంది. మూడు భాగాలుగా సినిమా రాబోతున్న నేప‌థ్యంలో అత‌ని మొత్తం రెమ్యున‌రేష‌న్ రూ. 225 కోట్లు అని ఇటీవ‌ల ప్రచారం జ‌రిగింది. అలాగే సాయి ప‌ల్ల‌వి రూ. 18 కోట్లు ఛార్జ్ చేస్తుండ‌గా.. క‌న్న‌డ స్టార్ య‌శ్ రావ‌ణాసురుడు పాత్ర కోసం రూ. 80 కోట్లు రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్నాడ‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి.

Related posts

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల అంశంపై తీర్పు రేపటి వాయిదా

sharma somaraju

Vistara Bomb Threat: శ్రీనగర్ వెళ్తున్న విస్తారా విమానానికి బూటకపు బాంబు బెదిరింపు .. ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై ప్రభావం

sharma somaraju

Sheep Scam: గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్

sharma somaraju

AB Venkateswararao: పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. చివరి రోజు సంచలన వ్యాఖ్యలు

sharma somaraju

ఎయిరిండియాకు నోటీసులు జారీ చేసిన డీజీసీఏ

sharma somaraju

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Amit Shah: తిరుమల శ్రీవారి అభిషేక సేవలో అమిత్ షా దంపతులు

sharma somaraju