NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

EC AP CEO Mukesh Kumar Meena

నామినేషన్ల పరిశీలనలో 25 పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లు ఆమోదం పొందినట్లు తెలిపారు. పరిశీలన అనంతరం పార్లమెంట్ కు 183 నామినేషన్లు, అసెంబ్లీ కు 939 నామినేషన్లను తిరస్కరించామని పేర్కొన్నారు.

నామినేషన్ల ఆమోదం విషయంలో అత్యధికంగా నంద్యాల పార్లమెంటు కు 36 నామినేషన్లు.. రాజమహేంద్రవరం పార్లమెంట్ కు అత్యల్పంగా 12 నామినేషన్లు ఆమోదించబడ్డాయన్నారు. నామినేషన్ల ఆమోదం విషయంలో తిరుపతికి అత్యధికంగా 48 నామినేషన్లు..చోడవరం అసెంబ్లీకి అత్యల్పంగా 6 నామినేషన్ల ఆమోదించబడ్డాయన్నారు.

ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని, నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు మినహా మిగిలిన వారు మే 13న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా పరిగణించబడతారని ఆయన తెలిపారు.

నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ తీవ్ర ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో దాఖలు కావడంతో వాటిని స్క్రూటినీ చేసేందుకు రెంటర్నింగ్ అధికారులు రెండు రోజుల సమయం తీసుకున్నారు.

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

Related posts

America: అమెరికాలో హైదరాబాదీ యువతి అదృశ్యం

sharma somaraju

కౌంటింగ్ ఆఫ్ట‌ర్ ఏపీ పాలిటిక్స్‌.. బ‌ల‌య్యేది వీళ్లే…:

అదే జ‌రిగితే వైసీపీ, టీడీపీలో ఈ టాప్ లీడ‌ర్లకు మూడిన‌ట్టే..?

వైసీపీ ఓటు బ్యాంకు చెక్కు చెద‌ర్లేదా… ఎస్ 100 % నిజం ఇది..!

జ‌గ‌న్‌, చంద్ర‌బాబు… ఎవ‌రి త‌ప్పులు వారు వెతుక్కుంటున్నారా..?

వైసీపీ, టీడీపీలో జంపిగుల‌కు కూడా.. అదే ముహూర్త‌మా..?

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ .. నైరుతి వచ్చేసింది

sharma somaraju

ఏపీ పోస్టల్ బ్యాలెట్ పంచాయతీ సుప్రీం చెంతకు..

sharma somaraju

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదు: సీఈవో మీనా

sharma somaraju

దేవినేని వార‌సుడికి ఎగ్జిట్‌ సెగ‌.. ఇలా జ‌రిగిందేంటి..?

రాజ‌కీయాల్లో వెలిగి.. మేనేజ్‌మెంట్‌లో ఓడారు..!

ఆరా మ‌స్తాన్ చెప్పింది నిజ‌మైతే.. చంద్ర‌బాబుదే విజ‌యం..!

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N