NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు పడింది. డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని వెంటనే విధుల నుండి తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. కూటమి నేతలు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏపీ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి విధుల్లో ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని కూటమి నేతలు తరచూ ఎన్నికల కమిషన్ కు పిర్యాదులు చేస్తూ వచ్చారు. అలానే శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం కూడా ఉందని తెలిపారు.

కాగా, ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ రాజేంద్రనాథ్ రెడ్డికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ స్పష్టం చేసింది. వెంటనే ఆయన కింది స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందు కోసం ముగ్గురు డీజీ ర్యాంక్ పేర్లను పంపించాలని ప్రభుత్వానికి సూచించింది.

ఎన్నికల షెడ్యుల్ విడుదల అయినప్పటి నుండి కూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూనే ఉన్నారు. కొద్ది రోజుల ముందే పలువురు కీలక అధికారులపై ఈసీ బదిలీ వేటు పడింది. సీఎస్, డీజీపీలను కూడా ఎన్నికల విధుల నుండి తప్పించాలని కూటమి నేతలు ఈసీకి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఇవేళ డీజీపీపై బదిలీ వేటు వేసింది ఈసీ.

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Related posts

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

BRS: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకున్న బీఆర్ఎస్

sharma somaraju

వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ..  అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ నివాళి

sharma somaraju

MLC Election: పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

sharma somaraju

బీఆర్ఎస్ ఫ్యూచ‌ర్‌లో ఏం క‌న‌ప‌డుతోందంటే…?

ఏపీ ఎగ్జిట్ పోల్స్‌… ఈ ఒక్క‌టి మాత్రం నిజం…!

ఆరా స‌ర్వేపై ఆరాలెందుకు… తెర‌వెనుక ఏం జ‌రిగింది..?

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Saranya Koduri

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

sharma somaraju

Telangana Exit Polls: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ .. బీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్, బీజేపీలదే హవా

sharma somaraju

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

sharma somaraju

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

sharma somaraju

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?