NewsOrbit
Cinema న్యూస్ సినిమా

Surya Kiran: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సూర్య‌కిర‌ణ్ క‌న్నుమూత‌!

Surya Kiran: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సూర్య కరణ్.. తాజాగా చెన్నైలోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సూర్యకిరణ్ మరణం పట్ల సంతాపం తెలుపుతున్నారు.

చెన్నైలో పుట్టి పెరిగిన‌ సూర్య కిరణ్ దర్శకుడు మాత్రమే కాదు.. నటుడు కూడా. మాస్టర్ సురేష్ పేరుతో 200 కు పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన సూర్యకిరణ్.. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. బాలనటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు అవార్డులను అందుకున్నారు. సుమంత్ యార్లగడ్డ హీరోగా సత్యం సినిమాను తెరకెక్కించి 2003లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్, చాప్టర్ 6 తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కానీ ఈ సినిమాలేమీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక డైరెక్టర్ గా కెరీర్ క్లోజ్‌ అయిపోయిన సమయంలో సూర్య కిరణ్ బుల్లితెర‌ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు ఆయన నిలదొక్కుకోలేకపోయారు. తొలివారమే ఇంటి బాట పట్టారు.

ఇకపోతే ప్రముఖ హీరోయిన్ కళ్యాణిని 2010లో సూర్యకిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి బంధం ఎక్కువ కాలం సాగలేదు. 2016లో సూర్యకిరణ్ కళ్యాణి విడాకులు తీసుకున్నారు. తము విడాకులకు అప్పుల కార్యముని గతంలో సూర్య కిరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. విడాకులు తీసుకున్న కూడా ఈ జన్మకు నా భార్య కళ్యాణే అని భార్య గురించి ఎంతో గొప్ప‌గా చెప్పుకొచ్చారు.

Related posts

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri