Nindu Noorella Savasam:నిండు నూరేళ్ల సావాసం, జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్. ఈ సీరియల్ జీ తెలుగులో మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చింది. ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరూ వారి వారి నటనకు, తగినట్టుగా నటిస్తూ ప్రేక్షక ఆదరణ పొందుతున్నారు. ఈ సీరియల్ లో మెయిన్ హీరోయిన్ లీడ్ అరుంధతి పాత్ర చేస్తున్న పల్లవి గౌడ. ఆ పాత్రలో ఆమె తప్పితే ఎవరూ చేయలేరు అన్నంతగా ఆమె ఒదిగిపోయిందని చెప్పవచ్చు. ఈ క్యారెక్టర్ లో ఈమె మరణించిన తరువాత ఒక ఆత్మ రూపంలో భర్త నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని ఒక డిఫరెంట్ పాత్ర. అన్ని క్యారెక్టర్స్ చేయడం ఒక లెక్క ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం ఒక లెక్క. ఒక ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సీరియల్.
పల్లవి గౌడ ప్రముఖ తెలుగు సీరియల్ పసుపు కుంకుమ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ఈమె కన్నడ భామ. పసుపు కుంకుమ లో అంజలి పాత్రలో నటించి ప్రేక్షకు ఆదరణ పొందింది. ఆ తరువాత చాలా సీరియల్స్ లో నటించింది సావిత్రి, ఫిదా, ఇలా కొన్ని సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. పల్లవి గౌడ మొదట్లో యానిమేషన్ రంగంలో అడుగు పెట్టాలనుకుంది అనుకోకుండా బుల్లితెర మీద అవకాశాలు రావడంతో తను సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది.
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ లో నటిస్తోంది. ఈమె సీరియల్ విరామంలో, తన సోషల్ మీడియాలో ప్రేక్షకులకుఅందుబాటులో ఉంటూ,తన పర్సనల్ విషయాలని మరియు సీరియల్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈమె తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక వీడియో, నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలోఏమున్నదంటే అది ఆమె డాన్స్ చేసిన వీడియో, అసలే పల్లవి గౌడ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈమె రీసెంట్ గారిలీజ్ అయిన ఒక పాటకి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ కి స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచేలా స్టెప్పులు వేసి, తన ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచిందని చెప్పవచ్చు. ఈమె లింగి లింగి లింగిడి అనే జానపద గీతానికి స్టెప్పులు వేసి అలరించింది. ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్స్ లో ఒకటిగా ఉంది. ఇక ఈమెకు ఫ్యాన్స్ సూపర్ ఎనర్జీ మీది, సో క్యూట్ సూపర్ డాన్స్ అని కామెంట్స్ పెడుతున్నారు.