Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి మధ్య ఉన్న స్నేహం ఎలాంటిదో కూడా మనందరికీ తెలిసిందే. అది రా అని పిలుచుకునే అంత స్నేహం. శోభన్ బాబు గురించి ఓ ఆశ్చర్యపోయే రహస్యం తాజాగా బయటపడింది. తెలుగు ఆడియన్స్ మనసులు గలుచుకున్న సోగ్గాడు శోభన్ బాబు ప్రస్తుతం మన మధ్య లేకపోవడం బాధాకరం. సీనియర్స్ లో టాలీవుడ్ లో అత్యంత అందగాడిగా పేరు సంపాదించుకున్నాడు శోభన్ బాబు. ఇక ఇప్పటి తెలుగు ఆడియన్స్ హృదయాలలో కూడా మంచి పేరును నిలుపుకున్నాడు. జనాలలో ఆయన గురించి తెలుసుకునేందుకు ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశాడు.
సోషల్ మీడియా ప్రభావం పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు అరుదైన మరియు ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. శోభన్ బాబు లైఫ్ స్టైల్ కూడా ఈ నేపథ్యంలోనే తెలుస్తుంది. ఆయన చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి కూడా. అందులో భాగంగా శోభన్ బాబు ఎంతగానో ఇష్టపడే నటుడు ఎవరు అనేది తెలిసిపోయింది. ఆయన అభిమానించే నటుడు మరెవ్వరో కాదు కృష్ణంరాజు. ఈ ఇద్దరు అప్పట్లో మంచి స్నేహితులు. కలిసి కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. ఒకరిని ఒకరు రా అనే పిలుచుకునే బంధం వీరిది. శోభన్ బాబు పుట్టినరోజున ఉదయాన్నే కృష్ణంరాజు ఫోన్ చేసి విషెస్ చెప్పేవారట. అంత మార్నింగ్ మొదటి కాల్ కృష్ణంరాజు నుంచే వచ్చేదట. దీంతో ఎలా గుర్తుంటుంది అని శోభన్ బాబు ఆశ్చర్యపోయే వారట. దానికి సమాధానం చెబుతూ.. కృష్ణంరాజు తండ్రి బర్తడే మరియు శోభన్ బాబు బర్తడే ఒకేరోజు.
వీరిద్దరి పుట్టినరోజులు కూడా జనవరి 14వ తారీకునే. దీంతో అలా కృష్ణంరాజుకి గుర్తుండి పోయేదట. ఈ సందర్భంగా శోభన్ బాబు ఆరాధించే నటుడు ఎవరో గతంలో తెలిపారు కృష్ణంరాజు. ఆయన కొడంబాకంలో ఉన్నప్పుడు ఓ రోజు ఇంటికి వెళ్లాడట కృష్ణంరాజు. అప్పటికే శోభన్ బాబు 10 15 సినిమాలు చేశారు. హీరోగా నిలబడ్డారు కూడా. ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన హాల్లో కూర్చుని ఉన్నారు. టీవీ చూస్తున్నారట. ఇక ఇంట్లోకి వెళ్ళగా ఎదురుగా పెద్ద బొమ్మ ఉందట. అది ఎన్టీ రామారావు ఫోటో ఆట. ఏంటి రామారావు అంటే శోభన్ బాబుకి చాలా ఇష్టమట. దీంతో ఎన్టీ రామారావు దేవుడు వేషధారణలో ఉన్న ఫోటోని దేవుడు ప్లేసులో పెట్టుకున్నాడట శోభన్ బాబు. అలా శోభన్ బాబుకి ఎన్టీ రామారావు పై ఉన్న అభిమానంతో తన ఫోటోని చాలా పెద్దగా కనులకి బాగా కనిపించే లాగా సెటప్ చేసుకుని తన ఇంట్లో పెట్టారట. ఇక ఈ ఫోటోని చూసిన తమ కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయేవారట. ఇదేంటి ఎన్టీ రామారావు ఫోటో దేవుడి ప్లేస్ లో పెట్టుకున్నారు అంటూ అనేక ప్రశ్నలు కూడా వేసేవారట. ఆయనే నా దేవుడు అని చెప్పేవాడు అట శోభన్ బాబు. అలా శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో బదులుగా రామారావు ఫోటో పెట్టుకున్నారు.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!