Krishna Mukunda Murari: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘కృష్ణ ముకుందా మురారి’. విజయవంతంగా 184 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 185 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో, ముకుంద మురారి తనను, తప్ప ఎవరిని ప్రేమించడు అని అనుకుంటుంది. ఈ హోమం లో కూర్చుంటే ఖచ్చితంగా కృష్ణ మీద ప్రేమ ఉన్నట్టే అనుకుంటుంది. అనుకున్నట్టుగానే కృష్ణ మురారి ఇద్దరు హోమల్లో కూర్చుంటారు. ముకుంద హోమ ఆపడానికి ప్లాన్ వేస్తుంది.

Krishna Mukunda Murari :ముకుంద మీద అలేఖ్య అనుమానం… ముకుంద ప్లాన్ కి హోమం ఆగినట్టేనా…
ఈరోజు ఎపిసోడ్ లో, కృష్ణా మురారిల తో పంతులుగారుప్రమాణం చేయిస్తారు.కృష్ణ అనే ఈ అమ్మాయి ఏడేడు జన్మలకి నా భార్యగా రావాలని ప్రమాణం చేస్తున్నాను. అని మురారి ప్రమాణం చేస్తాడు. అది చూసి ముకుంద షాక్ అవుతుంది. అది విని కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ముకుంద బాధ…అసూయ..
ముకుందా, మురారి ప్రమాణాన్ని చూసి, వీళ్ళిద్దరూ పూజ చేస్తున్నట్టు లేదు మళ్లీ పెళ్లి చేసుకున్నట్టుంది అని అనుకుంటుంది. మురారి ప్రమాణం చేసిన తర్వాత ముకుంద కి కళ్ళు తిరుగుతున్నట్టుగా, కృష్ణ ప్రమాణం చేస్తే పూజ కంప్లీట్ అవుతుంది కాబట్టి, కృష్ణార్జున యుద్ధం ప్రమాణం చేయించే లోపే కళ్ళు తిరిగి కింద పడుతుంది. అందరూ ముకుందా ముకుందా అంటారు. మురారి లేవబోతుండగా మీరు కూర్చోండి అని అంటుంది రేవతి. ముకుందటి ఏమీ అర్థం కాదు. పంతులుగారు ముకుంద కి నీరసం వచ్చినట్టుంది మీరు కానివ్వండి. నువ్వు మాత్రం అసలు లేవకూడదు మురారి అని రేవతి గట్టిగా చెప్తుంది. ప్రసాద్ సహాయంతో రేవతి ముకుందని రూమ్ లోకి తీసుకెళ్తుంది. రేవతి ముకుందని రూమ్ లోకి తీసుకొచ్చి, ప్రసాద్ ని నువ్వు వెళ్ళు నేను తనకి జ్యూస్ పట్టించి వస్తాను అని అంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. కొంచెం తల తిరుగుతున్నట్టు ఉంది అత్తయ్య అని అంటుంది ముకుందా. నాకు తెలుసు నువ్వు రెస్ట్ తీసుకో అని అంటుంది రేవతి. జ్యూస్ ఎమన్నా తాగుతావా, అని అంటుంది రేవతి వద్దు అంటుంది ముకుంద. నేను హోమం అయ్యాక వస్తాను నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకో అని అంటుంది రేవతి.

కృష్ణ చేత ప్రమాణం…
మురారి ప్రమాణం చేసిన తర్వాత కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పంతులుగారు మురారి తో మరలా ఇంకో ప్రమాణం చేయిస్తూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ అమ్మాయి చేయి వదలని ఊపిరి ఉన్నంతవరకు తోడునీడగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పమంటాడు. మురారి అదే మాట చెప్తాడు. అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్తాడు. అది విని కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.ముకుంద కళ్ళు తిరిగి పడిపోవడాన్ని, రేవతి ముకుంద తో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ హోమం ఆగదు అని అంటుంది రేవతి. వాళ్లబంధం తెగిపోదు అని అంటుంది.
పంతులుగారు కృష్ణని చేయి ముందుకు చాపమ్మ అని అంటాడు. కృష్ణ అనే నేను మురారి అనే ఈ అబ్బాయిని ఏడేడు జన్మలకి భర్తగా పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అని చెప్పమంటాడు. కృష్ణ మాత్రం ఆ మాట చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటుంది. ముకుంద ఈలోపు మెల్లిగా ఓపిక తెచ్చుకొని మొహం దగ్గరికి రావాలని చూస్తుంది. దూరం నుండి, కృష్ణ ప్రమాణం చేయడానికి చూస్తూ ఉంటుంది ముకుంద. కృష్ణ అనే నేను మురారి అనే సారీ సారీ ఏసిపి సార్ ని, ఏడేడు జన్మలకి నా భర్తగా,కావాలని కోరుకుంటున్నాను.ఎలాంటి పరిస్థితుల్లోనైనా,ఏసీబీ సార్ చేయి వదలని ఊపిరి ఉన్నంతవరకు తోడునీడగా ఉంటానని, అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అని కృష్ణ చేత ప్రమాణం చేయిస్తారు పంతులుగారు. దానికి కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ అగ్నిచెట్టు ఏడు ప్రదక్షిణాలు చేయండి అని అంటారు. ముకుంద దూరం నుంచి చూసి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మురారి కృష్ణతో ఏడడుగులు అగ్నిసాక్షిగా, ప్రదక్షిణాలు చూస్తూ ఉంటాడు. బ్యాక్ గ్రౌండ్ లో ఒక పెళ్లి మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ముకుంద మనసు రగిలిపోతూ బాధతో ఉంటుంది.

Nuvvu Nenu Prema: పద్మావతి మీద విక్కీ అనుమానం.. కృష్ణ ప్లాన్ మళ్లీ రివర్స్…
ముకుంద బాధ…
దూరం నుండి నించొని,పూజ చూస్తున్న ముకుందా.. నీ మీద పెట్టుకుని ఆశలన్నీ అగ్నిలో దహనం అవుతున్నట్టు అనిపిస్తుంది మురారి. నా ప్రేమ శిధిలాల కింద పడినట్టు అనిపిస్తుంది మురారి.అని మనసులో అనుకుంటూ ఉంటుంది.కృష్ణ మురారి ఇద్దరూ అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉండడాన్ని ముకుందచూడలేక పోతుంది.రేవతికి చాలా సంతోషం అనిపిస్తుంది. కృష్ణ మురారిలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ముకుంద మాత్రమే ఏడుస్తూ కళ్ళమున నీళ్లు వస్తూనే ఉంటాయి.మురారి కృష్ణ ఇద్దరికీ నిజంగా పెళ్లయినట్టు ముకుంద ఫీల్ అవుతుంది.
కృష్ణ మురారి ల ప్రేమ….
మురారి రూమ్ లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణ కూడా వస్తుంది.
మురారి,అవును హోమం జరిగేటప్పుడు కృష్ణ ముఖములో హ్యాపీనెస్ చూశాను. మనసులో తన ప్రేమని నాతోచెప్పలేకపోతుందా అడిగేస్తే అని అనుకుంటాడు. కృష్ణ కూడా అదే టయానికి ఏసీపీ సార్ మోహన్ లో హోమం జరిగేటప్పుడు చాలా సంతోషం చూశాను. తనని అడిగేద్దాము అని అనుకుంటుంది. ఇద్దరూ ఒకేసారి అడుగుదామని అనుకునేటప్పటికీ మురారిని మొదట, కృష్ణ అని పిలిచాడు కాబట్టి తనని చెప్పమంటుంది.లేడీస్ ఫస్ట్ కదా నువ్వు చెప్పు అని అంటాడు. అడిగేస్తే, వద్దులే అనుకుంటాడు. కృష్ణ ప్లీజ్ నువ్వు చెప్పవా ముందు అని అంటాడు. ఏంటి ఇంత రిక్వెస్ట్ గా అడుగుతున్నాడు నేను మూడు నెలల్లో వెళ్ళిపోతున్నాను అని చెప్పాలి అని అనుకుంటున్నాడా, అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణ. తన మనసులోది చెప్పకుండా నాతో చెప్పించాలనుకుంటున్నాడా, చెప్పను అసలు చెప్పను అనుకుంటుంది. కృష్ణ చెప్పు అని అంటాడు మురారి.
ముకుందా గురించి కృష్ణ అరా…

మిమ్మల్ని ముకుంద గురించే అడుగుదాం అనుకుంటున్నా అని అంటుంది కృష్ణ. ముకుంద గురించా అని ఒకసారి గా షాక్ అవుతాడు మురారి. ముకుంద గురించి ఏం అడగాలి అని అంటాడు. ఏంటి సి పి సార్ ఇందాకటి నుంచి చూస్తున్నాను అంత టెన్షన్ గా ఉన్నారు ఎందుకు. టెన్షన్ ఆ టెన్షన్ ఎందుకు అదేం లేదు కృష్ణ. ఏదో ఉంది ఆ టెన్షన్ ఏంటో కనుక్కోవాలి అనుకుంటుంది కృష్ణ. ఏం లేదు ముకుందా కళ్ళు తిరిగి పడిపోతేను ఒక డాక్టర్ గా ఏమైందని ఆలోచించి మిమ్మల్ని అడుగుతున్నాను అని అంటుంది. అంతకుమించి ఏమీ లేదు ఏసిపి సార్ అంటుంది. హోమం బాగా జరిగింది కదా కృష్ణ అని అంటాడు మురారి. ఈ క్రెడిట్ అంతా అత్తయ్యదే. అసలు ఎంతసేపు నేను కూర్చుంటానా అని అనుకున్నాను అసలు టైం అయితే తెలియలేదు అని అంటుంది కృష్ణ. అంటే ఇష్టం ఉన్నట్టే కదా అని అనుకుంటాడు మురారి. ఇప్పుడు నాకు కూడా అలానే అనిపించింది. అని ఏసీపీ సార్ అంటే ధైర్యం మర్చిపోయినట్టే, ఎసిపి సార్ మళ్లీ ఏదో ఆలోచనలోకి వెళ్లిపోయారా, కృష్ణ నువ్వు ఏమీ అనుకోవట్లేదు కదా, ఇంకోసారి నా దగ్గర సారీ థ్యాంక్స్లు ఏమనుకోవట్లేదు, ఇలాంటి మాటలు అన్నారనుకో మూడు నెలలు కాదు ఇప్పుడే వెళ్లిపోతాను అని అంటుంది. అంత తొందరగా ఉందా వెళ్లిపోవడానికి అని అంటాడు. లేదే చెప్పి సార్ ఊరికే సరదాగా అన్నాను అని అంటుంది కృష్ణ.ఏంటో చెప్పండి సార్ అంటుంది. ఏం లేదు ఆనంగల్ని అయితే ఇప్పుడే వెళ్ళిపోతాను అని అంటుంది. ఎక్కడికి వెళ్తావు అని అంటాడు. నా పుట్టింటికి అని అంటుంది. నేను చెప్పమంటాను ఏం లేదు అని అంటాడు. నేను చెప్పమంటాను మీరేం లేదంటారు ఇదేగా జరిగేది. సరే హోమం ఎందుకు చేశారో చెప్పు. భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండాలని, ఆ మాటకి ఇద్దరు ఒకరికి ఒకరు చూసుకుంటారు. నేను మీతో కలిసినంతకాలం మీరే నా భర్త. ఆ హోమంలో చెప్పినట్టుగా మీరే ప్రపంచం, నాకు ఎప్పటికీ అని, మనసులో అనుకుంటుంది. కృష్ణ మన బంధాన్ని శాశ్వతంగా ఇట్లనే ఉండేలా చేస్తాను అని మురారి కూడా అనుకుంటాడు.

మురారి మీద ముకుంద కోపం…
ముకుంద మాత్రం హోమల్లో మురారి, చేసిన ప్రమాణాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కృష్ణ ప్రమాణం చేసింది కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చూడాలనుకున్న వాటిని ఈ కళ్ళు చూసాయి, మనం చేయాలనుకున్న పనుల్ని మనసు చేస్తుంది ఇంకేమాత్రం ఇష్టం లేకున్నా హోమాన్ని ఆపే వాడివి. నువ్వు హోమాన్ని ఆపలేదంటే నీకు ఇష్టం ఉన్నట్టే కదా, ఇష్టం లేకపోతే ఎంత సంతోషంగా అలా ప్రమాణం చేసావు. మన ప్రేమని మర్చిపోయావా. మనసు మారిపోయిందా, ఎందుకు మురారి ఎందుకు ఇలా చేశావు. నిన్ను తలుచుకోని క్షణం ఉండదు నీ ఊసులేనిదే వద్దేపోదు. కట్టుబాట్లు కట్టుబడి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఈ వ్యక్తిత్వం కాపాడుకోవడం కోసం మన ప్రేమ అస్తిత్వాన్ని గంగ లో కలిపేస్తావా,మీ గురువు గారి మీద జాలిపడి,తన అమాయకత్వానికి మీ అందరికీ నచ్చడంతో భార్యా గా అంగీకరించావా, మరి నేనేం అవ్వాలి మురారి. నువ్వు నన్ను మర్చిపోయిన అంత తేలిగ్గా నేను మర్చిపోలేను. ప్రేమ ఒకసారి ఒకరి మీద పుడుతుంది అంటారు అలా, నాకు నీ మీద పుట్టింది ఆ ప్రేమని, కంటిన్యూస్నే కానీ మధ్యలో ఆపేది ఉండదు. నాకిచ్చిన మాట నువ్వు ఎలా తప్పుతావో కృష్ణ ని భార్యగా ఎలా అంగీకరిస్తారో నేను చూస్తాను. అని మురారి మీద కోపంతో అనుకుంటుంది.
కృష్ణ,మురారిల అల్లరి…

కృష్ణ మురారి,ఇద్దరూ ఒకేసారి,నిద్ర లేస్తారు.ఇద్దరి ఒకేసారి రెడీ అవ్వాలి అనుకుంటారు.కృష్ణ ఎసిపి సార్ ఈరోజు నేను రెడీ అవుతాను ఫస్ట్ నేను హాస్పిటల్ కి అర్జెంటుగా వెళ్లాలి అని అంటుంది. మురారి నేను ముందు రెడీ అవుతాను కృష్ణ ఎందుకంటే నాకు ఒక కేసు ఉంది. నేను వెళ్లకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. రెసిపీ సార్ నాకు ఆపరేషన్ ఉంది నేను ఆపరేషన్ చేయకపోతే వాళ్ళు లైఫ్ అయిపోతుంది. నాది అలాంటి పరిస్థితి కృష్ణ అని అంటాడు. సరే అయితే సరే ఇద్దరం ఎమర్జెన్సీ కాబట్టి ఒకేసారి ఫ్రెష్ అవ్వాలి కాబట్టి, ఎవరు ముందు అనేది భగవంతుడు కి వదిలేద్దాం. పైవాడేంటి భగవంతుడు ఏంటి. పైవాడంటే పై పోషన్లో ఉండేవాడు కాదు ఏబీసీల అబ్బాయి భగవంతుడు అని అర్థం. మనిద్దరిలో ఎవరు ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలనేది దేవుడు ఎలా నిర్ణయిస్తాడు. చెప్తాను మీ దగ్గర ₹1 కాయిన్ ఉంటే ఇవ్వండి. నా దగ్గర లేదు అని అంటాడు. నా దగ్గర ఉంది ఉండండి అని ₹1 కాయిన్ తీసుకొస్తుంది. హెడ్డ,టైల్స్ అంటుంది ఆల్వేస్ టైల్స్ అని అంటాడు.కాయిన్ పైకి వస్తే అది అటు ఇటు పడకుండా మధ్యలో నిలబడుతుంది. ఇదేంటి ఏసిపి సార్ ఇది కూడా ఇట్లానే చేసింది. ముందు నువ్వు వెళ్లి కృష్ణుడి అమ్మాయిలు అద్దం ముందు నేను ఒక గంట రెడీ అవుతారు కదా ఈలోపు నేను ఎల్లి స్నానం చేసేస్తాను అని అంటాడు. ఈ మాత్రం దానికి ఇంత టైం వేస్ట్ చేస్తారా ఇందాకే చెప్పొచ్చుగా, ఆనీ కృష్ణ లోపలికి వెళ్తుంది. బాత్రూంలో నుంచి ఏసీపీ సార్ అని అరుస్తుంది. అక్కడ ఒక ఫైల్ ఉంటుంది చూడండి అని అంటుంది. దాన్ని ఓపెన్ చేయండి అని అంటుంది. దానిలో పేషంట్ లిస్ట్ ఉంటుంది చదవండి. మురారి అందరి పేర్లు చదువుతూ ఉంటాడు. ఎవరి వీళ్లంతా, నా పేషెంట్స్ శ్రీకాంత్ కి రెడ్ మార్క్ పెట్టండి మిగిలిన వాళ్ళ గ్రీన్ మార్క్ పెట్టండి అని చెబుతుంది. మురారి అలానేని అన్ని చేస్తూ ఉంటాడు. కృష్ణ బాత్రూం లో నుంచి డైరెక్షన్ చేస్తూ ఉంటుంది. ఈ రెడ్ మార్క్ పేషెంట్లు నిన్ను సతాయిస్తారా ఏంటి. గ్రీన్ మార్క్ ఏంటి రెడ్ మార్క్ ఏంటి. రెడ్ మార్క్ వాళ్ళందరూ ఆపరేషన్ తీసుకెళ్లాలి గ్రీన్ మార్క్ అందరు డిశ్చార్జ్ అవుతారు అని అంటుంది. అయినా నా చాత ఎందుకు చేయిస్తున్నావు అని అంటే ఇది నీకు పరిష్మెంటు అని అంటుంది. చేసింది చాలా నీకు పేషెంట్స్ ఇంజక్షన్ కూడా చేసి రావాలా అని అంటాడు మురారి. మురారి కూడా బాత్రూంలో నుంచి, నా యూనిఫామ్, ఐరన్ చేసి పెట్టు అని అంటాడు. అది రెడీ గానే ఉంటుంది అని అంటుంది కృష్ణ. నాకు షూ పాలిష్ చెయ్యి, అన్ని రెడీగా ఉన్నాయి ముందు మీరు రండి అంటుంది కృష్ణ.
రేపటి ఎపిసోడ్ లో,మురారి కృష్ణ ఇద్దరు రెడీ అయ్యి బయటకు వెళ్తూ ఉంటారు. కృష్ణ తొందరగా వచ్చేయ్ నేను బయట ఉంటాను అని అంటాడు మురారి. ఎసిపి సార్ మనం బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని అంటుంది. ఇప్పుడు తిండిగోలేనా బయట చేద్దాం లేరా అని అంటాడు. సరే అని కృష్ణ మురారి బైక్ ఎక్కుతుంది. దూరం నుంచి ఇదంతా ముకుంద చూస్తూ ఉంటుంది. మీరిద్దరూ బయట బ్రేక్ ఫాస్ట్ ఎలా చేస్తారు నేను చూస్తాను అనిఅంటుంది.. చూడాలి రేపటి ఎపిసోడ్లో ముకుంద ప్లాన్ ఏంటో…