NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 15  2023 Episode 2053: అరుణ్ కుమార్ వాళ్లు బంటికి గతం గుర్తు చేయడానికి మళ్లీ ఏ ప్రయత్నం చేయనున్నారు.

Kumkuma Puvvu Today Episode December 15  2023 Episode 2053 Highlights

Kumkuma Puvvu December 15  2023 Episode 2053: చంద్రం ఒక పంతులు గారిని తీసుకొని ఇంటికి వస్తాడు కావేరి ఏంటి ఈ పంతులుగారు ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది చంద్రం చూడు కావేరి ఆశ బండిలా పెళ్లి ఎలాగో హంగామా లేకుండా రిజిస్టర్ ఆఫీస్ లో జరిగిపోయింది అలా అని జరగవలసిన తంతు ఫస్ట్ నైట్ ఇంకా ఒకటి ఉంది కదా దానినైనా కొంచెం పద్ధతిగా జరిపిద్దామని మంచి ముహూర్తం కోసం పంతులు గారిని నేనే తీసుకు వచ్చాను అంటాడు చంద్రం. కావేరి అబ్బో అబ్బో అట్లాంటా లో నిలబడి అప్పారావు అని పిలిస్తే అరడజనం అంది హాయ్ అని పరిగెత్తుకుంటూ వచ్చినట్లు మీ మట్టిబుర్రలో ఇన్నాళ్ళకి మెర్క్యూరీ బల్బు వెలిగింది పర్వాలేదు అంటుంది కావేరి.

Kumkuma Puvvu Today Episode December 15  2023 Episode 2053 Highlights
Kumkuma Puvvu Today Episode December 15  2023 Episode 2053 Highlights

చంద్రం కావేరి మెల్లిగా మాట్లాడు అమృత వాళ్లకి ఈ విషయం తెలియకూడదని చెబుతున్నాను అంటాడు. కావేరి అలాగేనండి అంటూ అయ్యా పంతులుగారు మీరు ఇలా వచ్చి కూర్చుండి ముహూర్తం చూడండి అంటుంది. పంతులుగారు అయ్యా పెళ్లి జరిగిన పదహారు రోజులలోపు శోభనము జరిగితే దానికి ఎలాంటి ముహూర్తము చూడనవసరం లేదు పదహారు రోజులు గడిచిపోయాక ఆ తంతు జరగాలి అంటే గర్భాదారానికి మంచి ముహూర్తం చూసి పెట్టాలి అంటాడు. కావేరి అది చెప్పడానికే కదా మిమ్మల్ని పిలిచింది అరవై పేజీల కవితల పుస్తకం రాయటానికి దానికి కంటే ముందుమాట ఇరవై పేజీలు రాసినట్టు నచ్చపెట్టకుండా త్వరగా ముహూర్తం చూసి చెప్పండి అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 15  2023 Episode 2053 Highlights
Kumkuma Puvvu Today Episode December 15  2023 Episode 2053 Highlights

కట్ చేస్తే అరుణ్ కుమార్ వాళ్ళు కారులో వస్తుండగా అంజలి ఎదురుగా కనిపిస్తుంది. అమృత ఏమండీ అదిగో అంజలి అటు నడుచుకుంటూ వెళుతుంది అంటుంది. అరుణ్ కుమార్ అవును అమృత మన అంజలి పద ఎలాగైనా తనని తీసుకొని పకీర్ బాబా దగ్గరికి వెళదాము అంటూ అంజలి దగ్గరికి వెళతారు. అమృత అంజలి ఎక్కడినుండి వస్తున్నావ్ అంటుంది. అంజలి మీకు ఎన్ని సార్లు చెప్పాలండి నేను అంజలిని కాదు లక్ష్మీని అంటుంది. అమృత అదే లక్ష్మి మర్చిపోయి అలా అనేసాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ మేము అటే వెళ్తున్నాం నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము వెళ్తాము పద అంటుంది.లక్ష్మి ఏమి అవసరం లేదు నేను నడుచుకుంటూ వెళ్తాను మీరు వెళ్ళండి అంటుంది. అరుణ్ కుమార్ అయ్యో అదేంటమ్మా నిన్ను చూస్తే మా కూతురు అంజలిని చూసినట్టే ఉంటుంది కదా మరి మేము ఆ మాత్రం సాయం చేసే తప్పేముంది చెప్పు మేము నిన్ను మీ ఇంటి దగ్గర దింపి మామ ఇంటికి వెళ్ళిపోతాం పదమ్మ కాదనుకు అంటాడు అరుణ్ కుమార్. అంజలి సరే పదండి అంటూ వచ్చి అరుణ్ కుమార్ వాళ్ళ కారు ఎక్కుతుంది.అమృత అంజలి వచ్చి కారులో కూర్చోగానే పకీర్ బాబా దగ్గరికి తనని తీసుకు వెళ్లినట్లు ఫకీర్ బాబా అంజలి శరీరంలో ఉన్న లక్ష్మీ ఆత్మని బయటికి పారదోలినట్లు కలగని అయిపోయింది అంతా అయిపోయింది వెళ్ళిపోయింది అంటూ నవ్వుతూ ఉంటుంది అమృత. అది చూసిన లక్ష్మి ఏంటి ఏమైపోయింది అని అడుగుతుంది. అమృత అదేనమ్మా వానకాలం పోయి చలికాలం వచ్చింది కదా అందుకే అలా అనేసాను సంతోషంతో అంటుంది అమృత.

Kumkuma Puvvu Today Episode December 15  2023 Episode 2053 Highlights
Kumkuma Puvvu Today Episode December 15  2023 Episode 2053 Highlights

కట్ చేస్తే సాగర్ కారు తీసుకొచ్చి అమృత వాళ్ల కారు కు అడ్డం పెడతాడు అది చూసిన అరుణ్ కుమార్ కారు ఆపుతాడు. సాగర్ కారు దిగి వచ్చి అరుణ్ కుమార్ ని ఏంటి మా లక్ష్మిని ఎటు తీసుకు వెళుతున్నారు అంటాడు. అమృత అదేం ప్రశ్న లక్ష్మి రోడ్డు మీద కలిస్తే ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాము రా అని తీసుకు వస్తున్నాముఅంటుంది. సాగర్ ఏంటి మీ డ్రామాలు ఆపండి మీరు కావాలనే మా లక్ష్మిని ఎటో తీసుకు వెళుతున్నారు లేకపోతే కారు లెఫ్ట్ కు ఎందుకు తిప్పుతారు మా ఇల్లు అటు లేదు కదా అంటాడు. అరుణ్ కుమార్ ఏదో మాట్లాడుకుంటూ మర్చిపోయారేమో కానీ ఇంటికైతే చేరుకుంటాం కదా అంటాడు. సాగర్ చాలు ఇక మీ డ్రామాలు చూసి చూసి నాకు నేను విసిగితే పోయాను మీరు ఇంకోసారి మా ఇంటికి అంజలి వంకతో రావద్దు అంటాడు.అరుణ్ కుమార్ అదేంటి లక్ష్మీ ఎంత కాదనుకున్నా నాకు కూతురు లాంటిది నా కూతురు లాగా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం చేస్తే తప్పేముంది అంటాడు. సాగర్ ఏమీ అవసరం లేదు ఏదో ఒక డ్రామా చేసి మీరు లక్ష్మీని నీ కూతురు అంజలి అని తీసుకువెళ్లడానికి చూస్తున్నారు అంటాడు. అరుణ్ కుమార్ సాగర్ అలా మాట్లాడితే ఏంటి లక్ష్మికి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధి ఉందని డాక్టర్ చెప్పాడు కదా ఒకసారి లక్ష్మీ గా మరోసారి అంజలిగాను ప్రవర్తిస్తుందని డాక్టర్ చెప్పారు కదా మరి అలాంటప్పుడు లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అందులో మేము చేసింది తప్పేముంది చెప్పు అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 15  2023 Episode 2053 Highlights
Kumkuma Puvvu Today Episode December 15  2023 Episode 2053 Highlights

సాగర్ నా భార్యను చూసుకోవడానికి నేను ఉన్నాను అంటాడు. అమృత రోడ్డుమీద కనిపిస్తే మేము తీసుకు వచ్చాము తప్పేముంది అంటుంది. లక్ష్మి ప్లీజ్ మీరు ఈ గొడవ ఆపండి ఆయన నా భర్త సాగర్ నేను లక్ష్మిని ప్లీజ్ ఇక మీరు ఈ గొడవ ఆపండి నేను మా ఆయనతో కలిసి వెళ్తాను మీరు వెళ్ళండి అంటూ లక్ష్మి సాగర్ ని తీసుకొని వెళుతుంది.అమృత అయ్యో ఇదేంటండి ఇలా జరిగింది అసలు ఎందుకు వచ్చినట్లు మనం అనుకున్న ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది మళ్లీ అంజలి మనకు ఎలా దొరుకుతుంది చెప్పండి ఎప్పుడు బాబా దగ్గరికి తీసుకు వెళ్తాము మన అంజలి ఎప్పుడు మామూలు అంజలి లాగా మారుతుంది నాకేమీ అర్థం కావడం లేదు అంటూ అమృత ఏడుస్తుంది. అరుణ్ కుమార్ ఊరుకో అమృత మనం మాత్రం ఏం చేయగలం ప్లీజ్ ఏడవకు ఇంకోసారి ట్రై చేద్దాం అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 15  2023 Episode 2053 Highlights
Kumkuma Puvvu Today Episode December 15  2023 Episode 2053 Highlights

అమృత ఈ లక్ష్మీ ఆత్మ ఇంకా తృప్తి చెందలేదు ఎందుకండీ నా కూతురు అంజలి చేసిన దాంట్లో తప్పేముంది చనిపోయిన ఆ లక్ష్మికి ఇచ్చిన మాట ప్రకారం కొన్నాళ్లు తన ఇల్లును తన భర్తను కూతుర్ని బాగానే చూసుకుంది కదా ఇంకా ఏం చేయాలండి ఆ లక్ష్మీ ఆత్మ శాంతించాలంటే మన అంజలికి తనకంటూ జీవితం ఉంది కదా అది చూసుకోవద్దా ఆ ఆత్మ అలా చేయడం తప్పు కదా చెప్పండి అంటుంది. ఊరుకో అమృత మనం మాత్రం ఏం చేయగలం ఎంతసేపు మనతో మాట్లాడింది లక్ష్మీ ఆత్మనే అంటాడు అరుణ్ కుమార్

 

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella