NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

Nuvvu Nenu Prema May 6 Episode 616

Nuvvu Nenu Prema:అరవింద, ఫంక్షన్ హడావిడి అయిపోయిన తర్వాత, తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళని మనిషి ఇవాళ ఇంత టైం అయినా ఇంకా ఇంటికి రాలేదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శాంతాదేవి, నారాయణ అందరు కుటుంబ సభ్యులు వస్తారు. ఆర్య బావ ఏదో పనిమీద వెళ్లి ఉంటాడు లే అక్క దాని గురించి ఇంత ఆలోచిస్తావ్ ఎందుకని అని అంటాడు. లేదురా ఏదైనా పని ఉంటే నాకు చెప్పే వెళ్తాడు అలాంటిది ఈసారి చెప్పకుండా వెళ్ళాడు అయినా నాకెందుకు ఇంకా ఇంటికి రాలేదని కంగారుగా ఉంది అని అంటుంది. అప్పుడే అక్కడికి పద్మావతి పాలు తీసుకొచ్చి ఇస్తుంది ముందు ఈ పాలు తాగండి వదిన మీరు అసలే వట్టి మనిషి కూడా కాదు మీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా మీరు ఈ పాలు తాగాలి అని అంటే నాకు తాగాలని లేదు అక్కడ పెట్టి వెళ్ళు అని అంటుంది. ఏదైనా ఆలోచన ఉంటే అది ముందు ఆహారం తీసి నాకు తీసుకో నాకైనా చెయ్యొచ్చు అని అంటుంది శాంతాదేవి కూడా పద్మావతి చెప్పేది నీ బిడ్డ కోసమే కదా అని అంటుంది అయినా అది కాదు నానమ్మ నా మనసు ఎందుకు బాలేదు అని అంటుంది.

Nuvvu Nenu Prema May 6 Episode 616
Nuvvu Nenu Prema May 6 Episode 616

ఇక పద్మావతి మీరు అంతగా బాధపడాల్సిన అవసరమేం లేదు ఒకవేళ కృష్ణ గారు ఏదైనా ఆపదలో ఉంటే మీ తమ్ముళ్లు మీ కోసమైనా ఆయన్ని ఆపద నుంచి బయటికి తీసుకొస్తారు మీరంటే మీ తమ్ముళ్ళకి ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా వదినా అలాంటిది మీ భర్తకు ఏదైనా ఆపదలో ఉన్నాడు అని తెలిస్తే వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళ ప్రాణాలు అడ్డంపెట్టి అయినా సరే మీ భర్తని మీకు తీసుకొచ్చి ఇస్తారు మీరు అవన్నీ ఆలోచించకుండా హ్యాపీగా పాలు తాగండి అని అంటుంది ఇవాళ కాకపోతే రేపైనా ఆయన ఇంటికి వస్తాడు లేండి అని అంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా నచ్చ చెప్పాలని చూస్తారు అరవింద మాత్రం, తను ఫోన్ లో చాలా కంగారుగా ఉన్నాడు ఆ తరువాత విక్కీ వాళ్ళకి నన్ను అప్పచెప్పి వెళ్ళిపోయాడు అంటే తను ఏదో టెన్షన్ లో ఉన్నారని మాత్రం అర్థమైంది అని అంటుంది. టెన్షన్ ఏదైనా నీ తమ్ముళ్లు ఉన్నారు కదా వదినా అని అంటుంది పద్మావతి దాంతో ఇంట్లో అందరూ అరవింద కి నచ్చచెప్పి పాలు తాగించి రెస్టు తీసుకోవడానికి పంపిస్తారు. ఇక మరోవైపు పద్మావతి వికీ దగ్గరికి వస్తుంది అప్పటికే విక్కీ ఆలోచిస్తూ ఉంటాడు. దేని గురించి ఆలోచిస్తున్నారు సారు అని అంటుంది నేను అక్కకి నిజం చెప్పాలనుకుంటున్నాను పద్మావతి అని అంటాడు అదేంటి సారూ అని అంటే అరవింద్ గారు ఇప్పటివరకు తన భర్త కోసమే బాధపడి రూమ్ లోకి వెళ్లారు. ఆయన లేకపోతే నేను లేను అని తను అంత బాధ పడుతుంటే ఇప్పుడు వెళ్లి మీరు నిజం చెప్తారా ఇప్పటిదాకా నేను ఆవిడకి మీ తమ్ముళ్లు మీ భర్తని తీసుకువస్తారు అని చెప్పి వచ్చాను. ఇప్పుడు మీరు ఇలా చేస్తే ఎలాగో అని అంటుంది పద్మావతి అది కాదు పద్మావతి ఇవాళ కాకపోతే రేపైనా ఆ నీచుడు గురించి అక్కకు తెలియాల్సిందే కదా వాడు ఇంటికి ఏదో ఒక రూపంలో రావడానికి ప్రయత్నం చేస్తాడు అక్కని అడ్డం పెట్టుకొని మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. అందుకే వాడు ఆ స్టెప్ తీసుకోక ముందే మనం అక్కకి వాడి గురించి నిజం చెప్పేయాలి అరవింద్ గారు మీరు చెప్పింది నిజం తట్టుకొని ఊరుకుంటున్నారా ఆవిడ ఆరోగ్యం కోసమే కదా ఇన్నాళ్లు మనం నిజం చెప్పకుండా దాచి పెట్టాము అని అంటుంది పద్మావతి. ఆనీచుని అక్క శ్రీరాముడు అని అనుకుంటుంది వాడు రాక్షసుడు అని తెలిస్తే ఏమవుతుందో అని నాకు ఆలోచన గానే ఉంది. కానీ నిజం చెప్పక తప్పదు. ఆ నిజం నేను అక్కకి ఇప్పుడే చెప్పాలనుకుంటున్నాను నేనే చెప్తేనే అక్క అర్థం చేసుకుంటుంది. అక్క గుండె పగిలేలా బాధపడుతుంది అని నాకు తెలుసు అక్క గుండెకు అయ్యే గాయానికి నయమయ్యే ముందు నేనవుతాను అని అంటారు. వదిన అలా చూసి మీరు తట్టుకోగలరా అని అంటే అక్క జీవితాంతం నా దగ్గర ఆనందంగా ఉండాలి అంటే, ఇప్పుడు అక్క కన్నీళ్లు పెట్టక తప్పదు అని అంటాడు. నేను గుండెను రాయి చేసుకుని ఈరోజు అక్క నిజం చెప్పేస్తాను అని అంటాడు.

Nuvvu Nenu Prema May 6 Episode 616
Nuvvu Nenu Prema May 6 Episode 616

ఇక మరోవైపు అను ఇంట్లో అందరినీ భోజనానికి రమ్మంటుంది. అరవింద్ మాత్రం నాకు ఆకలిగా లేదు అని అంటుంది అది కాదు వదిన మీరు కూడా రండి అని అంటుంది అప్పుడే నాకు తినాలని లేదు అని అంటుంది. అప్పుడే అక్కడికి మురళీకృష్ణ ఎంట్రీ ఇస్తాడు. రాణమ్మ అని పిలుస్తాడు కృష్ణుని చూసి అరవింద చేశారా అని అంటుంది. కృష్ణ దగ్గరికి వెళ్తుంటే విక్కీ ఆగక్క అని అరుస్తాడు. ఎందుకొచ్చావ్ రా మళ్లీ ఇంటికి అని అంటాడు అదేంటి విక్కి అలా మాట్లాడుతున్నావ్ ఆయన మీ బావ గారు అని అంటుంది. ఈ నీచుడు నాకు బావ ఏంటి అక్క వీటి గురించి నీకు పూర్తిగా తెలియదు ఎందుకు వచ్చావురా మళ్లీ అని అంటాడు. నాకు నా ప్రాణం అంటే ఇష్టం తన కోసమే వచ్చాను అని అంటాడు. వీడు అబద్ధం చెప్తున్నాడు అక్క వీడు పరమ నీచుడు, దుర్మార్గుడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడు అని చెప్తాడు దాంతో కృష్ణ కంగారుపడుతూ అదేం లేదురా నమ్మ వీలునా నుంచి నిన్ను దూరం చేయడానికి ఇలా మాట్లాడుతున్నారు నువ్వంటే నాకు ఎంత ప్రేమ నీకు తెలుసు కదా అని అంటాడు నీచుడా ఇంకా మాట్లాడుతున్నావా అని విక్కీ కాలర్ పట్టుకుంటాడు దాంతో అరవింద ఆపుతావా అని అంటుంది నువ్వు మీ బావని అలా మాట్లాడుతున్నావు దానికి నీ దగ్గర సాక్షం ఏమైనా ఉందా అని అడుగుతుంది. వెంటనే పద్మావతి వెనుక నుండి ఆ సాక్ష్యం నేనే వదిన అని అంటుంది. ఇంట్లో అందరూ షాక్ అవుతారు అవును వదిన నేను చెప్తున్నది నిజం మా ఇంటికి వచ్చి మీతో పెళ్లయిన తర్వాత కూడా నాతో ఈ నీచుడు నిచ్చితర్థం చేసుకున్నాడు అని చెప్తుంది దాంతో అరవింద ఒకసారిగా షాక్ అవుతుంది.

Nuvvu Nenu Prema May 6 Episode 616
Nuvvu Nenu Prema May 6 Episode 616

వెంటనే అనుకూడా అవును మా ఇంటికి ఈ నీచుడు మా పద్మావతి తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు మీకు ఈ విషయం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాము కానీ మీరు మీ ఆయన ఇలా చేశాడంటే తట్టుకోలేరని నిజం చెప్పలేకపోయాను అని అంటుంది. దానితో అరవింద ఏడుస్తూ వాళ్ళు చెబుతున్నది నిజమా అని అంటుంది. అవునక్కా పద్మావతి వాళ్ళు చెప్తుంది నిజం అని విక్కీ అంటాడు నువ్వు కాదు చెప్పాల్సింది అని కృష్ణ వైపు తిరిగి వాళ్ళు చెబుతున్నది నిజమా అని అంటుంది. కృష్ణ అది కాదు రానమ్మ నేను ఆఫీస్ పని మీద వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నన్ను ట్రాప్ చేసి నన్ను మోసం చేసి వీళ్ళు నన్ను భయపెట్టి ఎంగేజ్మెంట్ చేశారు అని చెప్తాడు. అంతేకానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం రానమ్మ వీళ్ళు చెప్తున్నది నమ్మొద్దు అని అంటాడు దానితో ఒకసారి అరవింద కోపంతో కృష్ణ చెంప మీద గట్టిగా ఒకటి ఇస్తుంది. నువ్వు దేవుడివి అని శ్రీరాముడివని నమ్మాను కానీ నువ్వు ఇలాంటి వాడివని నాకు ఇప్పుడే తెలిసింది నీ ముఖం కూడా ఇక చూడాలని నాకు లేదు నేను నిన్ను ఎంతో నమ్మాను ఇప్పుడు నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది ఇకనుంచి వెళ్ళిపో అని అంటుంది. అది కాదురా అమ్మ నాకు ఒక అవకాశం ఇవ్వు నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడతాడు.

Nuvvu Nenu Prema May 6 Episode 616
Nuvvu Nenu Prema May 6 Episode 616

ఇక కృష్ణ నన్ను క్షమించు రానమ్మ ఇక ఎప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను పద్మావతి వారితో చేసింది తప్పే నేను ఒప్పుకుంటున్నాను ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వు ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను రానమ్మ నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడతాడు కానీ అరవింద మాత్రం కోపంతో ఎప్పటికీ నీ ముఖం నాకు చూపించకు విక్కీ ఈ నీచున్ని ఇంట్లో నుంచి పంపించేసే అని అంటుంది. దాంతో విక్కీ కృష్ణ ని బయటికి పంపిస్తాడు. ఒకసారిగా కృష్ణ నిద్రలో నుంచి బయటికి వస్తాడు. ఇప్పుడు దాకా జరిగిందంతా కృష్ణ కలగంటాడు. ఇది నిజమైతే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటాడు. ఇలా జరగకుండా చూడాలి ఎలాగైనా సరే మళ్లీ అరవింద దగ్గరికి వెళ్ళాలి విక్కీ అసలు నా గురించి అరవిందకు ఏం చెప్పాడు విక్కీ అరవింద్ అని తీసుకువెళ్లిన తర్వాత తనకి నా గురించి నిజం చెప్పాడా లేదంటే అక్క బాధపడుతుందని అబద్ధం చెప్పాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. విక్కీ ఏం చెప్పాడో తెలుసుకుంటే గాని నేను మళ్ళీ అరవింద దగ్గరికి చేరలేను ఏదో ఒక విధంగా అరవింద దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటాడు. ముందు అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఆ విక్కీ నా గురించి ఏం చెప్పాడో అరవింద తో కనుక్కొని నాకే నేను నెక్స్ట్ స్టెప్ వేయాలి అని అనుకుంటాడు. అరవిందను అడ్డం పెట్టుకొని నేను అనుకున్నది సాధించాలి అని మనసులో అనుకుంటాడు. అరవింద్ కు నేనంటే ఇష్టం కాబట్టి విక్కీ తన అక్క కోసం నిజాన్ని ఎప్పటికీ బయటపెట్టడు తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడు. ఇదే మనకి మంచి టైం అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema May 6 Episode 616
Nuvvu Nenu Prema May 6 Episode 616

ఇక మరో వైపు విక్కీ అరవింద కు నిజం చెప్పడానికి తన రూమ్ కి వస్తాడు. అప్పటికే అరవింద పుస్తకం చదువుకుంటూ ఉంటుంది. విక్కీని చూసి ఏంటి అక్కడే ఆగిపోయావురా అని అంటుంది. నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను అక్క అని అంటాడు.ముందు కూర్చోబెట్టి అని అంటుంది తర్వాత టాబ్లెట్స్ వేసుకున్నావా అక్క అని అంటే పద్మావతి ఇస్తుంది అని అంటుంది. నేను ఇస్తాను అక్క ఈరోజు అని తన చేతులతో అరవింద కు టాబ్లెట్స్ ఇస్తాడు. అమ్మ నాన్ననీకంటే నన్నే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు అక్కా అని అంటాడు అదేంటి విద్య అలా అన్నావు అని అంటుంది అవునక్కా లేదంటే నేనంటే నీకు ప్రేమ ఉండబట్టే కదా నాకన్నా ముందుఅమ్మ నాన్న అంత ప్రేమ పని నిన్ను నాకు బహుమతిగా ఇచ్చారు అని అంటాడు అవునా ఈ లాజిక్ చాలా బాగుంది విక్కీ అని అంటుంది అవునక్కా ఇది లాజిక్ కాదు నిజం నాకు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రెండు దక్కాలని అక్కని దేముడి గిఫ్ట్ గా ఇచ్చాడు. నీ ప్రేమ నాకు ఎప్పటికీ కావాలి అక్క అని అంటాడు అదేంటి విక్కీ కొత్తగా మాట్లాడుతున్నావ్ అని అంటుంది. అయినా నువ్వు నాకైతే చెప్పాలని వచ్చావు కదా ముందు అది ఏంటో చెప్పు అని అంటుంది. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో అక్క ఒక వ్యక్తి నమ్మకం ప్రేమ మీదే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది కదా అని అంటాడు. అరవింద అవును అని అంటుంది. మనం ఒకసారి నమ్మకం కోల్పోయామంటే ఇక జీవితంలో మళ్లీ తిరిగి తెచ్చుకోలేను. నీకు ఎప్పటి నుంచో నేను ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను కానీ నువ్వు ఆ విషయం విన్న తర్వాత తట్టుకుంటావో లేదో అని భయపడ్డాను. కానీ చెప్పాల్సిన టైం వచ్చింది అని అనిపిస్తుంది ఏదో ఒక రోజు నీకు విషయం చెప్పాలి కానీ నిన్ను ఎప్పటికీ ప్రేమగా చూసుకునే ఈ తమ్ముడు ఉన్నాడని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. నేను చెప్పే నిజం విన్న తర్వాత నువ్వు ధైర్యంగా ఉండాలని అంటాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ మురుస్తుంది ఇక విక్కి నిజం చెప్పాడో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Nuvvu Nenu Prema May 6 Episode 616
Nuvvu Nenu Prema May 6 Episode 616

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి తలని ఆరబెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే విక్కీ వెనక నుండి పద్మావతిని చూస్తాడు పద్మావతి చాలా అందంగా కనిపిస్తుంది. పద్మావతి విక్కి ని చూడకుండానే, చూసేసారా అని అంటుంది ఆ చూశాను అని అంటాడు ఎలా ఉంది అని అంటుంది చాలా హాట్ గా ఉంది అని అంటాడు పద్మావతి కాఫీ గురించి మాట్లాడుతుంది విక్కీ పద్మావతి గురించి మాట్లాడుతాడు. మీకోసమే అని అంటుంది పద్దు. విక్కీ సంతోషంగా పద్మావతి దగ్గరికి వస్తాడు.

Related posts

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Sudigali Sudheer: క్యూట్ కుర్రాళ్ళు – హాట్ ఆంటీలు తో సుడిగాలి సుదీర్ సరికొత్త షో..!

Saranya Koduri

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ మెడపై జబర్దస్త్ కమెడియన్ టాటో.. షాక్ లో అభిమానులు..!

Saranya Koduri

Rathnam OTT: ఓటీటీ ని షేక్ చేస్తున్న తమిళ్ యాక్షన్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Netflix: నెట్ఫ్లిక్స్ లో తప్పక వీక్షించాల్సిన 5 సినిమాలు ఇవే.. ఫ్యామిలీతో చూస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ పక్కా..!

Saranya Koduri

Malayalam OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న మరో బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Saranya Koduri

Yakshini OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సోషియో ఫాంటసీ సిరీస్.. ఎక్కడ చూడవచ్చంటే..!

Saranya Koduri

Dhee 17 winner: ఢీ 17 విన్నర్ గా నిలిచిన లేడీ కంటెస్టెంట్… ట్రోఫీని అందించిన గెస్ట్ ఎవరంటే..?

Saranya Koduri