NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

Vindhya Vishaka: వింధ్య విశాఖ మేడపాటిని కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగులో ఎంతో మంది యాంక‌ర్లు ఉన్నా కూడా వింధ్య విశాఖ‌ మాత్రం అంద‌రిలోనూ ప్ర‌త్యేకం. టెలివిజన్ వ్యాఖ్యాతగా, స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా, వీడియో జాకీగా, మోడల్ గా త‌న‌దైన ముద్ర వేసి మ‌ల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకుంది. సికింద్రాబాద్‌లో వింధ్య‌ జన్మించింది. ఆమె తండ్రి ఎం. సత్తిరెడ్డి రైతు కాగా.. తల్లి మమత చక్రవర్తి ఉపాధ్యాయురాలిగా పని చేశారు. మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వింధ్య 2011లో మోడ‌లింగ్ లోకి ప్ర‌వేశించింది.

అదే ఏడాది హెచ్‌ఎమ్ టివిలో న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ త‌ర్వాత ఫ్యామిలీ సర్కస్, హంగామా త‌దిత‌ర షోస్‌ను త‌నదైన యాంకరింగ్ తో హిట్ చేసింది. 2017లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా చేరి ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్‌తో సహా ఇతర టోర్నమెంట్‌లకు వ్యాఖ్యాతగా అద‌ర‌గొట్టింది. ఐపీఎల్‌ పది సీజన్ల వరకు మేల్‌ కామెంటేటర్లతోనే నడిచింది. మగవాళ్లు రాజ్యమేలుతున్న క్రికెట్‌ కామెంటరీ విభాగంలో తొలి ఆడ‌గొంతు వింధ్య‌దే.

ఐపీఎల్‌కు హోస్ట్‌గా అవకాశం దక్కించుకున్న మొదటి తెలుగు అమ్మాయిగా వింధ్య రికార్డు సృష్టించింది. 2018లో ఎంపికైన ఆమె.. ఇప్ప‌టికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న త‌రుణంలో హోస్ట్ గా వింధ్య త‌న హ‌వా చూపిస్తోంది. సినిమా, క్రికెట్‌ అనే రెండు పెద్ద ఫీల్డ్స్‌లో యాంక‌ర్ గా నిల‌దొక్కుకున్న వింధ్య తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం పంచుకుంది.

ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు తనని ఎలా పెంచారో వింధ్య వివ‌రించింది. వింధ్య మాట్లాడుతూ.. `మా నాన్న రైతు, మా అమ్మ బాగా చ‌దువుకుని టీచ‌ర్ అయ్యారు. నాన్న ఆస్తి ప‌రుడ‌ని అమ్మ‌ను ఆయ‌న‌కు ఇచ్చి వివాహం చేశాడు. చిన్న వ‌య‌సులోనే మా అమ్మ‌కు పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టేశాడు. ఆ విష‌యంలో ఆమె ఎప్పుడూ బాధ‌ప‌డుతుంది. అందుకే నాకు ఈ ఏజ్ కి పెళ్లి చేసుకోవాలి. ఈ ఏజ్ లో పిల్లల్ని కనాలి. ఇలాంటి బట్టలు వేసుకోవాలి అని ఎప్పుడూ చెప్ప‌లేదు.

సొసైటీ గురించి ఆలోచించ‌కు.. లైఫ్ ను ఎంజాయ్ చేయ‌డం నేర్చుకో. ఒక‌రి కోసం నీ ఇష్టాలను వదులుకోకు. నీకు ఏది చేయాల‌నిపిస్తే అది చేశాయ్‌. కానీ ఈ ప్రాసెస్ లో క్యారెక్ట‌ర్ ను మాత్రం ఎప్పుడూ కోల్పోకు. ఒక మ‌నిషికి క్యారెక్ట‌ర్ అనేది చాలా ముఖ్యం. నువ్వు పిల్ల‌ల‌ను క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ను సంతోషంగా గ‌డుపు అని మాత్ర‌మే అమ్మ నాకు చెప్పింది.`అంటూ తెలిపింది. అమ్మ చెప్పిన మాట‌ల‌నే తాను ఫాలో అవుతున్నాని వింధ్య పేర్కొంది. అలాగే ఈ సంద‌ర్భంగా త‌న‌కు సినిమా రంగం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేద‌ని.. ఆ కార‌ణంగానే గ‌తంలో గోపాల గోపాల, ముకుందతో స‌హా ప‌లు సినిమా అవ‌కాశాల‌ను వ‌దులుకున్నాన‌ని వింధ్య వెల్ల‌డించింది.

Related posts

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N