NewsOrbit
Horoscope దైవం

October 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? అక్టోబర్ 20 ఆశ్వయుజ మాసం రోజు వారి రాశి ఫలాలు!

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
Share

October 20: Daily Horoscope in Telugu అక్టోబర్ 20 – ఆశ్వయుజ మాసం – శుక్రవారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు. నూతన రుణాలు చేస్తారు. కొన్ని వ్యవవహారలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

Daily Horoscope to start your day, August 7 2023 Daily Horoscope, August 7 Rasi Phalalu
Daily Horoscope to start your day October 20th 2023 Daily Horoscope October 20th Rasi Phalalu

వృషభం
నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.
మిధునం
చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహ కలుగుతుంది. ధనపరంగా అనుకూలత పెరుగుతుంది.

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
daily horoscope October 20th 2023 rasi phalalu Ashwayuja masam

కర్కాటకం
చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు.
సింహం
రుణదాతల ఒత్తిడులు చికాకు కలిగిస్తాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధు మిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి.

కన్య
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
తుల
సోదరుల నుంచి ఆకస్మిక ధనప్రాప్తి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.

వృశ్చికం
కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
ధనస్సు
ఆధాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. దూరపు బంధువులు నుండి అరుదైన ఆహ్వానలు ఆశ్చర్య పరుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మకరం
సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ వర్గం వారి నుండి అరుదైనా ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతల నుండి కొంత ఉపశమనము పొందుతారు.
కుంభం
వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు.
మీనం
నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేషంగా గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..


Share

Related posts

December4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? డిసెంబర్ 4 కార్తీక మాసం – రోజు వారి రాశి ఫలాలు!

somaraju sharma

Uttara Phalguni Nakshatra born characteristics and features: మీరు ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులా..అయితే ఈ వివరాలు తెలుసుకోండి

somaraju sharma

శాకాంబరీ దేవిగా అమ్మవారిని ఎందుకు పూజిస్తారు .. ?

Kumar