Categories: న్యూస్

ఈ సీన్ ఉంటేనే సినిమా చేస్తా.. బేబ‌మ్మ సెంటిమెంట్ భ‌లే ఉందే!

Share

కృతి శెట్టి.. టాలీవుడ్‌లో మారుమోగిపోతున్న పేరు ఇది. `ఉప్పెన‌` మూవీతో బేబ‌మ్మ‌గా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి.. తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత `శ్యామ్ సింగ‌రాయ్‌`, `బంగార్రాజు` చిత్రాల‌తో మ‌రో రెండు హిట్లు అందుకున్న కృతి శెట్టి.. రీసెంట్‌గా `ది వారియ‌ర్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఎన్‌. లింగుసామి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న మాస్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ ఇది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ మూవీని నిర్మించారు. జూలై 14న తెలుగు, తమిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ బోల్తా ఘోరంగా బోల్తా ప‌డింది. ఇదిలా ఉంటే.. కృతి శెట్టికి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. కృతి శెట్టికి ఓ గ‌మ్మ‌త్తైన సెంటిమెంట్ ఉంటుంది. అదేంటంటే.. తను నటించిన ప్రతి సినిమా లోనూ హీరోతో కలిసి బైక్ పై షికారు కు వెళ్లే సీన్ ఉండాల‌ట‌. ఆ సీన్ ఉంటేనే సినిమాకు సైన్ చేస్తుంద‌ట‌. ఇప్పటి వరకు నటించిన ప్రతీ సినిమాలో ఈ సీన్‌ తప్పనిసరిగా ఉండేట్టు చూసుకుంటూ వ‌చ్చిన కృతి శెట్టి.. ఇక ముందు కూడా బైక్ సీన్ ఉండేట‌ట్టు జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంద‌ట‌.

బైక్ సీన్ తనకు సెంటిమెంట్ అని.. సినిమా హిట్టైనా, ఫ్లాపైనా దాన్ని ఆమె ఫాలో అవుతుంద‌ని టాక్ న‌డుస్తోంది. కాగా, ఈమె సినిమాల విష‌యానికి వ‌స్తే.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో అల‌రించ‌బోతోంది. అలాగే సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అనే సినిమా చేస్తోంది. వీటితో పాటు త‌మిళ స్టార్ హీరో సూర్య‌కు జోడీగా `అచలుడు` మూవీలో న‌టిస్తోంది.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

36 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

45 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago