అనకాపల్లి జిల్లాలో పెను విషాదం .. సముద్ర తీరంలో ఏడుగురు విద్యార్ధులు గల్లంతు.. ఒకరి మృతి .. సీఎం జగన్ దిగ్భాంతి

Share

అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. డీఐఈటీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్ధులు శుక్రవారం అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో స్నానాలకు దిగారు. సముద్రంలో అలల తాకిడికి ఏడుగురు విద్యార్ధులు గల్లంతు అయ్యారు. మిగిలిన ఎనిమిది మంది విద్యార్ధులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. విద్యార్ధులు గల్లంతైన విషయాన్ని వెంటనే అధికారులకు సమాచారం అందించగా కోస్ట్ గార్డ్స్, మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గుడివాడ పవన్ కుమార్ మృతదేహం లభ్యమైంది. సూరిశెట్టి తేజ అనే విద్యార్ధిని జాలర్లు రక్షించారు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన అయిదుగురు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన విద్యార్ధులను గోపాలపట్నంకు చెందిన జగదీశ్, నర్సీపట్నంకు చెందిన జశ్వంత్. మునగపాడుకు చెందిన గణేశ్. ఎలమంచిలికి చెందిన రామచందు,. గుంటూరు వాసి సతీష్ గా నిర్ధారించారు.

 

ఈ విషాద ఘటనపై జిల్లా మంత్రి గుడివాడ అమరనాథ్ వెంటనే స్పందించారు. గల్లంతైన విద్యార్ధుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్,. ఎస్పీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. విషయంపై ఆరా తీసిన సీఎం జగన్ .. తక్షణమే సహాయ చర్యలు పర్యవేక్షించాలని మంత్రి అమరనాథ్ కు ఆదేశించారు. బాదిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

20 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

29 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago