Nuvvu nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్నపవిత్ర బి నాయక్.ఈ సీరియల్ లో పద్మావతి అనే క్యారెక్టర్ లో, పవిత్ర నటిస్తూ మంచి ప్రేక్షక ఆదరణ పొందుతుంది. ఈమె కన్నడ ఇండస్ట్రీలో పరిచయమైంది. 2019లో పారు అనే కన్నడ సీరియల్ ద్వారా జీ కన్నడ అందరికీ పరిచయమైంది.

ఈమె 1997 సెప్టెంబర్ 13న జన్మించింది. ఈమె బెంగళూరులోనే పుట్టి పెరిగింది. ఏమి చిన్నతనంలోనే నటన మీద ఇంట్రెస్ట్ తో మోడలింగ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత కన్నడంలో కొన్ని సీరియల్స్ లోనూ, రియాల్టీ షోల ద్వారామంచి ప్రేక్షకుల్ని సంపాదించుకుంది.

ఈమె ఇంజనీరింగ్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత నటనలో అడుగు పెట్టింది. ఈమెకి కన్నడంలో సీరియల్స్ లో అవకాశాలు రావడానికి వాళ్ళ అన్న ప్రధాన కారణమని చెప్తుంటారు. ఈమెకు అనడంలో మూడు సీరియల్స్ లోనూ నాలుగు సినిమాల్లోనూ నటించింది ఆ తర్వాత తెలుగు తెర కి పరిచయమైంది. స్టార్ మా లో ప్రసారమయ్యే నువ్వు నేను ప్రేమా సీరియల్ మంచి పిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇందులో నటించే మెయిన్ క్యారెక్టర్స్ ఒకరైన పద్మావతి అనే క్యారెక్టర్ లో నటిస్తున్న పవిత్ర మంచి నటనతో ఆకట్టుకుంటుంది.

తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.ఈమె ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తన ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటుంది. ఈమె ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది. ఈమె తన లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు ఒక స్పెషల్ గా పవిత్ర తన బర్త్డేకి సందర్భంగా, తన అభిమాని పంపించిన ఒక గిఫ్ట్ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.

అలాగేగిఫ్ట్ పంపించిన అభిమాని కూడా ప్రత్యేకంగా థాంక్స్ తెలియజేసింది. ఆ ఫోటో ప్రత్యేకత ఏమిటంటే ఒకే ఫ్రేమ్లో పద్మావతి చిన్నతనం నుండి ఇప్పటివరకు ఉన్న ఫొటోస్ అన్నిటితో పాటు మధ్యలో తన ఫోటో వచ్చేటట్టుగా ఒక ఫ్రేమ్లో అభిమాని బర్త్డే విషెస్ తో ఫ్రేమ్ చేయించి ఉంటుంది ఆ ఫోటోని పద్మావతి తన అభిమానులతో షేర్ చేసింది. ఇలాంటి పుట్టినరోజులు పవిత్ర ఇంకా చాలా జరుపుకోవాలని, ఆమె అభిమానులతో పాటు మనము కోరుకుందాం ఇప్పుడు ఆ ఫోటోని మీరు ఒకసారి చూసేయండి.