Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో,ముకుంద మురారి ని హగ్ చేసుకోవడం, తనని వదిలి పెట్టొద్దని తన ప్రేమని అర్థం చేసుకోమని వేడుకోవడం దూరం నుంచి కృష్ణ చూస్తుంది.ముకుంద కృష్ణకి నిజం చెప్పేశానని మురారిని బెదిరిస్తుంది. రాదే ముకుందా అని కృష్ణకి తెలిసిపోతుంది. గతంలో ముకుందా మాట్లాడిన విషయాలన్నీ కృష్ణకి గుర్తొచ్చి ఇద్దరూ కలిసి మోసం చేశారని బాధపడుతుంది.

ఈరోజు 263 వ ఎపిసోడ్ లో, ఆలోచించుకుంటూ మురారి తన రూమ్ కి వెళుతూ ఉంటాడు. మురారిని చూసిన రేవతి ఏంటి ఇంట్లో ఉండి కూడా వర్షంలో తడిచాడు అని మురారి అని పిలుస్తుంది మురారి ఏం సమాధానం చెప్పకుండా మాట్లాడకుండా వెళ్ళిపోతాడు రేవతికి అనుమానం వస్తుంది. ముకుంద ఏమైనా బెదిరించిందా అని ఆలోచిస్తుంది.

ముకుందా ఆలోచన..
ముకుందా తన రూములో మురారి ఫోటోని చూస్తూ, నేను నిన్ను బ్లాక్ మెయిల్ చేశాను అని అనుకోకు.నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసమే నేను పడే ప్రతి ఆవేదన ఏదో ఒక రోజు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అన్న భావనతోనే ఇదంతా చేస్తున్నాను అంతేకానీ నీ మీద ఏదో నాకు కోపం లేదు. నీ మీద ఉన్న ప్రేమ, నీ ఆశలో నీ ధ్యాసలో నేను ప్రతిరోజు నీ ఆలోచనలతోనే, ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. నా ప్రేమతో నిన్ను మార్చుకోవాలని నీతో అలా బిహేవ్ చేశాను. నా ప్రేమని అర్థం చేసుకో మురారి నువ్వు లేకపోతే నేను బతకలేను ఆ ఊహతోనే నేను ఉండలేకపోతున్నాను. అందుకే నీతో ఇలా మాట్లాడాల్సి వచ్చింది నా ప్రేమని అర్థం చేసుకో, అంతేకానీ నన్ను అపార్థం చేసుకొని దూరం పెట్టకు అని ఫోటో చూస్తూ మాట్లాడుతుంది ముకుందా అప్పుడే అక్కడికి అలేఖ్య వస్తుంది. ఏంటి మురారితో నువ్వు ఏమన్నా మాట్లాడావా డల్లిగా ఉన్నాడు అని అడుగుతుంది అలేఖ్య. మాట్లాడాను తనకి నా ప్రేమని మరోసారి చెప్పాను అని అంటుంది వెంటనే అలేఖ్య తన ఏమన్నాడు అని అంటుంది ఏమంటారు తనకి నువ్వు చెప్పే ఆప్షన్ నేను ఇవ్వలేదు కదా అని అంటుంది. అంటే ఆదర్శ తిరిగి రాడా ఏంటి, అని అంటుంది అలేఖ్య. ఇంటికి వస్తాడు ఏమో కానీ నా జీవితంలోకి ఆదర్శ రాడు అని అంటుంది. మరి కృష్ణ సంగతేంటి అని అంటుంది అలేఖ్య మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్లిపోతుంది అని అంటుంది ముకుందా వెంటనే అలేఖ్య ఇదంతా వర్కౌట్ అవదేమో అని అంటుంది. వెంటనే ముకుందట కోపం వచ్చి ఎందుకు వర్క్ అవుట్ అవ్వదు అని అలేఖ్య మీద కోపంగా అరుస్తుంది. కోప్పడకు ముకుందా నేను చెప్పేది బాగా ఆలోచించు ప్రేమలో ఓడిపోవడం ప్రేమికులగా విడిపోవడం అనేది కొత్త ఎం కాదు చాలామంది విషయాల్లో ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ భార్య భర్తలు విడిపోవడం అనేది అంత ఈజీ కాదు, పైగా కుటుంబం పరువు కోసం భవాని అత్తయ్య ఎంత కఠినంగా ఉంటుందో ఆ నందిని విషయంలో మనందరం చూసాం కూడా, ఎప్పుడో గతంలో జరిగిపోయిన ప్రేమ కోసం నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. బాగా ఆలోచించుకో అని అంటుంది అలేఖ్య. ఆదర్శిని నీ భర్తగా నువ్వు ఎలా యాక్సెప్ట్ చేయట్లేదు అలాగనే మురారి కూడా నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు నీవు ఏం చేస్తావ్ అని అంటుంది అలేఖ్య.ప్రేమని పొందాల నారాటంలో నీ జీవితాన్ని కోల్పోతావు నీ మంచి కోసమే చెప్తున్నాను నీ నిర్ణయం నీది అని అంటుంది అలేఖ్య.ముకుంద ఆలోచనలో పడుతుంది పిచ్చి అలేఖ్యనువ్వు నానానికి ఒకవైపే చూస్తున్నావు ఇంకోవైపు చూడట్లేదు ప్రేమ కోసం ప్రాణాల్ని త్యాగం చేయడానికి నాకు జీవితం మీద మాత్రం ఏ మాసం ఉంటుంది. నా ఆశ నా ధ్యాస అంతా మురారిని, తన కోసం ఏదైనా చేస్తాను అని అనుకుంటుంది ముకుంద.

కృష్ణ బాధ..
కృష్ణ రూమ్ లోకి వచ్చి బాధపడుతూ, ముకుందా నిన్న మురారితో అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కృష్ణుని ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్పు అని, తనని దూరం చేసుకో మనం దగ్గరవుదాము అని కృష్ణ ముకుందా అన్న మాటలు అన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అసలు అత్తయ్య నాకేం చెప్పింది ఇక్కడ ఏం జరుగుతుంది. ఒట్టేసి మరీ నువ్వంటే వాడికి ప్రాణం అని, ఇక్కడేమో వాళ్ళిద్దరూ ఒకరికొకరు హగ్ చేసుకుని మరీ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అసలు నేనేం చేయాలి ఇంట్లో ఏసీబీ సార్ మనసులో, అసలు నా స్థానం ఏంటి. ఎవరిని నమ్మాలి ఎవరిని నిలదీయాలి ఎవరి ఎవరిని మోసం చేస్తున్నారు నేను ఇప్పుడు ఏం చేయాలో అసలు అని బాధపడుతూ ఉంటుంది. ఇన్నాళ్లు వెతుకుతున్న ప్రశ్నకి సమాధానం ఆ డైలీ అమ్మాయి ఎవరు అని దానికి ముకుందని నిజం తెలిసిపోయింది. మౌనంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా ఇప్పుడు నేను అని అనుకున్నాను బాధపడుతూ ఉంటుంది.

కృష్ణ నిలదీసిన రేవతి..
కృష్ణాల బాధపడుతూ ఉండగా రేవతి అక్కడికి వచ్చి ఏంటలా ఉన్నావ్ అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య అని చెప్తుంది కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయి, అని అంటుంది రేవతి. ఇందాక ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు సబ్బు కలలోకి వెళ్ళింది అత్తయ్య అని అంటుంది. వాడేమో డల్లుగా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఇదేమో నా దగ్గర అబద్ధం చెప్తుంది అని తెలిసిపోతుంది ఏమైయుంటుంది అని రేవతి మనసులో అనుకుంటుంది. చివరికి అత్తయ్య కూడా నన్ను మోసం చేసింది అన్నమాట, హనీ కృష్ణ మనసులు అనుకుంటుంది. నా ఇష్టాలతో నీకు అసలు పని లేదు కదా అని మనసులో అనుకుంటుంది. కృష్ణుని ఎలాగైనా మాటలో పెట్టి మనసులో బాధేందో తెలుసుకోవాలనుకుంటుంది రేవతి. ఏమైంది కృష్ణ అలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదంటుంది కృష్ణ. వంట చేద్దాం తోడు రా అంటుంది. బలవంతంగా కృష్ణ తీసుకొని వెళుతుంది.

మధు అలేఖ్యల గొడవ..
మధు నేను జాగింగ్ వెళ్తున్నాను నువ్వు వస్తావా అని అడుగుతాడు. దేనికి నీ లావుగా ఉన్నానా అంటుంది లేదు ఫిట్గా అవుతావు రా అంటాడు అంటే నేను ఇప్పుడు పెట్టుగాలేనా అంటుంది లేదు అందంగా తయారవుతావ్ రా అంటాడు అంటే నేను ఇప్పుడు అందంగా లేనా అని అంటుంది సరే నీ ఇష్టం రా మాకు నేను వెళ్తున్నాను అంటాడు అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అంటుంది. ఇప్పుడు నీ విషయం ఏంటో చెప్పవే అని అంటాడు మధు. అంటే నువ్వు నా మీద ప్రేమ లేదుగా అందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావని అంటుంది ప్రేముంది కాబట్టే కదా రమ్మన్నాను అని అంటాడు. ప్రేమంటే నేను వెళ్లట్లేదు కాబట్టి నువ్వు వెళ్ళకూడదు అని అంటుంది. మధు చా నువ్వెప్పుడూ ఇంతే అని అనేక మీద విసుగ్గా కోప్పడి వెళ్ళిపోతాడు.

మురారి తో కృష్ణ గొడవ..
ముకుంద కి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు,నేను ఏమని చెప్తాను తనతో, గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు మాత్రంనీకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కృష్ణ వస్తుంది కృష్ణ మురారిని చూసి తప్పులు అందరూ చేస్తారు కానీ సరిదిద్దుకోవాలి మీరు తప్పు చేసి సరిదిద్దుకోవట్లేదు ఏసీబీ సార్ అని మనసులో అనుకుంటుంది. మీ తప్పు మీరు ఒప్పుకునేంతవరకు నేను మిమ్మల్ని క్షమించలేను అని అంటుంది. ఒక్కతే చాపేసుకొని కింద పడుకుంటుంది. మురారి ఎన్ని అడిగినా గాని కృష్ణ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా పడుకుంటుంది. మురారి మాట్లాడుతున్న కృష్ణ చాలా కోపంగా చూస్తుంది. నీకు నడుం నొప్పి వస్తుందేమో బెడ్ మీద పడుకో అని అంటాడు. ఏం మాట్లాడకుండా కృష్ణ కిందే పడుకుంటుంది. కనీసం నువ్వు ఎక్కడికి వెళ్లావు చెప్తావా అని అంటాడు. నాతో మాట్లాడవా కృష్ణ అని అడుగుతాడు. కృష్ణ ఏం మాట్లాడకుండా సైలెంట్ గానే ఉంటుంది. ఒకసారి నాతో మాట్లాడు కృష్ణ అని బతిమిలాడుతాడు. నాకు నిద్ర వస్తుంది పడుకోవాలి అని అంటుంది. నువ్వు మాట్లాడలేనంత పెద్ద తప్పు నేనేం చేశాను చెప్పు కృష్ణ అని అంటాడు. కృష్ణ మాత్రం ముకుంద అన్న మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అత్తయ్యకి నిజం చెప్పి మనం పెళ్లి చేయమని అడుగుదాం అని ముకుంద అన్న మాటలే కృష్ణ గుర్తుచేసుకొని ప్లీజ్ ఎసిపి సార్ నాకు నిద్ర వస్తుంది నేను మీ రూమ్ లో పడుకోవడం ప్రాబ్లం అయితే చెప్పండి నేను వెళ్లి బయట పడుకుంటాను, నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ అని మురారితో అంటుంది మురారి ఓకే కృష్ణ ఐ యాం వెరీ సారీ అని చెప్పిపడుకుంటాడు.కృష్ణ వైపు చూస్తూ ఎందుకో బాధపడుతుంది.ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.

ముకుంద ప్రేమ..
తెల్లవారిటప్పటికీ ముకుందా మురారి రూమ్ కి వచ్చి మురారిని చూస్తూ ఉంటుంది. రోజు ఉదయం ఎన్ని పనులు ఉన్నా ముందు నిన్ను చూస్తే కానీ నాకు రోజు గడవదు మురారి నీకు సేవలు చేయాలని నా ఆలోచన అంతా అని అంటుంది. నా కలలన్నీ నేను నిజం చేసుకోవాలి అని మనసులో అనుకుంటుంది. గుడ్ మార్నింగ్ అని మురారిని నిద్ర లేపుతుంది. కాఫీ తీసుకొని వస్తుంది మురారి కోసం, మురారి మాత్రం కళ్ళు తెరవకొండ ఏంటి కృష్ణ అప్పుడే నా మీద కోపం పోయిందా గుడ్ మార్నింగ్ చెప్తున్నావ్ అని అంటాడు వెంటనే ముకుందా కృష్ణ వెళ్లిపోయింది అని అంటుంది. ఒకసారి ఆ మాటకి ఉలిక్కిపడి లేస్తాడు మురారి. వెంటనే కృష్ణ ఎక్కడికి వెళ్ళిపోయింది అని ముకుందని అడుగుతాడు ఏమో ఎక్కడికో కంగారుగా వెళ్ళిపోయింది తన వాళకం చూస్తే మళ్ళీ తిరిగి వచ్చేలా లేదు అని అంటుంది ముకుంద. పోనీలే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్లిపోతారు అని అంటుంది దానికి మురారి కి బాగా కోపం వస్తుంది.ఎవరైనా చూస్తే దరిద్రంగా ఉంటుంది వెళ్ళు అని అంటాడు.ఎవరు చూడకపోతే పర్వాలేదా అని అంటుంది.అయినా ఎందుకు కంగారు పడతావు ఎప్పటికైనా మన గురించి అందరికీ తెలియాల్సిందే కదా అని అంటుంది.ముకుందా నువ్వెళ్ళు అని అంటాడు.నువ్వి కాఫీ తాగితేనే వెళ్తాను అని అంటుంది వెంటనే మురారి గబగబా కాఫీ తీసుకొని వేడిగా ఉన్న తాగుతూ ఉంటాడు. వెంటనే ముకుందా ఇటివ్వు ఏం చేస్తున్నావు కాఫీ కప్పు తీసుకొని చల్లార్చి ముకుంద మురారి కి ఆ కప్పిచ్చి తాగు మంటుంది. మురారి తాగగా మిగిలిన కాఫీ ని తను తాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మురారి నీ పెదవులు తాగిన కాఫీ అమృతంలా ఉన్నాయి. థాంక్యూ సో మచ్ మురారి అని అంటుంది. మురారి చాలా ఆస్యంగా పేస్ పెడతాడు ముకుంద మాత్రం సిగ్గుపడుతు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
రేపటి ఎపిసోడ్ లో ముకుంద రేవతితో త్యాగం కోసం మీ కుటుంబం బాగుండాలని నా మెడలో బలవంతంగా తాడి కట్టారు, నాకు నచ్చని పెళ్లి చేసుకోమనడం అన్యాయం కాదా, అని అంటుంది. మురారి కృష్ణతో ఈ మధ్య నువ్వు ఎందుకో, అలా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు కృష్ణ అని అంటాడు. యుద్ధం అయిపోగానే చాలామంది లీవ్స్ మీద ఇంటికి వచ్చేసారంట మరి ఆదర్శ ఎందుకు రావట్లేదు సార్ అని సూటిగా అడుగుతుంది కృష్ణ.మురారి ఆ మాటకి షాక్ అవుతాడు.