Krishnamma Kalipindi Iddarini Today సెప్టెంబర్ 14: ఉద్యోగం ఇది మామూలు ప్లాన్ కాదు మమ్మీ మిస్సయింన్ లాంటి ప్లాన్ ఇక మిస్సయ్య చాన్సే లేదు ఆ గౌరీ కి క్షణం క్షణం టార్చర్ ఉంటుంది అని ఉజ్వల అంటుంది. ఈ దెబ్బతో దానికి అర్థం అవుతుంది మనల్ని దెబ్బ కొట్టడం అంటే డైనోసర్స్ ని ఢీకొట్టడమే నాని అని సౌదామని అంటుంది. కట్ చేస్తే గుడ్ మార్నింగ్ మామయ్య గారు వాకింగ్ కి వెళ్లొచ్చారా అని సునంద అంటుంది. నాకు ఎందుకో భయంగా ఉంది మమ్మీ అత్తయ్య ఒప్పుకోకపోతే ఆ గౌరీ ముందు తుసైపోతాము అని ఉజ్వల అంటుంది నువ్వేం టెన్షన్ పడకు బేబీ వెయిట్ చెయ్ నేను తర్వాత నిన్ను పిలుస్తాను అని సౌదామిని కాఫీ తీసుకొని వెళుతుంది. వదిన నీకోసం అద్భుతమైన కాపీ తీసుకు వచ్చాను తాగు అని ఇస్తుంది సౌదామిని. తాగాక నేను చెప్పాలి అద్భుతంగా ఉంది అని సునంద అంటుంది. ఇంతలో ఉజ్వల వచ్చి సునంద కాలు పట్టుకుని ఏడుస్తుంది. ఉజ్వల ఏమైంది అని సునంద అంటుంది.

ఉజ్వల డ్రామాకి ప్రాక్టీస్ చేస్తున్నావా అని అఖిల అంటుంది. నా కూతురు ఎమోషన్ నీకు డ్రామా లాగా అనిపిస్తుందా అఖిల అని సౌదామిని అంటుంది. ఏ కారణం లేకుండా ఏడిస్తే తను ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు కదా పిన్ని గారు అని గౌరీ అంటుంది. ఇంతలో ఈశ్వర్ అక్కడికి వచ్చి అత్తయ్య ఏమైంది అని అంటాడు. వచ్చావా ఈశ్వర్ చూడడానికి చక్కగా ఉంది కానీ పాయసం చేయడానికి రాలేదు అని సౌదామిని అంటుంది. ఇంతకీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావ్ సౌదామిని అని సునంద అంటుంది. దీని చదువుకి దీని అందానికి బిజినెస్ మ్యాన్ ఇంటి కోడలు కావాలి కానీ దీని అదృష్టం బాగోలేదు మీ ఇంటికి కోడలు అవుదాం అనుకున్నా కాలేకపోయింది అని సౌదామని అంటుంది. అత్తయ్య మ్యాటర్ చెప్పకుండా మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నావ్ ఏం కావాలో చెప్పు అని ఈశ్వర్ అంటాడు. నీకు అమెరికా లో చదువుకోవడానికి డబ్బు కావాలా ఏం కావాలో చెప్పండి అని సునంద అంటుంది. నా కూతురికి భవిష్యత్తును ఇవ్వండి అని సౌదామిని అంటుంది. పెళ్లి చేసి పంపాలేము అత్తయ్య మీ చుట్టాలల్లో ఎవరైనా ఉంటే చూసి పెళ్లి చేయమంటుందేమో అని గౌరీ అంటుంది. దీనికి ఎవరిని పెళ్లి చేసుకోవాలని లేదు నీ మొగుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అని సౌదామిని అంటుంది. సౌదామిని ఏం మాట్లాడుతున్నావ్ అని అరుస్తుంది సునంద.

అంటే అప్పుడు అనుకుంది ఇప్పుడు జరగలేదు కాబట్టి ఒకసారి ఏడుస్తుంది ఒకసారి నవ్వుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు వదినా అని సౌదామిని అంటుంది.అయితే అప్పుడు మెంటల్ డాక్టర్ కి చూపించాలి కదా పిన్ని గారు అని గౌరీ అంటుంది.ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు నేనే డల్ అయిపోతున్నాను అని ఏడుస్తుంది ఉజ్వల. అయితే మాతో రా నీకు టైం పాస్ గా ఉంటుంది అని సునంద అంటుంది. అత్తయ్య నేను ఎంబీఏ చేశాను బావతో చెప్పి ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించమని చెప్పండి అని ఉజ్వల అంటుంది. ఎక్కడో జాబ్ చేయవలసిన కర్మ నీకేంటి ఉజ్వల మన ఆఫీసులోనే అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉంది ఎవరో ఎందుకు నువ్వే చెయ్యి అని ఈశ్వర్ అంటాడు. తనకి ఏ అనుభవం లేకుండా ఈ జాబ్ ఎలా ఇస్తారండి అని గౌరీ అంటుంది. నేర్చుకుంటుందిలే ముందే అన్నివస్తాయా ఏంటి అని ఈశ్వర్ అంటాడు. అల్లుడు నువ్వు బంగారం వదిన నీకు థాంక్స్ నా మనసులో ఏముందో మీరు తెలుసుకొని నా కూతురు జీవితాన్ని బాగు చేశారు అని సౌదామని అంటుంది.

ఇంటర్వ్యూ కూడా చేయకుండా ఉజ్వలకి జాబ్ ఇయ్యడం బాగోదు అన్నయ్య అని ఆదిత్య అంటాడు. ఒరే ఆదిత్య నువ్వు ఊరుకో అని ఈశ్వర్ అంటాడు. తనకి పాయసం చేయడమే రాదు కదండీ ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఎలా ఇస్తారు అని గౌరీ అంటుంది. ఆదిత్య నువ్వు వెళ్లి నా పర్సనల్ ల్యాప్టాప్ తీసుకురా అని అంటాడు ఈశ్వర్. అలాగే అన్నయ్య అని ఆదిత్య లాప్టాప్ తెచ్చి ఈశ్వర్ కి ఇస్తాడు.మన కంపెనీ మెయిల్ ఐడి నుంచి ఉజ్వలకి జాబ్ స్తున్నట్టుగా ఉజ్వల మెయిల్ ఐడి కి పంపించేయ్ అని ఈశ్వర్ అంటాడు. చాక్లెట్ అడిగినంత ఈజీగా కన్నీళ్లు పెట్టి జాబ్ కొట్టేసావు ఉజ్వల అని అఖిల అంటుంది. థాంక్స్ అఖిల అని ఉజ్వల అంటుంది. అత్తయ్య మీ మేనకోడల్ని ఆశీర్వదించారు నన్ను కూడా ఆశీర్వదించండి అని గౌరీ అంటుంది. నీకేం కావాలో చెప్పమ్మా అని సునంద అంటుంది. కొంపతీసి మేనేజర్ పోస్ట్ అడుగుతున్నావా ఏంటి అని ఈశ్వర్ అంటాడు. నాకు అంత ఆశ లేదండి అని గౌరీ అంటుంది. మరి నీకు ఇంకేం కావాలమ్మా అని సునందా అంటుంది. నేను ఆఫీస్ కి వెళ్లి ఆయనని చూసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అత్తయ్య అని గౌరీ అంటుంది. వాట్ నేను నిన్ను అడిగానా అని ఈశ్వర్ అంటాడు. నీ పెళ్లి కాక ముందు కూడా ఈశ్వర్ ఆఫీస్ కి వెళ్ళాడు అప్పుడు ఈశ్వర్ ని చూసుకోవడానికి డబ్బులు ఇచ్చి ఒక మనిషిని పెట్టారు అని సౌదామిని అంటుంది అదే పిన్ని గారు ఒక్కరికి డబ్బులు ఇచ్చి పెట్టుకోవాల్సిన పని ఏంటి నేనుండగా ఆయనను బాగా చూసుకుంటాను అని గౌరీ అంటుంది.

ఎందుకత్తయ్య బావని నేను చూసుకుంటాను లే అని ఉజ్వల అంటుంది. నువ్వు ఆఫీసులో ఒక ఎంప్లాయ్ వి నువ్వెలా చూసుకుంటావు పైగా పెళ్లి కాని ఆడపిల్లవి బాగోదు కాబట్టి ఈశ్వర్ ఇకనుంచి గౌరీ ఆఫీస్ కి వచ్చి నిన్ను చూసుకుంటుంది అని సునంద అంటుంది. సరే అమ్మ అని ఈశ్వర్ అంటాడు. థాంక్స్ అండి థాంక్స్ అత్తయ్య నేను వెళ్లి రెడీ అయి వస్తాను అని గౌరీ వెళ్ళిపోతుంది. నాన్న ఈశ్వర్ గౌరీ కి చదువు తక్కువే కానీ సంస్కారం ఎక్కువ తను నీ పక్కన ఉంటే నిన్ను చాలా బాగా చూసుకుంటుంది వెళ్ళు ఆఫీస్ కి రెడీ అవ్వు అని సునంద అంటుంది. సరే అమ్మ అని ఈశ్వర్ వెళ్ళిపోతాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది