NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏంటి… కోవిడ్ వ్యాక్సిన్ లో పంది మాంసం ఉందా? నిజమెంత…?

ప్రస్తుతం కరోనా మహమ్మారి రెండవసారి విజృంభించడానికి రెడీ అవుతున్న తరుణంలో ప్రపంచమంతా వ్యాక్సిన్ పైనే నమ్మకం పెట్టుకుంది. వచ్చే రెండు నెలల్లో పరిస్థితి మెరుగుపడుతుందని… వ్యాక్సిన్ అందరికీ లభిస్తుందని ఆశావహంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ తయారీపై కొన్ని పుకార్లు చెలరేగాయి…

 

వ్యాక్సిన్ లో పంది మాంసం…

వివరాల్లోకి వెళితే… కరోనా వ్యాక్సిన్ తయారీలో అవాంఛనీయమైన పదార్థాలను వినియోగించారు అంటూ కొత్త పుకార్లు బయటికి వచ్చాయి. దీంతో ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు కొన్ని దేశాలు సంశాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో వ్యాక్సిన్… ఒక్కో చోట వాడుకకు సిద్ధం అవుతున్న సమయంలో ఇందులో పంది మాంసం కలిపారని మొదలైన ప్రచారాన్ని ఒక వర్గం వ్యతిరేకిస్తుంది. పంది మాంసంతో చేసిన ఉత్పత్తులు వాడితే తమ మత సంప్రదాయాలకు విరుద్ధమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ఇస్లామిక్ దేశాలు వ్యాక్సిన్ కొనుగోలుకు తర్జనభర్జనలు పడుతున్నాయని సమాచారం.

ఇదే ప్రాబ్లం…

మరింత లోతుగా వెళితే… వ్యాక్సిన్ జీవితకాలం పెంచడానికి, మందును సురక్షితంగా సమర్థవంతంగా ఉండడానికి పంది మాంసంతో చేసిన జెలాటిన్ ను వాడుతుంటారు. ఇప్పుడు దీనినీ కారణంగా చూపుతూ పలు ముస్లిం దేశాలు వ్యాక్సిన్ వాడేందుకు అభ్యంతరం చేస్తున్నాయట. ఇస్లాంలో పందిని అపవిత్ర జంతువుగా చూస్తారు. అయితే పలు ముస్లిం పెద్దలు మాత్రం వ్యాక్సిన్ లకు మతంతో సంబంధం లేదని… దీనిని అందరూ తీసుకోవాల్సిందే అని చెబుతున్నారు. మతం కన్నా మనిషి ప్రాణమే ముఖ్యమని గుర్తు చేస్తున్నారు. పోలియో వ్యాక్సిన్ సందర్భంగా కూడా ఇస్లామిక్ సెంటర్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిందని… ఇప్పుడు అదే చేస్తామని అంటున్నారు పలువురు.

 

వారు ఏం చెబుతున్నారంటే…

ఇంకా కరెక్టుగా చెప్పాలంటే… మనిషి ప్రాణాలను కాపాడేందుకు హరామ్ (అపవిత్రమైన) పదార్థాలను వాడటం తప్పేమీ కాదని గ్రంథాలు కూడా చెబుతున్నాయని పలువురు పెద్దలు అంటున్నారు. పంది మాంసం పేరు చెబుతూ వ్యాక్సిన్ తీసుకోవద్దు అని పలువురు చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని ఇస్లాం మతాన్ని పాటించే వారంతా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ కు చెందిన మత పెద్ద మౌలానా ఖాలిద్ రషీద్ ఫిరంగి మహాలే పిలుపునిచ్చారు. యూదు మత పెద్దలు ఇదే మాట అనడం గమనార్హం.

Related posts

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?