NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా అచ్చెన్న….?

how atchennaidu behave further over government

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈ సామెత మాజీ మంత్రి గా ఏపీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గా అది కాకుండా ప్రస్తుతం పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కింజరాపు అచ్చెన్నాయుడు కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని సొంత పార్టీ వారే అంటున్నారట…! ఈ కథ ఏమిటో చూద్దాం…

 

how atchennaidu behave further over government

అచ్చం నాయుడు లో ఉండే దూసుకుపోయే తత్వమే అతనికి పార్టీ అధ్యక్షుడిగా పదవిని కట్టబెట్టింది అన్నది అందరికీ తెలిసిందే. నిజానికి ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించడం బాబుకు ఇష్టం లేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చారు అన్న టాక్ ఇప్పటికీ నడుస్తోంది. ఇక ఈయన పదవి వచ్చి రాగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు మోసం జరుగుతుందని ఊకదంపుడు ఉపన్యాసాలు మొదలు పెట్టేసాడు. లాజిక్ లేని ఆరోపణలు చేస్తున్నాడు. టిడిపి కన్నా వైసిపి ప్రభుత్వంలోనే తమకు ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందని బీసీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అంతెందుకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇద్దరు బీసీలను జగన్ రాజ్యసభకు పంపిన విషయాన్ని బహుశా అచ్చెన్న విస్మరించినట్లు ఉన్నారు.

 

సరే అధ్యక్షుడి పదవి చేపట్టి సామాజిక వర్గాల సమస్యల మీద పడ్డారు అచ్చన్న. ఆ విషయానికి వస్తే మొన్నటి ఎన్నికల్లో టిడిపి కన్నా వైసీపీనే బీసీలకు ఎక్కువ ఎం.పి, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. 56 బీసీ కార్పొరేషన్ పాలకవర్గాలను నియమించారు. వీటిలో 29 మహిళలను నియమించారు. బీసీ లోని ఉప కులాలు కూడా ఇక హ్యాపీగా ఉన్న సమiదంటాఅచ్చెన్న ఇదంతా బోగస్ అని ఆరోపణలు చేస్తున్నారు. సరే ఏదో అధ్యక్షుడు కదా మాట్లాడాలి అనుకుంటే…. రాష్ట్ర సమస్యలు సామాజిక సమస్యలను పక్కనపెట్టి తన సొంత జిల్లా సొంత ప్రాంతాన్ని పట్టించుకుంటే మంచిది అని టిడిపి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ ముందుకు కదలడం లేదు. పైగా ఈరోజు ఎవరు జంప్ అవుతారో అర్థంకాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అచ్చన్న అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం ఎవరికీ నచ్చడం లేదట.

 

పది అసెంబ్లీ లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి గత ఎన్నికల్లో దక్కింది రెండు సీట్లు. విజయనగరం అయితే క్లీన్ స్వీప్. ఇక విశాఖ జిల్లాలో 15 కు నాలుగు గెలిచింది. ఉత్తరాంధ్ర పార్టీ ప్రతిష్ట పై దృష్టి పెట్టాలని టిడిపి సీనియర్లను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే చీపురుపల్లిలో సీనియర్ నేత గద్దె బాబూరావు బిజెపి లోకి వెళ్ళిపోయారు. ఇంకొంత మంది సీనియర్లు కూడా కమలం వైపు నడుస్తున్నట్లు సమాచారం. రాష్ట్రమంతా దృష్టిపెట్టి నవ్వులపాలు కావడం తప్ప అచ్చెన్న ఇప్పటిదాకా సాధించింది ఏమీ లేదు. దీంతో సొంత ప్రాంతం మీద కొంచమైనా శ్రద్ధ పెడితే… ఫలితం ఉంటుందని సొంత పార్టీలో వారే అనుకోవడం గమనార్హం.

Related posts

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?