NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

valentines Day : గెలిస్తే ప్రేమా..!? గేలిచేస్తే విరహమా..!? “ప్రేమ ఫిలాసఫీ – ప్రేమికుల రోజు స్పెషల్”..!!

Valentines Day : philosophy - Practicality

Valentines Day : ప్రతీ నిమిషం/ ప్రతీ గంట/ ప్రతీ రోజు ఒక పాఠం నేర్పుతుంది. కానీ నేర్చుకునే వయసు, ఓపిక, సమయం, సందర్భం చూసుకోవడమే మన కర్తవ్యం..! కానీ మనం మనుషులం. ఒక విధానంలో/ ఒక చట్రంలో ఇరుక్కున్న మనుషులం. అందుకే వయసుల వారీగా నేర్చుకునే పాఠాల్లో పదిహేడేళ్ల ముందు ఆటల/పుస్తక పాఠాలు.., పదిహేడేళ్ల తర్వాత ప్రేమ పాఠాలు.. ముప్పై ఏళ్ల తర్వాత డబ్బు/ కుటుంబ పాఠాలు.., యాభై ఏళ్ళ తర్వాత ఆరోగ్య పాఠాలు నేర్చుకోడానికి మాత్రమే శ్రద్ధ చూపిస్తుంటాం. అదే సంప్రదాయం అన్నట్టు ఫీలైపోతుంటాం..! అంటే మన జీవన విధానంలో “ప్రేమ”కి ఇచ్చిన స్థానం పదమూడేళ్ళ మాత్రమే..! అది గెలిస్తే నిజమైన ప్రేమ అన్నట్టు.. ఓడితే విరహం అన్నట్టు మనం ఇరుక్కున్న విధానంలో భాగం..! కానీ గెలిచినా/ ఓడినా… వయసు పది అయినా.., పాతిక అయినా.., నలభై అయినా.. అరవై అయినా.. ప్రేమ ప్రేమే. అది తెలిసిన వాడే పరిపూర్ణ ప్రేమికుడు..!!

Valentines Day : philosophy - Practicality
Valentines Day : philosophy – Practicality

Valentines Day : ఏ వయసులో అయినా..!!

పైన చెప్పుకున్నట్టు వయసుల వారీగా ప్రేమ విభజించి లోడ్ అయి ఉంటుంది. అంటే మన ప్రేమలో అమ్మ, పుస్తకం, ప్రియురాలు, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం అన్నీ భాగమే. నిజానికి మన మెదడు అపరిమితమైంది. ఎవరికీ ఎంత అయినా చోటివ్వగలదు. మన మనసు అచెంచలమైనది. ఎవరికీ, ఎంతయినా ప్రేమించగలదు. సో.., “అమ్మ, పుస్తకం, ప్రియురాలు, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం” అన్నిటినీ బాలన్స్ చేసుకుని జీవితకాలం ప్రేమించడం సాధ్యమే. అదే నిజమైన ప్రేమికుడి గొప్పతనం. వాడే ప్రేమికుడు. కానీ… కానీ దురదృష్టవశాత్తు మన చిప్ లో డేటా “ఒక్కొక్కరికీ ఒక్కో వయసుని/ ఒక్కో వయసులో ఒక్కో ప్రేమ అని లోడ్ చేసి మనల్ని పంపించారు” అందుకే ఈ విధాన చట్రం..! మారుతున్న సాంకేతికత.., మారుతున్న కాలం.. ఇంకా ప్రేమపై అభిప్రాయాలను/ అర్ధాలను ఎందుకు మార్చడం లేదు..!? ప్రేమని ఎందుకు బాలన్స్ చేయడం లేదు. ఇంకా ప్రేమ కోసం చావులు ఏంటి..? ఇంకా ప్రేమ విఫలమై ఆత్మహత్యలు ఏంటి..? ప్రేమ కోసం హత్యలు ఏంటి..!? ఇప్పటికీ ఏపీలో ఏడాదికి సగటున 180 ప్రేమ జంటల ఆత్మహత్యలు ఉంటున్నాయి. వాటిలో కులాలు, మతాలు, పేద ధనిక తేడాలే. నిన్నటికి నిన్న “చీరాల దగ్గర్లోని వేటపాలెంలో మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్న ఒక ముస్లిం అమ్మాయి – ఒక హిందూ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నారు. గత నెలలో రాజమండ్రి వద్ద కూడా ఓ జంట ఆత్మహత్య చేసుకుంది..! అంటే గెలిస్తేనే ప్రేమా..? ఓడితే విరహమేనా..!? “జ్ఞాపకం” ఎందుకు కాకూడదు..!?

Valentines Day : philosophy - Practicality
Valentines Day : philosophy – Practicality

ప్రేమికుల రోజు – భజరంగ్ దళ్..!!

ఇక చివరిగా ప్రేమికుల రోజు అంటే భజరంగ్ దళ్ గురించి చెప్పుకోవాలి. వారి గురించి చెప్పకుండా ప్రేమికుల రోజుని ముగిస్తే మహా పాపం..!! రోజంతా పార్కులు, గట్లు, పొదలు తిరిగి.., ప్రేమికులు కనిపిస్తే బలవంతంగా పెళ్లి చేసేసే సినిమాల్లోని భజరంగ్ దళ్ నిజ జీవితంలో కూడా అనేకం ఉన్నారు. వారి డిమాండ్ మాత్రం పోవడం లేదు.., మారడం లేదు..! కాకపోతే వారి ఆలోచన కూడా మారకపోవడమే విడ్డురం. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో బానిసలుగా ఉన్న వారితో ఆడుకునే భజరంగ్ ధల్… మనం పైన చెప్పుకున్న ఇతర ప్రేమలను ఎందుకు గుర్తించడం లేదు. చిన్న వయసులో పుస్తకం/ ఆటలతో ప్రేమ ఉండేలా చేయడం వారి బాధ్యత కాదా..!? ముప్పై దాటాక డబ్బు/ కుటుంబంపై ప్రేమ ఉండేలా చేయడం, పెళ్లి చేయడం వారి బాధ్యత కాదా..!? యాభై దాటాక ఆరోగ్యం సరిగా చూడడం వారి బాధ్యత కాదా..!? ఈరోజున పార్కులు తిరిగే భజరంగ్ ధల్ వాళ్ళు “అనాధాశ్రమాలు, పాఠశాలలు, వృద్ధాశ్రమాలు” ఎందుకు తిరగడం లేదు. అన్నీ చోట్లా/ అన్నీ వయసులో మనం పైన చెప్పుకున్న ప్రేమ సఫలం చేయడం భజరంగ్ దళ్ భాద్యత కదా..!? అటువంటి భజరంగ్ దళ్ పుట్టుకొస్తే “ప్రేమికుల రోజు” సఫలైనట్టే. ఇక చివరిగా ఇప్పటి వరకు చెప్పుకున్నది ఫిలాసఫి.. ఇప్పుడు ప్రాక్టికల్ గా చెప్పుకోవాలంటే “నిరుడు ఏం జరిగిందో.. ఈ ఏడాది అదే జరుగుతుంది.. ఈరోజు ఏం జరిగిందో.., వచ్చే ఏడాది కూడా అదే జరుగుతుంది.. ఆ తర్వాత ఏడాది కూడా అదే జరుగుతుంది”..! అదే పిలాసఫీకి ప్రాక్టీకాలిటీకి తేడా..!!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?