NewsOrbit
Featured తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP : బీజేపీ బ‌ల‌ప‌డటానికి బ్ర‌హ్మాండ‌మైన చాన్సిచ్చిన కేసీఆర్‌?

bjp targets cm kcr in telangana by strong strategy

BJP: తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీకి …. ముఖ్య‌మంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్ స్వ‌యంగా అవ‌కాశం ఇస్తున్నారా? ఇప్ప‌టికే అసంతృప్తితో ఉన్న వ‌ర్గాల‌కు త‌నంత తానుగా చాన్స్ ఇచ్చేయ‌డం జ‌రుగుతోందా? ఇప్పుడు తెలంగాణ‌లో ఈ హాట్ హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదంతా షేక్‌పేట తాహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక బదిలీ గురించి. దాని కేంద్రంగా జరుగుతున్న రాజ‌కీయాల గురించి.

does-kcr-giving-good-chance-to-bjp
does-kcr-giving-good-chance-to-bjp

BJP మేడ‌మ్ సార్‌…. మేడం అంతే!

వివిధ మీడియాల్లో , సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం బంజారాహిల్స్ పరిధిలో ఇష్టానుసారంగా కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వాలని గతంలో షేక్పేట్ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి పై మేయర్ గద్వాల విజయలక్ష్మి చిందులు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తనను బండబూతులు తిట్టడమే కాక విధులకు ఆటంకం కలిగించారని.. కోర్టుకు వెళ్లకుండా అడ్డుకున్నారని అప్పట్లో కార్పొరేటర్ గా ఉన్న గద్వాల విజయలక్ష్మి పై ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ అందునా.. ఒక ఎంపీ కూతురైన విజయలక్ష్మిపైనే పోలీసు కేసు పెట్టడం

కలకలం రేపింది. ఇదిలా ఉండగా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసిన విజయలక్ష్మి మరోసారి గెలుపొందడమే కాదు.. ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో మేయర్ పీఠం దక్కించుకుంది. అలా మేయర్ పీఠంలో కూర్చుందో లేదో.. సంబరాలు ముగిసిన వెంటనే తన ప్రత్యర్థులపై పంతం నెగ్గించుకునే పని చేపట్టినట్లు దుమారం చెలరేగుతోంది.

ఇప్పుడు ఏం జ‌రిగింది?

స‌ద‌రు సంచ‌ల‌న ఎమ్మార్వో శ్రీనివాసరెడ్డిని సీసీఎల్ఏకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న తాహశీల్దార్ కె.వెంకట్ రెడ్డి నియమించారు. పైకి సాధారణ బదిలీగానే కనిపించినా.. రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్ లో ప్ర‌చారం జరుగుతోంది.

ఉద్యోగుల ఆగ్ర‌హం

షేక్‌పేట తాహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక బదిలీ అన్యాయమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఖండించింది. అకారణంగా బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వక పోవడం దారుణమంటూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. రాత్రి పగలు పని చేసినా రెవెన్యూ శాఖలో జరుగుతున్న సంఘటనల పై తీవ్ర అసంతృప్తి చేయడంతోపాటు.. కక్ష సాధింపులా చేసిన బదిలీని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేసింది. తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ జిల్లా నుండి అకారణంగా రాత్రి సమయంలో బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకపోవడం వెనుక కొందరు నాయకుల ఒత్తిడి ఉన్నట్టు తెలిసిందని, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు రెవెన్యూ అసోసియేషన్ ప్రకటించింది. ఆయనకు వెంటనే హైదరాబాద్ జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని ట్రెసా నేతలు డిమాండ్ చేసింది. కాగా, ఇప్ప‌టికే రెవెన్యూ ఉద్యోగుల్లో టీఆర్ఎస్ ప‌ట్ల ఒకింత అస‌హ‌నం ఉండ‌గా తాజాగా ఈ నిర్ణ‌యం దానికి ఆజ్యం పోస్తుంద‌ని ఇదంతా విప‌క్ష బీజేపీ కి కల‌సి వ‌స్తుంద‌ని కొంద‌రు జోస్యం చెప్తున్నారు.

author avatar
sridhar

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N