NewsOrbit
న్యూస్

Peddireddy Ramachandra Reddy: జీవో నెం.2ను హైకోర్టు రద్దు చేయడంపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన ఇదీ..!!

Peddireddi ramachandra Reddy comments on go no.2

Peddireddy Ramachandra Reddy: గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శుల అధికారాల్లో కొన్ని విఆర్‌ఓలకు బదలాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.2ను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఆ జివో లో లోపాలు ఉన్నట్లు తాము గుర్తించామని మంత్రి చెప్పుకొచ్చారు. ఆ లోపాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సర్పంచ్ ల అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకున్నామనీ, సదరు జివో లో ఉన్న లోపాలను సరిచేయాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలోనే కొందరు కోర్టుకు వెళ్లారని మంత్రి చెప్పారు.

Peddireddy Ramachandra Reddy comments on go no.2
Peddireddy Ramachandra Reddy comments on go no.2

Read More: Kaushik Reddy: కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా..! రేవంత్ పై తీవ్ర స్థాయి ఆరోపణలు..!!

 

పరిపాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిందని పునరుద్ఘాటించిన మంత్రి పెద్దిరెడ్డి వీటిని తగిన విధంగా బలోపేతం చేయాల్సి అవసరం ఉందన్నారు. ఇప్పుడు ఎలాగూ కోర్టు ఆ జివోను రద్దు చేసింది కాబట్టి లోపాలను సరిదిద్దుకుని మళ్లీ కొత్త జీవోను జారీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. దీనిపై న్యాయ విభాగంతోనూ, సంబంధిత శాఖాధికారులతోనూ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

కొసమెరుపు .. ఇంతకు ముందు హైకోర్టు.. ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుబడితే ఆ తీర్పును ప్రభుత్వం పై కోర్టులో సవాల్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంటున్నా ఆ జివోలోని లోపాలను సవరించి మరోక జీవో విడుదల చేస్తామని చెప్పడం విశేషం. కాగా జివో 2 ను హైకోర్టు సస్పెండ్ చేయడం పట్ల పంచాయతీ రాజ్ ఉద్యోగులు, సర్పంచ్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి ప్రకటనతో ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు సంబంధించి మరెలాంటి జి వో  తీసుకువస్తుందోనన్న చర్చ జరుగుతోంది.

Read More: Huzurabad Congress: హుజూరాబాద్ కాంగ్రెస్‌లో కుదుపు..! ఆడియో టేప్ వైరల్..! కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసు..!!

Related posts

PS AB Venkateswararao: ఏపీ సీఎస్ ను కలిసిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. పోస్టింగ్ కోసం వినతి

sharma somaraju

YSRCP: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్

sharma somaraju

AP Election 2024: కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే జైలుకే: సీఈవో ముకేష్ కుమార్ మీనా

sharma somaraju

KTR: రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలు: కేటీఆర్

sharma somaraju

YCP MLA Pinnelli: మరో సారి హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి .. కీలక వినతి

sharma somaraju

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం .. లోయలో బస్సు పడి 21 మంది మృతి..40 మందికి గాయాలు

sharma somaraju

`జ‌గ‌న్ అనే నేను`కు ఐదేళ్లు పూర్తి… సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ వెన‌క‌..?

ఆ టీడీపీ టాప్ లీడ‌ర్‌కు చివ‌రి సారి అయినా ప‌రువు ద‌క్కుతుందా… ఉన్న‌ది కూడా పోతుందా ?

ఏపీలో ఎన్న‌డూ లేని టెన్ష‌న్‌.. ఉద్యోగాల‌ను వ‌దిలేసే ప‌రిస్థితి ఎందుకు..?

టీడీపీ బీకాంలో ఫిజిక్స్‌ లెక్క ఇదీ.. ఎన్నిక‌ల వేళ ఇంత పెద్ద డ్రామా చేశారా ?

ట‌ఫ్ ఫైట్ లీడ‌ర్లు… పూజ‌ల్లో బిజీబిజీ… ఈ సెంటిమెంట్ వెన‌క క‌థ ఇదే..?

ఫ‌స్ట్‌-ఫ‌స్ట్.. పలాస‌.. వైసీపీలో ఇదే బిగ్ హాట్ టాపిక్‌..?

జూన్ 1 కోసం త‌మ్ముళ్ల వెయిటింగ్‌.. రీజ‌నేంటి..!

వైసీపీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం .. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై మరో సారి స్పష్టత ఇచ్చిన ఈసీ ..హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ

sharma somaraju

Agnibaan: అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం

sharma somaraju