NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Amit Shah: తెలంగాణ బీజేపీ నేతలకు క్లాస్ తీసుకున్న అమిత్ షా

Amit Shah: తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల మధ్య కోల్డ్ వార్ పై అమిత్ షా సీరియస్ అయ్యారని సమాచారం. వ్యక్తిగత లక్ష్యాల కోసం కాకుండా పార్టీ కోసం పని చేయాలని నేతలకు అమిత్ షా సూచించారుట. సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలకు దూరంగా ఉండాలని కోరినట్లు తెలుస్తొంది. నేతల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని కిషన్ రెడ్డికి అమిత్ షా ఆదేశించారు.

గురువారం హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ నోవాటెల్ హోటల్ నందు ముఖ్యనేతలతో సమావేశమైయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించిన అమిత్ షా..కొత్త ప్రభుత్వ పాలన, రాజకీయ పరిణామాల పై నేతలతో చర్చించారు. వర్గ విభేదాల వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామన్న అభిప్రాయపడ్డారు. విభేదాలు లేకుండా కలిసి పని చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపర్చాయన్నారు. 30 సీట్లు వస్తాయని ఆశించామనీ, కానీ అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయామన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో సమన్వయంతో పని చేయాలన్నారు అమిత్ షా. రాష్ట్రం నుండి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలని సూచించారు. సిట్టింగ్ ఎంపీలకే మరో సారి అవకాశం కల్పిస్తామని తెలిపిన అమిత్ షా..మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తామని చెప్పారు. ఈ సారి అభ్యర్ధులను త్వరగా ప్రకటిస్తామని వెల్లడించారు. ఇదే సందర్భంలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఎంపికపైనా చర్చ జరిగింది. బీసీ సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్లోర్ లీడర్ గా బీసీ ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందని అమిత్ షా అభిప్రాయపడినట్లు తెలుస్తొంది. కాగా, ఈ రేసులో బీసీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ ఉన్నారని సమాచారం. ఒక వేళ రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే రేసులో ఏలేటి మహేశ్వరరెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి లు ఉన్నారు.

ముఖ్య నేతలతో సమీక్ష అనంతరం అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, డీకే అరుణ, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, మురళీధర్ రావు, గరికపాటి, చాడా సురేష్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N