NewsOrbit
న్యూస్

ISRO: నూతన సంవత్సరం తొలి రోజు నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ 58 రాకెట్

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన సంవత్సరం (2024) మొదటి రోజే పీఎస్ఎల్‌వీ – సీ 58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. పీఎస్ఎల్వీ వాహన నౌక మన దేశానికి చెందిన ఎక్స్ – రే పొలారిమీటర్ ఉపగ్రహం (ఎక్స్ పోశాట్) ను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించి శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లో కౌంట్ డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైంది.

ఈ ప్రక్రియ 25 గంటల పాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్వీ –సీ 58 వాహన నౌక షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుండి అంతరిక్షంలోకి దూసుకువెళ్లనుంది. ఇది ఎక్స్ పోశాట్ ను కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత పీఎస్ 4 10 ఇతర పేలోడ్ లను హోస్ట్ చేయనుంది. భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్ – రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి ఎక్స్ పోశాట్ నాంది కానుంది.

ఇమేజింగ్, టైం – డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కోపీ పై ప్రధానంగా దృష్టి సారించిన గతంలోని మిషన్ల మాదిరిగా కాకుండా..ఎక్స్ రే ఖగోళ శాస్త్రానికి ఒక కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్ – రే మూలాలను అన్వేషించడం ఎక్స్ పోశాట్ లక్ష్యం. ఈ ఉపగ్రహ జీవితకాలం అయిదేళ్లు. పీఎస్ఎల్వీ చివరి దశ మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లనుంది. దీనికి పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్ పెరిమెంటల్ మాడ్యూల్ (పీవోఈఎం) అని పేరు పెట్టారు.

కాగా, పీఎస్ఎల్వీ – సీ 58 ప్రయోగం నేపథ్యంలో ఇస్ర్రో శాస్త్రవేత్తలు ఇవేళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ – సీ 58,ఎక్స్ పోశాట్ నమూనా చిత్రాలను శ్రీవారి పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

Ibrahimpatnam (NTR): మున్సిపల్ కార్మికుల సమ్మె .. ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N