Pawan Kalyan: విక్టరీ వెంకటేష్ 75వ సినిమా సైంధవ్. వెంకటేష్ కెరియర్ లో ఇది 75వ సినిమాగా తెరకెక్కటంతో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుకొంది. జనవరి 13వ తారీకు ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇటీవలే ఈ సినిమాకి సెన్సార్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. “సైంధవ్” కి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇవ్వటం జరిగింది. సినిమా 2 గంటల 15 నిమిషాల రన్ టైంతో రూపొందుకుంటుంది. ఇదే సమయంలో సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రివ్యూలు మరియు కామెంట్లు కూడా వచ్చినట్లు టాక్. కచ్చితంగా “సైంధవ్” తో వెంకటేష్ మరో హిట్ అందుకుంటారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. తండ్రి కూతుర్ల బంధం ప్రదానంశంగా యూనిక్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను సినిమా అల్లరించబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.
ఈ సినిమాలో వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ మధ్య మెచ్యూర్ రిలేషన్ షిప్ కూడా ఉంది. కూతురితో కలిసి సింగల్ పేరెంట్ గా ఉన్న వెంకటేష్ కి సహాయం చేయడానికి ఆమె పాత్ర కనిపిస్తుంది. అంతేకాదు నవజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహాని శర్మ, ఆండ్రియా జెరేమియా.. లాంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే వెంకీ 75వ పేరుతో… ఇటీవల హైదరాబాద్ లో “కలియుగ పాండవులు- సైంధవ్” అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు సందడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు. పక్కనే ఉన్న వెంకటేష్ కచ్చితంగా చిరంజీవి గారితో సినిమా ఉంటుంది ఆ సినిమా అదిరిపోతుంది గుర్తుపెట్టుకోండి అని వెంకటేష్ అన్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. మెగా ఫ్యామిలీతో వెంకటేష్ కి మంచి అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, అజ్ఞాతవాసి సినిమాలు చేయడం జరిగింది. వెంకటేష్ అంటే పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానంతో వెంకటేష్ కెరియర్ లో 75వ చిత్రం సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ రాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సంక్రాంతి కానుకగా జనవరి 13 విడుదల కాబోతోంది.