NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili January12 2024 Episode 545: పని కోసం అడ్డ మీద నిలబడిన మల్లి.

Malli Nindu Jabili Today Episode January 12  2024 Episode 545 Highlights

Malli Nindu Jabili January 12  2024 Episode 545: నాకు ఉద్యోగం వచ్చిందని ఆయన దగ్గర చెప్పుకొని మురిసిపోదాం అనుకున్నాను ఇలా చేసావ్ ఏంటి దేవుడా అని మల్లి బాధపడుతుంది. ఏడుస్తూ కూర్చుంటే పని అవ్వదు ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి అని మల్లి నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ ఒక అడ్డా కనిపించి అందులో స్కూళ్లలో నిలబడతారు అక్కడికి వెళ్లి వాళ్లని మల్లి పని అడుగుతుంది.ఏంటమ్మా మీరు కూలి పని అడగడానికి వచ్చారా మాతో పరాచికాలు ఏంటి మీకు అని పని చేసే అతను అంటాడు. నిజంగానే పని కోసం వచ్చానండి అని మల్లి అంటుంది. అక్కడికి పనికి తీసుకుపోవడానికి వచ్చిన అతను అందర్నీ ఆటోలో ఎక్కిస్తుండగా సార్ నాకు కూడా ఏదైనా పని ఇప్పించండి అని మల్లి అడుగుతుంది. ఏంటమ్మా నిన్ను చూస్తుంటే చదువుకున్న దానిలా గొప్పింటి దానిలా కనిపిస్తున్నావ్ ఇక్కడికి వచ్చి పని అడుగుతున్నావు ఏంటి అని అతను అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 12  2024 Episode 545 Highlights
Malli Nindu Jabili Today Episode January 12  2024 Episode 545 Highlights

ఇప్పుడు నాకు పని అవసరం అండి బాగా బతికినోళ్ళమేనండి అనుకోకుండా రోడ్డున పడ్డం కుటుంబం గడవాలి మీలో ఒకరు అనుకోని నాకు కనిపించండి అని మల్లి బ్రతిమలాడుతుంది. సరే అని అతను మల్లిని పనికి తీసుకు వెళ్తాడు. కట్ చేస్తే, మీరా కాలిపోయిన ఫోటో తీసుకువచ్చి అరవింద్ బాబుకి చూడమని ఇస్తుంది. ఇది ఎక్కడ దొరికింది అత్తయ్య అని అరవింద్ అడుగుతాడు. వసుంధర అమ్మగారు ఏవో పేపర్లు కాలుస్తుంటే చూశాను బాబు గారు అని చెప్తుంది. బాబు గారు వసుంధరమ్మ గారు తెలియకుండా రహస్యంగా ఏదో చేస్తుంది నా కూతురు జీవితాన్ని బుగ్గిపాలు చేయాలనుకుంటుంది నా కూతురు ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు నా కూతుర్ని నువ్వు ఎలాగైనా కాపాడాలి బాబు గారు అని మీరా అంటుంది. వసుంధర అత్తయ్యే కాదు మల్లికి ఎవరు హాని చేయాలని చూసినా నేను కాపాడుతాను మీరేం భయపడకండి అని అరవింద్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, మాలిని అరవింద్ ని ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. మీ నాన్నకి ఫోన్లో బాగోలేదు కదా వర్క్ చేసే దగ్గరికి వెళ్తున్నాను అని అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 12  2024 Episode 545 Highlights
Malli Nindu Jabili Today Episode January 12  2024 Episode 545 Highlights

వర్క్ దగ్గరికి వెళ్తున్నారా ఇంకెక్కడికైనా వెళ్తున్నారా తమరికి సమాజ సేవ ఎక్కువ కదా అని మాలిని అంటుంది. చెప్పాను కదా వర్క్ దగ్గరికి అని అబద్ధం ఎందుకు చెప్తాను అని అరవింద్ వెళ్ళిపోతాడు. నీ మాటలు తీయగా ఉన్న ఏదో తేడాగా ఉంది అని మాలిని అరవింద్ వెనకాల ఫాలో అవుతుంది. కట్ చేస్తే, మల్లిని తీసుకువెళ్లి అతను ఇక్కడ కూలీలు ఎంతమంది వస్తారు మెటీరియల్ ఎంత వస్తుందని లెక్కలు రాసుకోవాలి అని మల్లికి ఈ పని అప్పచెప్తాడు అతను. ఇక్కడ కూర్చొని లెక్కలు రాస్తూ అందరూ పనిచేస్తున్నారు లేదో అప్పుడప్పుడు చూస్తూ ఉండమ్మా నిన్ను పనిలో పెట్టుకున్నానని బిల్లింగ్ ఓనర్ గారికి కూడా చెప్తాను అని అతను అంటాడు. మీ సహాయం ఈ జన్మలో మర్చిపోలేనండి అని మల్లి అంటుంది. నా చేతనైంది నేను చేశాను అమ్మ ఇక్కడ ఈ పని లేకపోతే నీకు ఇచ్చేవాన్ని కాదేమో సరే సరే నేను వెళ్తున్నాను చూసుకో అని అతను వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, అరవిందు వర్క్ దగ్గరికి బయలుదేరుతాడు. మాలిని అరవింద్ వెనకాల ఫాలో అవుతుంది.

Malli Nindu Jabili Today Episode January 12  2024 Episode 545 Highlights
Malli Nindu Jabili Today Episode January 12  2024 Episode 545 Highlights

మల్లికి ఈ పని ఇచ్చిన అతను కాఫీ తెచ్చి ఇచ్చి వెళ్తాడు. అరవింద్ నీ మాటల్లో తేడా లేకపోయినా నిన్ను అనుమానించాల్సి వస్తుంది అని మాలిని అనుకుంటుంది. నీ బాధ నేను అర్థం చేసుకోగలను మాలిని కానీ మల్లి మీద నాకు బాధ్యత మాత్రమే ఉంది వేరే ఉద్దేశం లేదు అని అరవింద్ అనుకుంటాడు. కట్ చేస్తే, అరవింద్ పనిచేసే దగ్గరికి వస్తాడు, వర్క్ బాగా జరుగుతుందా అని అరవింద్ అతనిని అడుగుతాడు. బాగా జరుగుతుంది సార్ ఈరోజు ఒక కొత్త అమ్మాయి జాయిన్ అయింది ఆవిడను పరిచయం చేస్తాను అని అతను అంటాడు. అమ్మ మల్లి మా అల్లుడు గారి సారుగారు వచ్చారు నిన్ను పరిచయం చేస్తాను రా అని అతను అరవింద్ దగ్గరికి మల్లిని తీసుకువెళ్తాడు. మల్లి అక్కడికి వచ్చి చూసేసరికి అరవింద్ కనిపిస్తాడు షాక్ అయి నిలబడి చూస్తుంది మల్లి. కొత్తగా జాయిన్ అయింది ఈ అమ్మాయి సార్ పేరు మల్లి ఈరోజే అడ్డ మీద కూలి కోసం నిలబడింది సార్ అందుకే పనిలో పెట్టాను అని అతను చెప్తాడు. సరే నువ్వు వెళ్లు నేను చూసుకుంటాను అని అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 12  2024 Episode 545 Highlights
Malli Nindu Jabili Today Episode January 12  2024 Episode 545 Highlights

నిన్ను ఇలా చూస్తుంటే కష్టంగా ఉంది మల్లి అని అరవింద్ అంటాడు. నా బ్రతుకు ఇలా తగిలడినప్పుడు నన్ను చూసి జాలి పడటం దేనికి అని మల్లి అంటుంది. ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా ఎందుకు ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తున్నావ్ అని అరవింద్ అంటాడు. ఆ ప్రయత్నం కూడా చేశాను నాలాగా మోసపోయిన వాళ్ళని ఇంకా మోసం చేయడానికి చాలామంది ఉంటారు కదా నా సర్టిఫికెట్లని తీసుకొని మాయమైపోయారు అని మల్లి ఏడుస్తూ చెప్తుంది. నువ్వు ఇక్కడ ఇలాంటి పనులు చేయకూడదు రా మల్లి ఇంటికి వెళ్దాం అని అరవింద్ మల్లి చేయి పట్టుకుంటాడు. మల్లి ఇక్కడ వర్క్ చేయాల్సిన అవసరం ఏంటి అని మాలిని అనుకుంటుంది.

Malli Nindu Jabili Today Episode January 12  2024 Episode 545 Highlights
Malli Nindu Jabili Today Episode January 12  2024 Episode 545 Highlights

ఇది మీకు సంబంధించినది అని తెలిసిన తర్వాత ఇక్కడ పని చేయడం అనవసరం వేరే దగ్గర చూసుకుంటాను అని మల్లి కోపంగా అంటుంది. ఏదైనా ఆపద వచ్చిన అవసరం వచ్చిన నీకోసం నేనున్నానని మర్చిపోకు అని అరవింద్ అంటాడు. అంత అవసరం నాకు లేదు అని మల్లి వెళ్ళిపోతూ ఉండగా తన కాలుకి దెబ్బ తగులుతుంది. అరవింద్ పరిగెత్తుకెళ్ళి కారులో కట్టు కట్టే బాక్స్ ఉంటే తెచ్చి అరవింద్ మల్లి కాలుకు కట్టబోతాడు. మాలిని అక్కడే ఉండి అదంతా చూస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri