NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi January 16 2024 Episode 307: స్వప్నకు భయపడిన రుద్రాణి రాహుల్ ..వదినకి కళ్యాణ్ సపోర్ట్.. కావ్య ని అడ్డుపెట్టి శోభనం ఆపిన అనామిక..

Brahmamudi Today Episode January 16 2024 Episode 307 Highlights

BrahmaMudi:స్వప్న రుద్రాణి నీ ముప్పు తిప్పలు పెడుతూ ఉంటుంది. నాకు ఇప్పటికిప్పుడు పాయసం తినాలనిపిస్తుంది అని చెప్పడంతో రుద్రాణి అందుకు కుదరదు అంటుంది దానికి స్వప్న నేను ఉమెన్ వెల్ఫేర్, ఆఫీసర్ కి ఫోన్ చేసి మీ మీద కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది దానికి భయపడి స్వప్నకి పాయసం తీసుకురావడానికి రుద్రాణి వంట గదిలోనికి వెళుతుంది. రుద్రా నీ దగ్గరికి వచ్చిన రాహుల్ ఏమైంది మమ్మీ అని అడుగుతాడు తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా అని అంటుంది తెలిసే అడుగుతున్నాను మమ్మీ అని అంటాడు. నాకు ఈ స్వప్న టార్చర్ తట్టుకోలేకపోతున్నాను తను ఇప్పుడు పాయసం తినాలనిపిస్తుంది అంది అందులో కాస్త పాయసం కల్పిస్తే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. అంత పని చేస్తే మనిద్దరం ఇరుక్కుంటాము అలాంటి పనులు చెయ్యొద్దు అని అంటాడు రాహుల్. మరి ఇప్పుడు ఎలాగో అని అంటుంది రుద్ర అని ఏముంది మమ్మీ కాంప్రమైజ్ అయిపోయి స్వప్న అడిగిన పాయసాన్ని తీసుకొచ్చి చెయ్ అని అంటాడు అంతలో స్వప్న ఏంటి అక్కడ ముచ్చట్లు నేను అడిగింది తీసుకొస్తున్నారా లేదా అని అంటుంది వెంటనే స్వప్న మాటలకు కంగారుపడి రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రుద్రాణి, స్వప్నకు భయపడి తీసుకొస్తున్నాను అని అంటుంది. ఈ స్వప్న టార్చర్ తట్టుకోలేకుండా ఉన్నాను అని అనుకుంటుంది రుద్రాణి..

Brahmamudi Today Episode January 16 2024 Episode 307 Highlights
Brahmamudi Today Episode January 16 2024 Episode 307 Highlights

ఇక కళ్యాణ్ అనామిక శోభనానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. రాజ్ కళ్యాణ్ గదిలోనికి వెళ్లి అక్కడ వేరే వాళ్ళని చూసి మీరేంటి ఇక్కడ అని అడుగుతారు కావ్య మేడం నన్ను రూమ్ డెకరేట్ చేయమని, చెప్పారు అని చెప్తాడు అక్కడ ఉన్న పనివాడు ఇదేంటి కొత్తగా, కావ్య చేయకుండా వేరే పనివాని పెట్టింది అని మనసులో అనుకొని కావ్య కోసం వెతుకుతూ ఉంటాడు రాజ్. కావ్య ఒంటరిగా నిలబడి ఉంటుంది కావ్య దగ్గరికి వెళ్లిన రాజ్, నువ్వు ఇంకా ఏదో పనిలో ఉండి పని వాళ్ళని పెట్టావ్ అనుకున్నాను నువ్వు ఖాళీగా ఉండి పని వాళ్ళని పెట్టి శోభనం గది డెకరేట్ చేయమని చెప్పావా అని అంటాడు. ఏదైతే ఏమైంది లెండి పని అయితే జరుగుతుంది కదా అని అంటుంది కావ్య. అందులో నీవు ఇన్వాల్వ్మెంట్ లేదని అడుగుతున్నాను అని అంటాడు. అప్పుడే అటుగా వెళుతున్నాను అనామిక వాళ్ళ మాటలు విని ఆగుతుంది. రాజ్ కావ్యతో ఎప్పుడూ ఇలాంటి పనులన్నీ నువ్వే చేస్తావు కదా ఈసారి ఎందుకు దూరంగా ఉన్నావు అని అడుగుతాడు దానికి కావ్య ధాన్యలక్ష్మికి ఇచ్చిన మాటను గుర్తుచేసుకొని ఒకళ్ళు నన్ను వద్దన్నారు అందుకని ఇట్లా ఉన్నాను అని అనేసరికి అప్పుడు అక్కడికి వచ్చిన అనామిక, నా విషయం కదా బావగారు అందుకనే తన ఇన్వాల్వ్ అవ్వట్లేదు మొదటి నుంచి నేనంటే తనకి ఇష్టం లేదు తన చెల్లిలతో కళ్యాణ్ పెళ్లి జరగలేదని నా మీద కోపం పెట్టుకుంది ఇక కావ్య ఎప్పటికీ మారుతుందో అని అంటుంది. నేను ఎవరి మీద కోపడాల్సిన అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. అనామిక రాజుతో ఎప్పుడూ కావ్య నన్ను అర్థం చేసుకుంటుందో బావగారు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా కళ్యాణ్ కూడా చూస్తాడు.

Brahmamudi Today Episode January 16 2024 Episode 307 Highlights
Brahmamudi Today Episode January 16 2024 Episode 307 Highlights

ఇక కావ్య వంటగదిలోకి వెళ్లి బాధపడుతూ ఉంటుంది అక్కడికి వెళ్లిన కళ్యాణ్ వదిన అని పిలుస్తాడు. ఏంటి కవి గారు రెడీ అవ్వకుండా వంటగదిలోనికి వచ్చారు ఏమన్నా కావాలా అని అడుగుతుంది. మీరు నా విషయంలో ఇన్వాల్వ్ చేసుకోకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటాడు. రెండు చేతులకి పని ఉంది పని చేస్తున్నాను కదా వేరే వాళ్ళు చేస్తున్నారు లెండి మీ పని అని అంటుంది. నా పని వేరే వాళ్ళు చేస్తే నాకు ఇష్టం ఉండదు వదిన నా ప్రతి పనిలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే ఎవరో ఏదో అన్నారని మీరు నన్ను సపోర్ట్ చేయడం మానేస్తారా, వాళ్ళు ఎవరితోనో మీకు ఎందుకు వదిన మీరు ఇలా ఉంటే నా మనసు అసలు ఒప్పుకోదు అని అంటాడు ఏమైంది కవి గారు ఇప్పుడు నేను బానే ఉన్నాను అని అంటుంది కావ్య మీ కళ్ళల్లో ఉండి నీళ్లు చెప్తున్నాయి వదిన అని అంటాడు. ఉల్లిపాయలు కట్ చేసాను కదా అందుకని అని అంటుంది మన ఇంట్లో ఉల్లిపాయలు కట్ చేస్తేనే నీళ్లు వస్తాయని అంటున్నారు మరి మీరు కట్ చేస్తుంది టమోటాలు కదా అని అంటాడు. ఇందాక ఉల్లిపాయలు కట్ చేశాను లేక అవి గారు అని అంటుంది కావ్య మాట భలే దాటేస్తున్నారు వదిన అని అంటాడు కవి. మీరిలా ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అని అంటాడు కళ్యాణ్ నాకు ఎప్పుడు బాధ కలిగినా మీరే నన్ను ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారు నా పెళ్లి ఇక్కడికి వచ్చిన మొదటి రోజు నుండి ఇప్పటివరకు నేను ఎప్పుడూ ఒంటరిని అని ఫీల్ అయినా మీరు నాకు తోడు ఉన్నారు రవి గారు అని అంటుంది కావ్య. మరి అలాంటప్పుడు మీరు నాకు తోడుండాలి కదా వదినా అని అంటాడు. ఒకరితో మీకు అనవసరం వదినా మీరు నన్ను సపోర్ట్ చేసి నా విషయంలో మీరు పట్టించుకుంటే నేను సంతోషిస్తాను అని అంటాడు. ఆ మాటలకు కావ్య సరే కవిగారు మీకోసం ఎవరు ఏమన్నా సరే మీకు నేను సపోర్ట్ చేసి తీరుతాను అని అంటుంది. మరి అన్నయ్య డెకరేషన్ చేయడానికి రాడేమో వదిన అని అంటాడు మీ అన్నయ్య నేను ఎలా పిలవాలో నాకు తెలుసులే అని అంటుంది కావ్య.

Brahmamudi Today Episode January 16 2024 Episode 307 Highlights
Brahmamudi Today Episode January 16 2024 Episode 307 Highlights

ఇక రాజ్ గదిలో ఆఫీస్ పనిలో మునిగిపోయి ఉంటాడు. మీకు కాస్త బాధ్యత అయినా ఉండాలి కదండీ అని అంటుంది కావ్య అర్థం కాకుండా మాట్లాడకు అని అంటాడు అర్థం అయ్యే భాషలో మాట్లాడిన మీకు అర్థం కాదు లెండి అని అంటుంది. ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నావే అని అంటాడు. శోభనానికి రండి అని అంటుంది కావ్య. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని అంటాడు. కాస్త కూడా సిగ్గు లేకుండా ఏమిటా మాటలు అని అడుగుతాడు అదేనండి శోభనం గది డెకరేషన్ చేయడానికి రమ్మంటున్నాను అని అంటాడు. శోభనానికి రండి శోభనం గది డెకరేషన్ చేయడానికి రండి అని అనడానికి చాలా తేడా ఉంది నువ్వు మాట్లాడే మాటలు ఒక్కసారి నీకైనా అర్థమవుతాయి అని అంటాడు నాకు బాగా అర్థమవుతున్నాయి మీకే అర్థమవ్వట్లేదు అని అంటుంది కావ్య. కావాలనే రాజ్ ని ఉడికిస్తుంది. శోభనం పేరు చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి రాజ్ ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కావ్య. పెళ్లి ఎన్ని రోజులైనా ఒకచటం ముచ్చట లేదంటూ రాజు పై కావ్య సెటైర్ వేస్తూ ఉంటుంది. చివరకు కావ్య రాజుని శోభనం గది డెకరేషన్ చేయడానికి తీసుకు వెళ్తుంది ఇద్దరు కలిసి డెకరేషన్ చేస్తూ ఉంటారు.

Brahmamudi Today Episode January 16 2024 Episode 307 Highlights
Brahmamudi Today Episode January 16 2024 Episode 307 Highlights

ఇక రాజ్ కావ్య మొదట ఎందుకు డెకరేషన్ కి రాలేదా అని కనుక్కోవాలి అనుకుంటాడు. మొదటి నేను వచ్చి డెకరేషన్ చేయలేదు ఎందుకు అంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయావు ఇప్పుడు మళ్లీ నన్ను తీసుకొని డెకరేషన్ చేయడానికి వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఎవరో నన్ను వద్దన్నారు ఎవరికోసమో నేను కూడా వద్దు అనుకున్నాను కానీ ఇంకెవరో వచ్చి నేను కావాలి నాతోనే ఈ పనులన్నీ చేయించాలి అనుకున్నారు వారి కోసం నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు అర్థమైందా అని అంటుంది. నువ్వు చెప్పిన వాటిలో ఎవరు తప్ప ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు అని అంటాడు రాజ్. సరేలెండి ఇప్పుడు మీకు చెప్పి మాత్రం ప్రయోజనం ఏముంది ముందు పని కానివ్వండి అని అంటుంది కావ్య. ఆ మాటలకు రాజ్ నీతో పని చేయడం నావల్ల కాదే అని అంటాడు అయితే ఈ మాట వెళ్లి కవి గారితో చెప్పండి అని అంటుంది. వద్దులే మనం పని చూసుకుందాం అని అంటాడు ఇద్దరు కలిసి రూమ్ మొత్తం డెకరేషన్ చేస్తారు.

Brahmamudi Today Episode January 16 2024 Episode 307 Highlights
Brahmamudi Today Episode January 16 2024 Episode 307 Highlights

ఇక రుద్రాణి స్వప్న కు భయపడుతూ ఉంటుంది ఎవరికి తెలియకుండా స్వప్న కూడా కనపడకుండా స్టోర్ రూమ్ లో ఒక పక్కన పడుకుని ఉంటుంది. అప్పుడే స్వప్న రుద్రానికి ఫోన్ చేస్తుంది ఈ టైం లో కూడా దీని ఫోన్ ఏంటి ఇప్పుడు లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచించి లిఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడుగుతుంది స్వప్న ముందు పని ఏంటో చెప్పు అని అంటుంది రుద్రాణి. మీరు తొందరగా రెడీ అయి రండి అన్నా మీకు నేను శోభనం గదిలోనికి పంపించాలిట అని అంటుంది. ఇప్పుడే రెండు నిమిషాలు రెడీ అయి వస్తాను అని అంటుంది. ఇప్పుడు దాకా నీరసంగా మాట్లాడారు రెడీ ఐ రమ్మంటే మాత్రం మీకు చాలా హుషారు వస్తుంది అని అంటుంది స్వప్న దానితోపాటు నాకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని చెప్తాను అవి కూడా తీసుకొని రండి అని ఒక లిస్టు మొత్తం రుద్రానికి చెప్తుంది. రుద్రాణి వాళ్ళ ఇష్టంతో చూసి కళ్ళు తిరిగి ఇంత పెద్ద లిస్టు చెప్పావ్ ఏంటి అని అంటుంది ఇంకా ఉన్నాయి చెప్పమంటారా అని అంటుంది వద్దు తల్లి ఇవి తీసుకురావడానికి నేను అల్లాడిపోవాలి అని ఫోన్ పెట్టేస్తుంది. ఈ స్వప్న పీడ ఎప్పుడు విరగడవుతుందో అని అనుకుంటుంది మనసులో, ఇక అందరూ కలిసి అనామికను శోభనం గదిలోనికి పంపిస్తారు.

రేపటి ఎపిసోడ్ లో కళ్యాణ్ అనామిక తో కవిత్వం చెప్తూ ఉంటాడు ఎప్పుడూ కవిత్వాలేనా ఇంకా ఏదైనా మాట్లాడు కళ్యాణ్ అని అంటుంది అనామిక,ఈ గది చాలా బాగా డెకరేషన్ చేశారు కదా అని అంటాడు. అవును కళ్యాణ్ చాలా బాగా డెకరేషన్ చేశారు అని అంటుంది ఎవరు చేశారో తెలుసా మా వదిన కావ్య అని అంటాడు. ఆ మాటలకు అనామిక కోపం వస్తుంది అక్కడ పెద్ద గొడవ చేసి బయటకు వచ్చి పడుకుంటుంది. నువ్వు చిన్నదాన్ని పెద్ద చేస్తున్నావ్ అని అంటాడు కళ్యాణ్. కళ్యాణ్ మాటలు పట్టించుకోకుండా అనామిక బయటికి వచ్చి పడుకుంటుంది కుటుంబ సభ్యులందరూ ఏం జరిగింది అని అడుగుతారు అందరి ముందు కళ్యాణ్ మా ఇద్దరి మధ్యలో అప్పు,కావ్య విషయం తీసుకొస్తున్నాడు నాకు అది నచ్చట్లేదు అని చెప్తుంది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri