NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa February 24 2024 Episode 160: సెక్షన్ల గురించి మాట్లాడి లాయర్ ని బెదిరించిన స్వరా, వైజయంతిని చూసి షాక్ అయిన విశాల్…

Paluke Bangaramayenaa Today Episode February 24 2024 Episode  160 Highlights

Paluke Bangaramayenaa February 24 2024 Episode 160:  నువ్వు బాధపడకు స్వర ఆయన ఏం చెప్పారు తెలియకపోయినా మాటిచ్చాను. మాట నిలబెట్టుకుంటాను నీకు నేనున్నాను అని అభిషేక్ అంటాడు.కట్ చేస్తే,అభి చాలా తెలివిగా ప్లాన్ చేసి ముందు విశాల్ ని జైల్లో వేశాడు ఆ తరువాత వైజయంతిని వేశాడు వాడిని అలాగే వదిలేస్తే నిన్ను నన్ను కూడా జైల్లో వేస్తాడు అని రంగరాజు అంటాడు.నాకు తెలిసిన క్రిమినల్ లాయర్ ఉన్నాడు అతను మా అక్కని విశాల్ ని బయటకు తీసుకొస్తాడు అని బాబ్జి అంటాడు.ఇంతలో లాయర్ గారు వస్తారు.నేనేం చేయాలి బాబ్జి గారు అని లాయర్ అడుగుతాడు.మా అక్కని బెయిల్ మీద విడిపించుకు రావాలి అని బాబ్జి చెబుతాడు. వాళ్ల దగ్గర వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి కష్టమవుతుంది అని లాయర్ అంటాడు.10 లక్షలు ఇస్తాను ఎలాగైనా విడిపించండి అని బాబ్జి అంటాడు.రేపు పొద్దున వెళ్లి బెయిల్ ఇచ్చి తీసుకొద్దాం రెడీగా ఉండండి అంటూ లాయర్ వెళ్ళిపోతాడు.

Paluke Bangaramayenaa Today Episode February 24 2024 Episode  160 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 24 2024 Episode  160 Highlights

కట్ చేస్తే, అభి వెళ్తుండగా మాయ అభీ సార్ అని పిలుస్తుంది.మాయా పిలుపు విని అభిషేక్ ఆగిపోతాడు.ఏమైంది అని అభిషేక్ అంటాడు.సార్ ఇప్పటికే లేట్ అయిపోయింది మీతో పాటు నేను కూడా వస్తాను సార్ అని మాయ అంటుంది.తనని ఎక్కించుకు వెళ్తే స్టేషన్లో ఏవేవో అనుకుంటారు తనను ఎక్కించకు పోవడం అవసరమంటావా అని అభిషేక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆటో కోసం వెయిట్ చేశాను సార్ వెళ్దాం పదండి లేటవుతుంది మీకు కూడా అని మాయ అంటుంది. ఆడపిల్ల సహాయం అడుగుతుంది తప్పుగా అర్థం చేసుకోకూడదు అని అభిషేక్ మాయని ఎక్కించుకొని వెళ్తాడు. లిఫ్ట్ ఇవ్వడానికే ఇంతగా ఆలోచించాడు అంటే ఇలాంటి వాడిని లొంగ తీసుకోవాలి అని మాయ అనుకుంటుంది. కట్ చేస్తే,వాళ్ళిద్దరూ స్టేషన్ కి వస్తారు.

Paluke Bangaramayenaa Today Episode February 24 2024 Episode  160 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 24 2024 Episode  160 Highlights

మాయ ల్యాండ్ పేపర్లు తీసుకురా అని అభిషేక్ అంటాడు. ఇంతలో లాయర్ గారు వచ్చి వైజయంతి మేడమ్ కి బేయిల్ తెచ్చాను విడుదల చేయండి అని అంటాడు. వైజయంతి గారు ఇక్కడ ఎందుకు ఉంటారండి అని అభిషేక్ అంటాడు. వైజయంతి మేడాన్ని అరెస్టు చేసి నడిపించుకు రావడం ఊరంతా చూసింది బుకాయించకండి అని లాయర్ అంటాడు. వైజయంతి గారి ఏరియా మా స్టేషన్ పరిధిలోకి రాదండి ఎక్కడ అరెస్టు చేసామో అక్కడే ఉంటుంది వెళ్ళండి అని అభిషేక్ అంటాడు. అలాంటప్పుడు కేసు ఫైల్ ఎందుకు చేశారండి అని లాయర్ అంటాడు. ఏంటి ఎఫ్.ఐ.ఆర్. ఫైల్ చేశామా ఏది చూపించు అని బుక్ చూపెడతాడు అభిషేక్. వీడి ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు అని రంగరాజు బాబ్జి అనుకుంటారు. మేడం ఎక్కడ ఉన్నారో చెప్పకపోతే మీ మీద చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని లాయర్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 24 2024 Episode  160 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 24 2024 Episode  160 Highlights

ఇంతలో స్వర వచ్చి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని అంటుంది. అరెస్టు చేసిన వాళ్లని ఎఫ్.ఐ.ఆర్. ఫైల్ చేసి కూడా దాచేస్తే పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని లాయర్ అంటాడు. సెక్షన్ 360 ప్రకారం,మీరు కేసు వేస్తే నేను కూడా సెక్షన్ ఉపయోగించి రివర్స్ కేసు వేస్తాను కోల్పోయిన జాబ్ ని మళ్లీ పొందుతాము అని స్వర అంటుంది. సెక్షన్ 500 కింద మమ్మల్ని కేసులో ఇరికించారు అని మీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది అని స్వర అంటుంది. సెక్షన్ 203 ప్రకారం నేరస్తురాలని విడిపించాలని మీరు ప్రయత్నించారని మీ మీదే కేసు బనాయిస్తాను అని స్వర బెదిరిస్తుంది. అంటే నువ్వు లాయర్ వా అని లాయర్ అంటాడు. అవన్నీ నీకు అనవసరం అని స్వర అంటుంది. కోర్టులో వాదించే లాయర్ ని చూశాను కానీ నీలాగా లాజిక్కులు మాట్లాడే వాళ్ళని నేను చూడలేదు సెక్షన్ లతో సహా ఇంత బాగా చెప్తున్నావు అంటే నువ్వు గనుక తలచుకుంటే పెద్ద లాయర్ అవుతావు నిన్ను కోర్టులో ఎదిరించే వాడే ఉండడు అని అతను అంటాడు. మాయని చూసి తేడాగా ఉంది ఏంటి అని అనుకుంటుంది స్వర.

Paluke Bangaramayenaa Today Episode February 24 2024 Episode  160 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 24 2024 Episode  160 Highlights

అభిషేక్ స్వర మాట్లాడుతుంటే అలాగే చూస్తూ నిలబడతాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు అని స్వర అంటుంది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అభిషేక్ అంటాడు. మీరు పర్స్ మరిచిపోయారు అందుకే వచ్చాను అని స్వర అంటుంది. థాంక్స్ సెక్షన్లతో వారిని భయపెట్టినందుకు అంత దూరం నుంచి వచ్చి పరుసు తెచ్చి ఇచ్చినందుకు అని అభిషేక్ అంటాడు. కట్ చేస్తే, జైల్లో వైజయంతిని చూసి షాక్ అయిపోతాడు విశాల్. అత్తయ్య నాతో మాట్లాడడానికి మీ తెలివిని ఉపయోగించి ఇక్కడి దాకా వచ్చారా చెప్పండి నేను ఏం చేయాలి అని విశాల్ అంటాడు. విశాల్ నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం ఇక్కడికి నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను నీతో మాట్లాడడానికి కాదు అని వైజయంతి అంటుంది. అంటే మీరు కూడా అరెస్ట అయ్యారా? మిమ్మల్ని అరెస్టు చేయడానికి వాడికి ఎంత ధైర్యం మీరు జైల్లో ఉండద్దు తొందరగా బయటికి వెళ్లిపోండి అని విశాల్ అంటాడు. ఎందుకు అంతలా గింజుకుంటున్న నేను ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతానా అని వైజయంతి అంటుంది. నా జీవితం ఈ నాలుగు గోడల మధ్య ముగిసిపోతుంది అని భయమేస్తుంది అని విశాల్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 24 2024 Episode  160 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 24 2024 Episode  160 Highlights

నువ్వు భయపడకు ఏదో ఒకటి చేసి ఇద్దరం బయటికి వెళ్దాం అని వైజయంతి అంటుంది. నాకు బేయిల్ రాదని మీరు అనేసరికి మీరు కూడా జైలుకు రావాలని కోరుకున్నాను ఎందుకంటే అప్పుడు మనిద్దరం కలిసి బయటికి వెళ్లొచ్చు కదా అని విశాల్ అంటాడు. అప్పుడు అలా అనుకున్న కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే జాలేస్తుంది అని విశాల్ అంటాడు. నేను నమ్మను ఇప్పుడు నిజం చెప్పు అని వైజయంతి అంటుంది. నా మనసులో ఏమీ లేదు అత్తయ్య అలా అనుకునే వాడినైతే మిమ్మల్ని జైల్లో చూసి సంబరపడి గంతులేసే వాడిని కదా అని విశాల్ అంటాడు. వచ్చిన కానుంచి వాగుతూనే ఉన్నావ్ అసలేం మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా అని వైజయంతి అంటుంది. సారీ అత్తయ్య ఇక మాట్లాడను అని విశాల్ అంటాడు. వాడి ఉద్యోగం తీసేసి వాడి అంతు చూస్తాను వాడి ఫ్యామిలీని రోడ్డు మీదకి ఈడుస్తాను అని వైజయంతి అంటుంది.

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella