NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru February 28 2024 Episode 147: గంగను బయటికి నెట్టేసిన చంగయ్య, పవన్ స్పృహలోకి వచ్చాడని రాణి గంగకి చెబుతుందా లేదా?..

Mamagaru Today Episode February 28 2024 Episode 147 Highlights

Mamagaru February 28 2024 Episode 147: మనందరం కట్టకట్టుకొని ఎక్కడైనా దూకి చేద్దామా అని చ0గయ్య అంటాడు. అలా ఎందుకు మాట్లాడతారు మామగారు అని గంగ అంటుంది. నువ్వు నోరు ముయ్ నువ్వు  వచ్చాకే మా ఇంటికి దరిద్రం పట్టుకుంది అని చంగయ్య గంగను బయటికి నెట్టేసి డోర్ పెట్టుకుంటాడు. నాన్న గంగ ని బయటికి ఎందుకు నెట్టేసావ్ అని పాండురంగ అంటాడు. పరువు కోసం అసలు ఇదంతా జరిగింది గంగ వల్లనే గంగ అలా చేయకపోతే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇంకెవరు నాకు ఏమి చెప్పొద్దు అని చ0గయ్య అంటాడు.నా కొడుకుల్ని జైల్లో పెట్టలేను నా కూతురి పరువు తీసుకోలేను అందుకనే నేనొక నిర్ణయానికి వచ్చాను ఆస్తినంతా ప్రెసిడెంట్ కి రాసిద్దామని అనుకుంటున్నాను అని చంగయ్య అంటాడు.

Mamagaru Today Episode February 28 2024 Episode 147 Highlights
Mamagaru Today Episode February 28 2024 Episode 147 Highlights

చూడండి గంగని ఇంట్లోకి రాణిస్తే మాత్రం బాగోదు అంటూ చంగయ్య వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,పాపం ఈ పేషెంట్ కోమాలో ఉన్నాడు ఇతని వల్ల గంగ వల్ల ఆయన జైల్లో పడ్డాడు తను స్పృహలోకి వస్తే బాగుండు అని రాణి అనుకుంటుంది. ఇంతలో పవన్ చేతులు కదుపు పోతాడు. ఈ విషయం వెంటనే డాక్టర్ గారికి చెప్పాలి అని రాణి అనుకుంటూ ఉండగా డాక్టర్ గారు లోపలికి వస్తారు. రాణి, ఇప్పుడు పేషెంట్ ఎలా ఉన్నాడు అని అడుగుతాడు డాక్టర్. డాక్టర్ పేషంట్ కి స్పృహ వచ్చింది అని రాణి చెబుతుంది. ఈ విషయం బయట ఎవరికీ తెలియకూడదు అని డాక్టర్ గారు అంటారు. ఎందుకు సార్ అని రాణి అడుగుతుంది. అవన్నీ నీకనవసరం చెప్పిన పని చెయ్యి మెడిసిన్ టైం కి ఇస్తూ ఉండు అని డాక్టర్ గారు వెళ్లిపోతారు. పేషంటు కోమలో నుంచి బయటికి వచ్చాక కూడా ఎందుకు వద్దంటున్నారు అని రాణి ఈ విషయం వెంటనే గంగకి చెప్పాలని ఫోన్ చేస్తుంది. కానీ గంగా బయట ఉండడంతో ఫోన్ ఎత్తలేక పోతుంది. రాణి పేషెంట్ కదులుతున్నప్పుడు వీడియో తీసి గంగకి పెడుతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 28 2024 Episode 147 Highlights
Mamagaru Today Episode February 28 2024 Episode 147 Highlights

అంజమ్మ వెంకటరమణ గంగ దగ్గరికి పరిగెత్తుకొచ్చి తనను చూసి బాధపడతారు. ఏంటమ్మా ఈ అన్యాయం మీ మామయ్య గారిని అడుగుతాము అని వెంకటరమణ అంజమ్మ డోరు కొడతారు. అమ్మ వద్దమ్మా అని గంగ అంటుంది.  ఇంతలో దేవమ్మ డోరు తీస్తుంది. ఏంటి వదిన గారు కోడల్ని ఇలా బయట నిలబెడతారా ఇదెక్కడి సంస్కారం అండి అని అంజమ్మ అంటుంది. పిలువు మీ ఆయనని కోడల్ని బయట నిలబెడతాడా మాకు కూటికి లేకపోవచ్చండి కానీ పరువుగా బ్రతుకుతున్నాం నా కూతురు ఏం తప్పు చేసిందని బయట నిలబెట్టాడు అని వెంకటరమణ అంటాడు. ఇంతలో చంగయ్య బయటికి వచ్చి ఏంటి నీ అరుపులు అంటాడు. మా బాధ నీకు అరుపులా వినపడుతున్నాయా బావగారు నా కూతుర్ని ఎందుకండి బయట నిలబెట్టారు తను ఏం తప్పు చేసింది అని వెంకటరమణ అంటాడు. అన్నయ్య నీకు ఇది న్యాయంగా ఉందా నా కూతుర్ని ఎందుకు బయట నిలబెట్టారు తన భర్త స్టేషన్లో ఉండగా మీరే ఓదార్చాల్సింది పోయి తనని నిర్దాక్షిణ్యంగా బయట నిలబెడతారా ఇదెక్కడ అన్యాయం అండి అని అంజమ్మ అంటుంది.

Mamagaru Today Episode February 28 2024 Episode 147 Highlights
Mamagaru Today Episode February 28 2024 Episode 147 Highlights

నీ కూతురు తప్పు చేసింది కోడళ్ళని ఉద్యోగాలకి పంపించని నేను నా కూతురు బయటకు వెళ్తానంటే వద్దన్నాను కానీ నీ కూతురు నాకు అబద్ధం చెప్పి తనని కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి పంపించింది ఆన్లైన్ జాబు చేయడానికి కూడా జాబ్ చూసి పెట్టింది జాబ్ చేయడం కోసం వెళ్లిన నా కూతుర్ వెంట పవన్ పడ్డాడు హత్యాచారం చేయబోయాడు అది చూసినా గంగాధర్ వాడిని కొట్టాడు వాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు చేస్తాడు బ్రతుకుతాడో తెలియదని డాక్టర్లు చెబుతున్నాడు దీనికంతటికి కారణం ఎవరు నీ కూతురు కాదా అని చంగయ్య అంటాడు.మీ అమ్మాయి ఎప్పుడో ఒకప్పుడు బయటికి వెళ్లినప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేసేవారు బావగారు ఎప్పుడూ తలుపులు బిగించుకొని ఇంట్లోనే కూర్చోలేము కదా అని వెంకటరమణ అంటాడు.

Mamagaru Today Episode February 28 2024 Episode 147 Highlights
Mamagaru Today Episode February 28 2024 Episode 147 Highlights

ఇప్పటికీ పోయిన పరువు చాలండి కోడల్ని బయట నిలబెట్టి ఇంకా పరువు తీసుకోవద్దు నలుగురు మనల్ని చూస్తున్నారు మీకు దండం పెడతాను గంగని లోపలికి రానివ్వండి అని దేవమ్మ అంటుంది. నాన్న గంగాధర్ జైల్లో ఉండగా గంగని బయటికి పంపిస్తే బాగోదు మనమే ఏదో ఒకటి ఆలోచిద్దాం కానీ లోపలికి రానివ్వండి అని పాండురంగ అంటాడు. నాన్న నీకు చెప్పే అంతటి వాళ్ళం కాకపోయినా అర్థం చేసుకోండి నాన్న గంగని లోపలికి రానివ్వండి అని సుధాకర్ అంటాడు. సరే లోపలికి రానివ్వండి అని చ0గయ్య వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 28 2024 Episode 147 Highlights
Mamagaru Today Episode February 28 2024 Episode 147 Highlights

గంగ బాధపడుతూ ఉంటుంది. ముఖ్యమైన విషయం చెబుదామంటే గంగ ఫోన్ ఎత్తట్లేదు వీడియో కూడా పెట్టాను చూసుకోలేదు ఏంటి అని మళ్ళీ రాణి ఒకసారి ఫోన్ చేస్తుంది. గంగ బాధలో ఉండి తన ఫోను మరిచిపోతుంది. ఇంతలో సిరి వచ్చి వదిన ఇప్పటిదాకా బయటే ఉన్న కాస్త మజ్జిగైన తాగు ఏమీ తినలేదు కదా అని సిరి అంటుంది. ఏమి తాగాలనిపించట్లేదు సిరి అని గంగ అంటుంది. వదిన నేను నాన్నకు నిజం చెప్పడం తప్పంటావా అని సిరి అంటుంది. ఇంతలో మళ్లీ రాణి గంగ కి ఫోన్ చేస్తుంది. కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది ఎవరు అని గంగ చూస్తుంది. చాలాసార్లు రాణి ఫోన్ చేసిందే ఏదో వీడియో కూడా పెట్టి డిలీట్ చేసింది అని గంగ రాణికి ఫోన్ చేస్తుంది. హలో రాణి చాలాసార్లు ఫోన్ చేశావు ఎందుకే పవన్ ఎలా ఉన్నాడు? కోమాలో నుంచి బయటకు వచ్చాడా అని గంగ అడుగుతుంది. నీతో ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను గంగ కానీ నువ్వు ఎత్తలేదు పేషంటు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు బతికే అవకాశం లేదని డాక్టర్ చెప్తున్నాడు అని రాణి అబద్ధం చెబుతుంది. అవునా అని గంగ ఫోన్ కట్ చేస్తుంది..

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella