NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇద్దరూ గెలుపు గుర్రాలే.. జ‌న‌సేన ఖాతాలో రెండు సీట్లు ప‌క్కా…!

జ‌న‌సేన ఖాతాలో రెండు పార్లమెంటు స్థానాలు ప‌డ‌నున్నాయా? మిత్ర‌పక్షంలో భాగంగా జ‌న‌సేన తీసుకు న్న రెండు స్థానాల‌ను గెలుచుకునే ప‌క్కా వ్యూహంతోనే ముందుకు సాగుతోందా? అంటే ఔన‌నే అంటు న్నారు ప‌రిశీల‌కులు. జ‌న‌సేన పోటీ చేయ‌నున్న మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు, కాకినాడ పార్ల‌మెంటు స్థానా లు కూడా చాలా బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు కావ‌డం గ‌మ‌నార్హం. సామాజిక వ‌ర్గాల ప‌రంగా మ‌చిలీప‌ట్నం లో కాపులు ఎక్కువ‌గా ఉంటే.. కాకినాడ నియోజ‌క‌వ‌ర్గంలో కాపులు, రెడ్లు కూడా ఎక్కువ‌గానే ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ జ‌న‌సేన బ‌ల‌మైన నాయ‌కుల‌కే అవ‌కాశం ఇచ్చింది. మ‌చి లీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ బాల‌శౌరి.. టికెట్‌ను మార్చ‌డంతో పార్టీ మారి జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయ‌న‌కే తిరిగి జ‌న‌సేన మ‌చిలీప‌ట్నం టికెట్ ఎనౌన్స్ చేసింది. ఆయ‌న కు ఉన్న మంచి.. ఇమేజ్‌, కాపుల్లో జ‌న‌సేన‌ను గెలిపించుకోవాలన్న క‌సి వంటివి ఈ ద‌ఫా క‌లిసి రానున్నా యి. వీటికితోడు.. బాల‌శౌరికి వైసీపీ టికెట్ ఇవ్వ‌లేద‌న్న ఆవేద‌న కూడా నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపిస్తోంది.

ఈ మూడు ప‌రిణామాలు కూడా.. బాల‌శౌరికి ప్ల‌స్ కానున్నాయి. ఇక‌, గ‌త ఐదేళ్ల కాలంలో మ‌చిలీప‌ట్నం హార్బ‌ర్ నిర్మాణం కోసం.. ఆయ‌న బాగానే శ్ర‌మించారు. కేంద్రం నుంచి ఇక్క‌డికి నిదులు కూడా తీసుకువ చ్చారు. సో.. ఇది బాల‌శౌరికి మ‌రింత క‌లిసి రానుంది. దీంతో బాల‌శౌరిగెలుపు న‌ల్లేరుపై న‌డ‌క‌గా మారినా ఆశ్చ‌ర్యం లేద‌నే టాక్ వినిపిస్తోంది. అయితే.. వైసీపీ నుంచి కూడా బ‌ల‌మైన అభ్య‌ర్థే ఉండ‌డంతో కొంత ట‌ఫ్ ఫైట్ జ‌రిగే అవ‌కాశం ఉంది.

ఇక‌, కాకినాడ నియోజ‌క‌వ‌ర్గానికి తాజాగా ఉద‌య్ శ్రీనివాస్ తంగెళ్ల‌ను జ‌న‌సేన అధినేత ప్ర‌క‌టించారు. ఈయ‌న పార్ల‌మెంటుకు తొలిసారి పోటీ చేస్తున్నారు. టీ-టైమ్ వ్యాపార వేత్త అయిన యువ పారిశ్రామిక వేత్త కావ‌డం, ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం, యువ‌త‌ను ఆక‌ర్షించ‌డం వంటికార‌ణాలు ఈయ‌న‌కు ప్ల‌స్‌గా మార‌నున్నాయి. పైగా ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పిఠాపురం నుంచి ప‌వ‌న్ కూడా పోటీ చేయ‌నున్నారు. దీంతో ఇక్క‌డ కూడా జ‌న‌సేన పాగా వేసే అవ‌కాశం ఉంది.

Related posts

PS AB Venkateswararao: ఏపీ సీఎస్ ను కలిసిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. పోస్టింగ్ కోసం వినతి

sharma somaraju

YSRCP: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్

sharma somaraju

AP Election 2024: కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే జైలుకే: సీఈవో ముకేష్ కుమార్ మీనా

sharma somaraju

KTR: రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలు: కేటీఆర్

sharma somaraju

YCP MLA Pinnelli: మరో సారి హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి .. కీలక వినతి

sharma somaraju

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం .. లోయలో బస్సు పడి 21 మంది మృతి..40 మందికి గాయాలు

sharma somaraju

`జ‌గ‌న్ అనే నేను`కు ఐదేళ్లు పూర్తి… సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ వెన‌క‌..?

ఆ టీడీపీ టాప్ లీడ‌ర్‌కు చివ‌రి సారి అయినా ప‌రువు ద‌క్కుతుందా… ఉన్న‌ది కూడా పోతుందా ?

ఏపీలో ఎన్న‌డూ లేని టెన్ష‌న్‌.. ఉద్యోగాల‌ను వ‌దిలేసే ప‌రిస్థితి ఎందుకు..?

టీడీపీ బీకాంలో ఫిజిక్స్‌ లెక్క ఇదీ.. ఎన్నిక‌ల వేళ ఇంత పెద్ద డ్రామా చేశారా ?

ట‌ఫ్ ఫైట్ లీడ‌ర్లు… పూజ‌ల్లో బిజీబిజీ… ఈ సెంటిమెంట్ వెన‌క క‌థ ఇదే..?

ఫ‌స్ట్‌-ఫ‌స్ట్.. పలాస‌.. వైసీపీలో ఇదే బిగ్ హాట్ టాపిక్‌..?

జూన్ 1 కోసం త‌మ్ముళ్ల వెయిటింగ్‌.. రీజ‌నేంటి..!

వైసీపీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం .. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై మరో సారి స్పష్టత ఇచ్చిన ఈసీ ..హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ

sharma somaraju

Agnibaan: అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం

sharma somaraju