NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa March 20 2024 Episode 181: స్వర మీద ఇష్టని బొమ్మతో పంచుకుంటున్న అభిషేక్, ఆర్య ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న వైజయంతి..

Paluke Bangaramayenaa Today Episode March 20 2024 Episode 181 highlights

Paluke Bangaramayenaa March 20 2024 Episode 181:  ఇంతలో పంతులు గారికి ఒక ఆవిడ ఫోన్ చేసి నా కొడుకుకి సంబంధాలు చూడమంటే ఏం చేశావు అని అడుగుతుంది. అమ్మ అయిదు నిమిషాలలో వచ్చేస్తాను అని పంతులుగారు చెబుతారు. కట్ చేస్తే, పంతులుగారు వాళ్ళ ఇంటికి వెళ్తాడు.మీ అబ్బాయి ఏమో అమ్మాయి నచ్చిందని చెప్పరు మీరేమో ఈ ఊర్లో అందరికంటే అందంగా ఉన్న అమ్మాయిని మా అల్లుడికి కాబోయే భార్య కావాలిటారు నేను ఎంతో కష్టపడి పెద్ద పెద్ద సంబంధాలు తీసుకొస్తే మీ మేనల్లుడు ఆ సంబంధం నచ్చలేదంటారు ఏంటండీ అని పంతులుగారు అంటారు. మీరేమైనా కఅనుకోండి అమ్మ మీ కొడుకు పెళ్లి సంబంధాలు చూడడం నావల్ల కాదు ఇది ఇలాగే కొనసాగితే నీ కొడుకు ఈ జన్మలో పెళ్లి కాదు అని పంతులుగారు అంటారు.

Paluke Bangaramayenaa Today Episode March 20 2024 Episode 181  highlights
Paluke Bangaramayenaa Today Episode March 20 2024 Episode 181 highlights

ఆవిడ పని మనిషికి చిటికి వేసి పిలిచి ఏదో తీసుకురమ్మని చెబుతుంది. మీరే ఒక పని చేయాలి అమ్మ ఏదో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి ఆయనని ఒప్పించాలి లేదంటే ఆయన బ్రహ్మచారిగా వదిలేయండి అని పంతులుగారు అంటారు. చెప్పింది ఎన్నిసార్లు చెప్తారు పంతులుగారు మా వాడికి అమ్మాయి నచ్చకపోతే ఎవరు ఏం చేస్తాం కూర్చోండి మీకోసం వేడి వేడి అరటికాయ బజ్జీలు చేయించాను తినండి అని ఆవిడ అంటుంది. డాక్టర్ గారు బజ్జీలు తినొచ్చన్నారు పండ్లు తినొచ్చు అన్నారు ఇప్పుడు ఈవిడ బజ్జీలు పెడుతుంది కడుపునిండా తిందామని పంతులుగారు అనుకుంటారు. పంతులుగారు బజ్జీలు తింటూ నా దగ్గర ఇంకా రెండు సంబంధాలు ఉన్నాయ్ అమ్మ వాటిలో ఏదో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేద్దాం అని అంటారు.

Paluke Bangaramayenaa Today Episode March 20 2024 Episode 181  highlights
Paluke Bangaramayenaa Today Episode March 20 2024 Episode 181 highlights

బజ్జీలు తింటూ ఏంటి తేడాగా ఉన్నాయని చూసి అమ్మ నన్ను వదిలేయండి ఏదైనా గ్రహాంతరని కి వెళ్లి నీ కొడుక్కి పెళ్లి సంబంధం చూస్తాను నన్ను క్షమించండి వదిలేయండి అమ్మ అని అంటాడు. మీరు నా కొడుకుని అన్న మాటలకి నేనే ఆ బజ్జీలని తినిపించాలి కానీ మీ అంతట మీరే తినాలి నేను మనుషుల్ని హింసించను అని ఆవిడ పంతులు గారిని బెదిరిస్తుంది. మీరు నన్ను చావనివ్వరు నేనే చావాలి అంటూ పంతులుగారు చిరాకు పడుతూ బజ్జీలని తింటూ ఉంటాడు. అమ్మ ఇంకా తింటే పోతారు అమ్మ పంతులుగారు ని వాళ్ళ ఇంట్లో మేనేజర్ అంటాడు. నాకే సలహాలు ఇస్తావా నీకు షుగర్ ఉందిగా తిను అని చెక్కర నోట్లో పోయబోతుంది. ఆ మేనేజర్ నోట్లో పోయే పోతుంది. అమ్మా నన్ను క్షమించండి పుసుక్కున పంతులుగారు పోతే సంబంధాలు ఎవరు తీసుకొస్తారు అని అతను అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 20 2024 Episode 181  highlights
Paluke Bangaramayenaa Today Episode March 20 2024 Episode 181 highlights

నా కొడుక్కి నేనే పెళ్లి సంబంధం తీసుకొస్తాను అందుకోసం ఎంతమంది కొంపలైన కులుస్తాను అని ఆవిడ అంటుంది. పంతులుగారు మీరే మీ పిల్లని చూడక్కర్లేదు నేనే చూసుకుంటాను అని ఆవిడ యశోద కి ఫోన్ చేస్తుంది.ఈవిడ ఇప్పుడు నాకు ఫోన్చేస్తుంది ఏంటి అని యశోద ఫోన్ ఎత్తుతుంది.వదిన అసలు మేము  మీకు గుర్తున్నామా ఒక్కసారి కూడా ఫోన్చెయ్యట్లేదు మేము గుర్తు లేకపోయినా మేమే ఫోన్ చేస్తున్నాం నాకు హైదరాబాదులో పని ఉంది అక్కడికి వస్తున్నాను మీ ఇంట్లో ఉంటాను ఈ విషయం అమ్మకు చెప్పు అని ఆవిడ ఫోన్ కట్ చేస్తుంది. ఈవిడ ఇప్పుడు ఇంటికి వస్తే ఎవరి కొంపొ కూలిపోయినట్టే అని యశోద అనుకుంటుంది. కట్ చేస్తే, ఒరేయ్ అభి ఎందుకురా నీ మనసులో మాట స్వరకి చెప్పడానికి ఇంత ఆలోచిస్తున్నావ్ అసలు మగాడివేనా బాధ్యత అంటావ్ నా మనిషి అంటావ్ వాళ్ళ నాన్నకు మాట ఇచ్చాను అంటావు అసలేంట్రా నీ ప్రాబ్లం తనకి చెప్పడానికి భయపడుతున్నావా అని అభిషేక్ పరి పరి విధాల ఆలోచిస్తూ ఉంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 20 2024 Episode 181  highlights
Paluke Bangaramayenaa Today Episode March 20 2024 Episode 181 highlights

అక్కడే స్వరకి కొనిచ్చిన పోలీసు బొమ్మ ఉంటుంది ఆ బొమ్మని తీసుకొని నీతో స్వర ఏ విషయమైనా మనస్ఫూర్తిగా చెప్పుకుంటుందంట కదా తన మనసులో ఏముందో నీకు ఒక్కసారైనా చెప్పలేదా అదేంటో నాకు చెప్పవా నన్ను ప్రేమిస్తూనని చెప్పిందా ప్లీజ్ అని అంటూ ఉంటాడు అభిషేక్. ఇంతలో స్వర అక్కడికి వచ్చి ఈయన బొమ్మ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు నేనే చెప్తాను అంటూ స్వర ముందుకి వస్తుంది. ఏం చేస్తున్నారు అభి సార్ అని స్వర అడుగుతుంది. ఎవరితోటైనా మాట్లాడుతున్నారా అని అడుగుతుంది. ఫోన్ మాట్లాడాను ఇప్పుడే అని అభిషేక్ అంటాడు. అప్పుడే ఫోన్ మోగుతుంది అభి ది. ఏంటి అభి సార్ నాతో ఏమైనా చెప్పాలా అని స్వర అంటుంది. ఆడవాళ్ళతో సరదాగా మాట్లాడొచ్చు కానీ ఏ విషయమైనా చెప్పాలంటే ఇంత భయం ఉంటుందా అని అభిషేకం అనుకుంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 20 2024 Episode 181  highlights
Paluke Bangaramayenaa Today Episode March 20 2024 Episode 181 highlights

అదే ఏమీ లేదు స్వర ఇప్పుడే ఫోన్ మాట్లడి అక్కడ పెట్టాను ఈ లోగా నువ్వు వచ్చావు అని అభిషేక్ తప్పించుకుంటాడు. ఎందుకు సార్ ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఎనక ముందు ఆలోచిస్తున్నారా అని స్వర మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే, ఆర్య వైజయంతిని చూడడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. నాన్న ఆర్య ఎలా ఉన్నావ్ చూడు మీ అక్క స్వర నాకు ఏ గతి పట్టించిందో మీ నాన్నను ఎక్కడో వేసింది నన్ను అభితో కలిసి జైల్లో వేయించింది నేను జైల్లో ఉన్నానని కాదు నాన్న నా బాధంతా నువ్వు వస్తే నేను చూసుకోవడానికి లేకపోయానే అని బాధపడుతున్నాను పర్వాలేదులే నేను కొన్నాలు అగిన తర్వాత వస్తాను కానీ కళ్యాణి నీకు తోడుగా ఉంటుంది అని వైజయంతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మ నువ్వు ఏడవకు నాకు బాధ అనిపిస్తుంది అంతకంటే ముందు మా ఫ్రెండ్ ని కలవాలి అని ఆర్య అంటాడు. కళ్యాణి డ్రైవర్ ఇచ్చి బాబుని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించు అని వైజయంతి చెబుతుంది. కళ్యాణి ఆర్య ని తీసుకొని వెళ్ళిపోతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri