NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu April 1 2024 Episode 2144: కావేరి అన్నట్లుగానే నిజంగానే ఆశ బ్రతికే ఉందా లేదా.

Kumkuma Puvvu Today Episode April 1 2024 Episode 2144 highlights

Kumkuma Puvvu April 1 2024 Episode 2144: అఖిల బంటి ఫోటోను చూస్తూ బంటి ఎలాగైనా నిన్ను దక్కించుకొని తీరుతాను నా ఉబ్బి నువ్వే నీకు ఎలాగైనా నా మీద ప్రేమ పుట్టేలా చేసుకుంటాను అని బంటి ఫోటో చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది అఖిల.అది చూసిన అంజలి చెప్పుతాను అఖిల నీ సంగతి చెప్తా ఆగవే అనుకుంటూ శాంభవి దగ్గరికి వెళ్లి శాంభవి గారు ఇలా రండి మీకు ఒక దృశ్యాన్ని చూపిస్తాను అంటూ శాంభవిని తీసుకువచ్చి అఖిలను చూపిస్తుంది అంజలి. శాంభవి బంటి ఫోటో చూసుకుంటూ మురిసిపోతున్న అఖిలను చూసి కోపంతో తనని కొట్టడానికి వెళ్లబోతుంది అంజలి వెంటనే శాంభవి చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్లి ఆగండి శాంభవి గారు మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా అలా చేస్తే వాళ్లకు పంతం ఎక్కువైపోతుంది

Kumkuma Puvvu Today Episode April 1 2024 Episode 2144 highlights
Kumkuma Puvvu Today Episode April 1 2024 Episode 2144 highlights

ఇప్పుడు ఈ వయసుకు వాళ్లకు పుట్టింది ప్రేమ కాదు ఆకర్షణ మరి ఆకర్షణను మనం ఈజీగా దూరం చేయవచ్చు అది ఎలాగంటే రేపే బంటికి పెళ్లి రోజు అని ఒక పెళ్లి రోజు వేడుకను బంటికి జరిపిద్దాం అప్పుడు అఖిల ఆ వేడుకను చూసి ఈ బంటీ తన భార్య లేకున్నా పెళ్లి రోజు వేడుకలు చేసుకుంటున్నాడు. తన భార్యను మర్చిపోలేక పోతున్నాడు అనుకుని తనను దూరం పెట్టడం మొదలు పెడుతుంది తన మనసులో బంటి మీద ఉన్న ఆకర్షణ కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది అని చెబుతుంది అంజలి. అప్పుడే మాధవి చరణ్ రాజ్ అక్కడికి ఏంటి ఏం జరుగుతుంది అంజలి మళ్లీ మీ చెవిలో ఏ పువ్వు పెడుతుంది అత్తయ్య అని అడుగుతుంది. శాంభవి మాధవి నీకు మాటలు తిన్నగా రావా మనకి ఎవరికీ రాని ఆలోచన ఐడియా అంజలికి వచ్చింది ఆలోచన ఏంటో తెలుసా బంటికి పెళ్లి రోజు జరిపిస్తే ఆటోమేటిక్గా తను బంటి మీద కోపాన్ని పెంచుకొని దూరంగా ఉంటుంది అని ఆలోచన చేసి మనకు చెప్పింది అంజలి పెద్దోడా రేపే బంటి పెళ్లి రోజు వేడుకలు సిద్ధం చేయండి అంటూ వెళ్ళిపోతుంది. మాధవి ఆహా ఏం ఐడియా ఇచ్చింది అంజలి మన అత్తయ్య ను బురిడీ కొట్టించి వాళ్లు తీర్చుకోవలసిన కోరికలన్నీ తీర్చుకుంటున్నారు అంటుంది అంజలి చరణ్ రాజ్ ఒసేయ్ మా అమ్మ ఎలా చెబితే అలా అని ముందు పదా పని చూద్దాం అంటాడు చరణ్ రాజ్

Kumkuma Puvvu Today Episode April 1 2024 Episode 2144 highlights
Kumkuma Puvvu Today Episode April 1 2024 Episode 2144 highlights

కట్ చేస్తే యుగంధర్ అమృత వాళ్లను వెతుకుతూ అసలు ఏంటి నా దారి ఎటు వెళుతుంది నాకేమీ అర్థం కావడం లేదు ముందు కావేరి వాళ్ళు తప్పించుకున్నారు ఆ తర్వాత ఈ అమృత వాళ్లు కూడా తప్పించుకున్నారు అయినా నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి చేయడానికి ఆశ కూడా లేదు సరదాగా జీవితాన్ని కొనసాగించాలి అనుకుంటే అందుకే నేను కొద్ది రోజులు ఎటైనా వెళ్ళిపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటూ ఎటు వెళ్లాలి మన బంధువుల్లో ఎవరింటికైనా వెళితే బాగుంటుంది అని ఫోన్ నెంబర్లు చూస్తూ ఎవరికి ఫోన్ చేసి మాట్లాడాలి ఎవరి ఇంటికి వెళ్లాలి అంటూ ఫోన్ చిన్నప్పుడు నేను పెరిగిన పెద్దమ్మ శాంభవి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళితే బాగుంటుంది ఎందుకంటే నేను అక్కడికి వెళ్లి చానా సంవత్సరాలు అయిపోయింది కదా సడన్డిగా వెళితే వాళ్లు షాక్ అవుతారు సంతోషపడుతారు అని శాంభవి నెంబర్ కి ఫోన్ చేస్తాడు యుగంధర్. శాంభవి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు చెప్పండి అని మాట్లాడుతుంది యుగంధర్ పెద్దమ్మ నేను యుగంధర్ గుర్తుపట్టావా అని అడుగుతాడు శాంభవి యుగంధర్ పేరుగల మనిషి నాకెవరూ తెలియదమ్మా మీరు ఎవరో రాంగ్ నెంబర్ కు చేశారు అని అంటుంది యుగంధర్ లేదు పెద్దమ్మ నేను మీ యుగ్గుని చిన్నప్పుడు నీ ఇంట్లో పెరిగానె నాకు నువ్వు తరచూ మొట్టికాయలు వేసేదానివి గుర్తుకు రాలేదా అని అంటాడు యుగంధర్. శాంభవి ఒరేయ్ యుగంధర్ నువ్వా చాలా సంవత్సరాలు అయిపోయింది ఇన్నాళ్లకు గుర్తుకు వచ్చానా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. యుగంధర్ పెద్దమ్మ నేను బాగానే ఉన్నాను ఇప్పుడు ఏసీపీగా హైదరాబాదులో డ్యూటీ చేస్తున్నాను అని అంటాడు.శాంభవి అలా అయితే ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా అంటుంది. యుగంధర్ సరే పెద్దమ్మ తప్పకుండా వస్తాను నేను కూడా చాలా సంవత్సరాలు అయింది కదా మిమ్మల్ని చూడక అందుకనే రేపు కచ్చితంగా వస్తాను అని అంటాడు యుగంధర్. శాంభవి అలాగే యుగంధర్ రేపు మర్చిపోకుండా రా అంటూ ఫోన్ కట్ చేస్తుంది.

Kumkuma Puvvu Today Episode April 1 2024 Episode 2144 highlights
Kumkuma Puvvu Today Episode April 1 2024 Episode 2144 highlights

కట్ చేస్తే బంటి అంజలి ఇద్దరూ ఊర్లోకి నడుచుకుంటూ వెళుతూ ఉంటారు అనుకోకుండా ఒక అమ్మవారి గుడి దగ్గర అందరూ దీపాలు పెడుతూ కనిపిస్తారు అంజలి బంటి ఇద్దరు ఆ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్లి పంతులుగారు ఎందుకు అందరూ ఇలా దీపాలు వెలిగించి ఆరిపోవద్దు అని మొక్కుకుంటున్నారు దీనికి గల కారణం ఏంటి అని అడుగుతాడు. పంతులుగారు అమ్మ ఈ దీపం ఎందుకు వెలిగిస్తున్నారు అంటే అదిగో అలా అమ్మవారి ముందు కనిపించే దీపం అఖండ దీపం ఆ దీపానికి ఇంకో దీపం మీరు వెలిగించి పెడితే అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెలుగుతూనే ఉంది అనుకోండి మీరు ఎలాంటి పాపము చేయలేదని అర్థం లేదంటే అది ఆరిపోయింది అనుకోండి మీరు పాపం చేశారని అర్థం అని చెబుతాడు పంతులుగారు.

Kumkuma Puvvu Today Episode April 1 2024 Episode 2144 highlights
Kumkuma Puvvu Today Episode April 1 2024 Episode 2144 highlights

బంటి అంజలి ఎలాగైనా మనం కూడా ఈ దీపాన్ని వెలిగిద్దాము అనుకోని వాళ్ళిద్దరూ కలిసి ఒక దీపాన్ని వెలిగిస్తారు. పంతులుగారు అదేంటమ్మా ఇంతమంది ఇన్ని దీపాలు వెలిగించారు అందరివి కొండెక్కిపోయాయి ఒక్క నిమిషంలోనే కానీ మీ దీపం మాత్రం అలాగే కాంతితో వెలుగుతూ ఉంది అంటే మీరు ఎలాంటి పాపము చేయలేదని అర్థం అని చెబుతాడు పంతులు. అంజలి పంతులుగారు మా మనసులు ఒక అమ్మాయి కి పాపం చేశామేమో అనే ఒక చిన్న అనుమానం ఉండేది కానీ ఇప్పుడు అది పాపం కాదు అని తేలిపోయింది మేము ఏ తప్పు చేయలేదని ఆ అమ్మవారు మాకు చూపించారు చాలా సంతోషంగా ఉంది మేము వెళ్ళొస్తాము పంతులుగారు అంటూ అంజలి బంటి ఇంటికి వెళ్లిపోతారు. అమృత కావేరి వాళ్లు అంజలి బంటి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడే అంజలి బంటి ఇంటికి చేరుకొని వాళ్ళని గిరి గిరా తిప్పి సంతోషంతో నవ్వుతూ ఉంటారు. కావేరి ఒరేయ్ బంటిగా అంజలి ఏంటి మీరు ఇంత సంతోషంగా ఉన్నారు ఏం జరిగింది రా అని అడుగుతారు అంజలి అత్తయ్య మేము ఇన్నాళ్లుగా ఒక పాపం చేశామని ఎలా బాధపడుతున్నామో అది పాపం కాదు మనం ఏ తప్పు చేయలేదని తేలిపోయింది అని చెబుతుంది.

Kumkuma Puvvu Today Episode April 1 2024 Episode 2144 highlights
Kumkuma Puvvu Today Episode April 1 2024 Episode 2144 highlights

అమృత అంటే ఏంటి మీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది అంజలి అమ్మ మేము ఈ ఊర్లో ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాము అక్కడ అందరు దీపాలు వెలిగిస్తుంటే మేము కూడా వెలిగించాము అందరిదీపాలు కొండేపి పోయాయి కానీ మా దీపం అలాగే వెలుగుతూ ఉంది పంతులుగారు ఏమన్నారు అంటే మీరు ఏ తప్పు చేయలేదు ఇది అమ్మవారు మీకు చెబుతున్న సూచన అని చెప్పాడు అని అంటుంది అంజలి కావేరి ఏంటంటే అంటే మీరు చేసిన తప్పు ఒప్పై పోతుందా అంటే కొంపదీసి ఆ ఆశ బ్రతికే ఉందా ఏంటి ఆశగాన్ని బ్రతికే ఉందనుకో మన అందరికీ దమ్మిడి అంటుంది కావేరి

Related posts

OTT: అనుకున్న దానికంటే త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతున్న పాపులర్ వెబ్ సిరీస్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Aranmanai 4 OTT: ఓటిటిలో సందడి చేసేందుకు రెడీ అయినా రాశి కన్నా, తమన్నా కామెడీ హర్రర్ మూవీ.. అప్డేట్ ఇచ్చిన ప్లాట్ ఫామ్..!

Saranya Koduri

Sabari OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా వరలక్ష్మి శరత్ కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్.. డేట్ ఇదే..!

Saranya Koduri

Brahmamudi: బ్రహ్మ ముడి అప్పుతో కళ్యాణ్ వివాహం.. ఎలానో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Project Z: ఓటీటీలో దూసుకెళ్తున్న మెగా కోడలి మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Nuvvu Nenu Prema June 03 Episode 640: కోడలు మీద కోప్పడి కుచల.. చేయి చేసుకున్న నారాయణ.. సుగుణ కి గుడ్ న్యూస్ చెప్పిన పంతులు..

bharani jella

Brahmamudi June 03 Episode  426:రాజ్ మాయల పెళ్లి కోసం రుద్రాణి ప్లాన్.. రాజ్ కి కావ్య నో హెల్ప్.. మాయకి యాక్సిడెంట్.. రేపటి ట్విస్ట్…

bharani jella

Krishna Mukunda Murari June 03 Episode 486:ముకుంద సరోగసి మదర్ అని నిరూపించాలనుకున్న కృష్ణ..అబద్ధం చెప్పిన వైదేహి అడ్డం తిరిగిన కథ..

bharani jella

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

Big flop Movie: బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన భారీ బడ్జెట్ మూవీ.. మొత్తం బాలీవుడ్ ని ముంచేసిన మూవీ ఇది..!

Saranya Koduri

Dhe Celebrities Special 2: ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కి సరికొత్త హోస్ట్.. ఈసారి డబల్ కిక్..!

Saranya Koduri

Swathi Chinukulu: మళ్లీ వస్తున్న ” స్వాతి చినుకులు ” సీరియల్.. ఆనందంలో ఫ్యాన్స్..!

Saranya Koduri