NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జీవీ రాజ‌కీయ చాణ‌క్యం.. 4 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలుపు రాసిపెట్టుకోండి..!

ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే.. వినుకొండ టీడీపీ అభ్య‌ర్థి జీవీ ఆంజ‌నేయులు.. రాజ‌కీయ చాణిక్యుడి అవ‌తారం ఎత్తారు. పార్టీ కోసం అహ‌రహం శ్ర‌మించే ఆయ‌న‌.. పార్టీ క్లిష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు అంతే దూకు డుగా, రాజ‌కీయ వ్యూహాల‌తో ముందుకు సాగారు. ప్రస్తుతం ఆయ‌న వినుకొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్నారు. నిజానికి ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అయినా ఎవ‌రూ ఏమీ అన‌రు. కానీ, త‌న నియోజ‌క‌వ‌ర్గంతోపాటు.. పక్క‌నే ఉన్న నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌క్రం తిప్పుతున్నారు.

ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీలో పెల్లుబికిన అసంతృప్తుల‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంతేకా దు.. నాయ‌కులు క‌లివిడిగా.. ఉమ్మ‌డిగా ఉండేలా చ‌క్రం తిప్పుతున్నారు. పొత్తులో భాగంగాను కొత్త నేత‌ల ఎంట్రీతోనూ కొన్ని నియోజ క‌వ‌ర్గాల్లో పార్టీ నాయ‌కులు ఆశించిన వారికి టికెట్లు ద‌క్క‌లేదు. దీంతో పార్టీలో అస‌మ్మ‌తి నేత‌ల బెడ‌ద పెరిగింది. ఉదాహ‌ర‌ణ‌కు పెద‌కూర‌పాడు టికెట్‌ను కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌కు కేటాయించాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా ఇక్క‌డ మార్పు చోటు చేసుకుంది.

యువ‌నేత భాష్యం ప్ర‌వీణ్ వైపు చంద్ర‌బాబు మొగ్గు చూపారు. దీంతో శ్రీధ‌ర్ కాస్త ఆవేద‌న వ్య‌క్తం చేసినా త‌ర్వాత ప్ర‌వీణ్ గెలుపులో భాగ‌మై ప‌ని చేస్తున్నారు. గ‌త నాలుగేళ్లుగా పార్టీ కోసం ఎంతో శ్ర‌మించిన త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని వాపోయారు. దీంతో రంగంలోకి దిగిన జీవీ.. కొమ్మాల‌పాటిని వెంట‌పెట్టుకుని మ‌రీ చంద్ర‌బాబు వ‌ద్ద‌కు తీసుకువెళ్లి.. స‌ర్ది చెప్పించారు. పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్ ప‌ద‌విని ఇప్పించేలా ఒప్పించారు. దీంతో చంద్ర‌బాబు కూర‌పాడు స‌భ‌లో తాను ఎప్పుడూ ఎవ్వ‌రికి ఏ ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్ప‌న‌ని.. శ్రీథ‌ర్‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హ‌ర్ష‌ధ్వానాల మ‌ధ్య ప్ర‌క‌టించారు.

దీంతో కొమ్మాల‌పాటి ఫుల్ హ్యాపీ అయ్యారు. ఇప్పుడు పెద‌కూర‌పాడులో టీడీపీకి అస‌మ్మ‌తి, అసంతృప్తే అన్న‌దే లేకుండా పోయింది. ఇక‌, స‌త్తెన‌ప‌ల్లిలోనూ ఇలానే కోడెల శివ‌రాం టికెట్ ఆశించారు. కానీ, ఇక్క‌డ బీజేపీ నుంచివ‌చ్చి టీడీపీలో చేరిన క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌కు చంద్ర‌బాబు మొగ్గు చూపారు. దీంతో శివ‌రాంను స‌ర్దుబాటు చేసే బాధ్య‌త‌ను తీసుకున్న జీవీ.. అచ్చెన్నాయుడి ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్లి స‌ర్దుబాటు చేశారు. దీంతో ఇక్క‌డ కూడా.. టీడీపీ నేత‌లుక‌లుసుకుని ముందుకు సాగుతున్నారు.

ఇలా గుర‌జాల‌లో ఎంపీ క్యాండెట్ లావు శ్రీకృష్ణ‌తో క‌లిసి య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, జంగా కృష్ణ‌మూర్తిల మ‌ధ్య కూడా స‌ఖ్య‌త వ‌చ్చేలా చేశారు. మొత్తంగా జీవీ చేసిన రాజ‌కీయ చాణ‌క్యం.. గుంటూరులో టీడీపీకి తిరుగులేని విజ‌యం అందిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N