Ravoyi Chandamama: కొంతమంది ముద్దుగుమ్మలు సినిమాల ద్వారానే కాదు సీరియల్స్ ద్వారా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటారు. సీరియల్స్ లో సైడ్ క్యారెక్టర్స్ లో పోషించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న యాక్ట్రెస్ ఇప్పటికే ఎంతోమంది ఉన్నారు. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో నటిస్తే పెద్దగా ఎవ్వరూ గుర్తించరేమో కాని సీరియల్స్ లో మాత్రం మంచి గుర్తింపు దక్కుతూ ఉంటుంది. అలా దక్కించుకున్న వారిలో రుద్రాణి కూడా ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతున్న రావోయి చందమామ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సీరియల్ లో నెగిటివ్ రోల్ లో రుద్రాణి క్యారెక్టర్ లో నటిస్తున్న యాక్ట్రెస్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రుద్రాణి అని అసలు పేరు వీణ పొన్నప్ప. వీణ కన్నడ యాక్ట్రెస్. ఈమె 1999 లో బెంగళూరులో జన్మించింది.
ఇక ఈమెకి యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో తన స్టడీస్ కంప్లీట్ అయిన తరువాత కన్నడ సీరియల్ అయిన సిఐడి తో మొదటిసారిగా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ వీణా కి మంచి గుర్తింపు దక్కించింది. అనంతరం అనేక సీరియల్ అవకాశాలు కూడా వచ్చాయి. హర హర మహాదేవ వంటి పలు కన్నడ సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించింది. అలా కన్నడ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ శివ మనసులో శక్తి సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అనంతరం నా పేరు మీనాక్షి సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు రావోయి చందమామ సీరియల్ లో విలన్ రోల్ ప్లే చేస్తూ తన అంద చందాలతో మైమరిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సీరియల్లో రుద్రాణిగా వీణ పొన్నప్పకు మంచి గుర్తింపు దక్కింది.
ఇక రానున్న రోజుల్లో ఈ ముద్దుగుమ్మ కి సినీ ఇండస్ట్రీలోకి వెళ్లాలని కోరికాట. బుల్లితెర సీరియల్స్ తోనే ఆగిపోకుండా వెండితెరపై కూడా తన టాలెంట్‌ను నిరూపించుకునేందుకు సర్వ విధాలుగా ప్రయత్నిస్తుంది వీణ. మరి ఈ ముద్దుగుమ్మ కలలు ఎంతవరకు నిజం అవుతాయో తెలీదు కానీ ప్రస్తుతం ఈమె గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా ఒక సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించాలంటే చాలా రిస్క్ అనే చెప్పొచ్చు. పూర్వకాలంలో ఒక పాత్రలో పోషించాలంటే ఆ పాత్రకి తగ్గ క్వాలిటీస్ ను చూసేవారు. కానీ ఇప్పుడు కమిట్మెంట్ ని చూస్తున్నారు.
ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీస్ కి క్యాస్టింగ్ కౌచ్ చాలా ఇబ్బందికరంగా మారింది. దీనివల్లే అనేకమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతున్నారు కూడా. డైరెక్టర్లకి మరియు ప్రొడ్యూసర్ల కి అడిగిన కమిట్మెంట్ ఇవ్వలేక ఇండస్ట్రీని వదిలిపెట్టిన ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు. మరికొందరు మాత్రం తమ కెరీర్ గురించి ఆలోచిస్తూ వారు అడిగిన కమిట్మెంట్ను ఇస్తున్నారు. ఇక అటువంటి ఇండస్ట్రీలో వీణా చేరాలనుకుంటుంది. సీరియల్ ఇండస్ట్రీలో లాగా సినీ ఇండస్ట్రీ ఉండదు. ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీ కూడా ఘోరంగా తయారైనప్పటికీ సినీ ఇండస్ట్రీపై బెటర్. మరి వీణ రానున్న రోజుల్లో సీరియల్స్ తో సరిపెట్టుకుంటుందో లేదా సినిమాల్లోకి కూడా వెళ్లి మంచి గుర్తింపు సంపాదించుకుంటుందో చూడాలి.