NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Israel Iran War: ఇజ్రాయెల్ పై ఇరాన్ వందలాది డ్రోన్‌లు, క్షిపణులతో దాడి ..ఏమి జరిగిందంటే..?

Israel Iran War: ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. ఇజ్రాయిల్ పై ఇరాన్ దాదాపు మూడు వందల డ్రోన్స్, మిస్సైల్స్ ను ఇరాన్ ప్రయోగించింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. అయితే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులుల్లో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే తమ భూభాగాన్ని తాకాయని ఇజ్రాయెల్ వెల్లడించింది. అమెరికా దళాలు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపమఉలను కూల్చివేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారులు దృవీకరించారు.

మధ్యధరా సముద్రంలోని తమ యుద్ద నౌకలు స్పందించాయని పేర్కొన్నారు. ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్ లోని ఐడిఎఫ్ స్థావరం తీవ్రంగా దెబ్బతినగా, ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఇరాన్ తన భూభాగంపై నుండి నేరుగా ఇజ్రాయెల్ పై దాడి చేయడం ఇదే తొలి సారి. ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయెల్ కు రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తాజాగా ప్రకటించారు.

భీకర దాజులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు తాను తెలిపానన్నారు. దీంతో శత్రువులు తనను ఏమీ చేయలేరని వెల్లడించినట్లైయింది. మేం ఇజ్రాయెల్ కు ఉక్కుకవచంగా ఉండటానికి కట్టుబడి ఉన్నామని, ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేశామన్నారు. మా సైనికులు అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారన్నారు. భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తామని, ఈ దాడులను తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

అంతకు ముందే ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో టెలిఫోన్ లో మాట్లాడారు. దీంతో పాటు జీ 7 దేశాధినేతలతో కూడా బైడెన్ సంభాషించనున్నారు. ఇరాన్ దాడిపై సమన్వయంతో దౌత్యమార్గంలో స్పందించే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ నేతలతో తన బృంద సభ్యులు టచ్ లో ఉంటారని పేర్కొన్నారు.

ఇరాన్ దాడిని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు ఇప్పటికే ఖండించి ఇజ్రాయిల్ కు మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేశాయి. మరో వైపు ..ఉద్రిక్తతలను మరించి పెంచే విధంగా .. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. తమ దేశ అధికారి హత్యకు ప్రతికారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. మా అధికారి హత్యలో తమ ప్రమేయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. అదే సమయంలో ఖండించలేదు కూడా. ఈ రోజు ఇరాన్ డ్రోన్ దాడిని ఇజ్రాయెల్ చేసిన నేరానికి శిక్షగా భావించండి అని ఇరాన్ చెబుతోంది అని పేర్కొంది.

ఇజ్రాయెల్ ప్రభుత్వం మరో తప్పు చేస్తే, ఇరాన్ ప్రతిస్పందన గణనీయంగా తీవ్రంగా ఉంటుంది. ఇది ఇరాన్ కు, దుర్మార్గమైన ఇజ్రాయెల్ పాలనకు మధ్య జరుగుతున్న సంఘర్షణ. దీనికి అమెరికా దూరంగా ఉండాలి. అని ఐక్య రాజ్య సమితి లో ఇరాన్ మిషన్ హెచ్చరించింది.

CM YS Jagan: సీఎం జగన్ పై దాడి .. ప్రధాని మోడీ సహా స్పందించిన ప్రముఖులు

Related posts

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju