NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై నిన్న విచారణ జరిపిన సీబీఐ న్యాయస్థానం .. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.

CM YS Jagan

ఈ నేపథ్యంలో సీబీఐ నేడు కోర్టులో తమ వాదనలు వినిపించింది. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతున్న దశలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. వివిధ కారణాలతో ఇంతకు ముందు ఆయన విదేశాలకు వెళ్లొచ్చారని గుర్తు చేసింది. వాదనలు విన్న న్యాయస్థానం .. తీర్పును మే 14వ తేదీకి వాయిదా వేసింది.

కాగా, సీఎం జగన్ కు కోర్టు నుండి అనుమతి వస్తే ఈ నెల 17 నుండి జూన్ 1వ తేదీ వరకూ విదేశీ పర్యటన చేయాలని భావిస్తున్నారు. ఏపీలో మే 13న పోలింగ్ జరగనుండగా, జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ వ్యవధిలో ఆయన కుటుంబ సభ్యులతో గడిపేందుకు విదేశీ పర్యటన ప్లాన్ చేసినట్లు తెలుస్తొంది. గతంలోనూ జగన్ విదేశీ పర్యటనలకు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. దీంతో ఈ పర్యాయం కూడా విదేశీ పర్యటనకు కోర్టు సానుకూల నిర్ణయం వెలువరిస్తుందని వైసీపీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నారు.

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

Related posts

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ .. నైరుతి వచ్చేసింది

sharma somaraju

ఏపీ పోస్టల్ బ్యాలెట్ పంచాయతీ సుప్రీం చెంతకు..

sharma somaraju

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదు: సీఈవో మీనా

sharma somaraju

దేవినేని వార‌సుడికి ఎగ్జిట్‌ సెగ‌.. ఇలా జ‌రిగిందేంటి..?

రాజ‌కీయాల్లో వెలిగి.. మేనేజ్‌మెంట్‌లో ఓడారు..!

ఆరా మ‌స్తాన్ చెప్పింది నిజ‌మైతే.. చంద్ర‌బాబుదే విజ‌యం..!

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

BRS: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకున్న బీఆర్ఎస్

sharma somaraju

వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ..  అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ నివాళి

sharma somaraju

MLC Election: పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

sharma somaraju

బీఆర్ఎస్ ఫ్యూచ‌ర్‌లో ఏం క‌న‌ప‌డుతోందంటే…?

ఏపీ ఎగ్జిట్ పోల్స్‌… ఈ ఒక్క‌టి మాత్రం నిజం…!