NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

సంచలనం కోసం ఎందుకీ వ్యాఖ్యలు…!

మంత్రి మోపిదేవి వెంకటరమణ నిన్న ఒక సంచలన వ్యాఖ్య చేశారు. సాధారణంగా రాజకీయంలో అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, అవినీతి కథలు, ఘాటు వ్యాఖ్యలు వినిలిస్తాయి. కానీ ప్రాణాంతకమైన వైరస్ పై కూడా ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. నిన్న త్రి మోపిదేవి మాట్లాడుతూ “తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే స్లీపర్ సెల్స్ గా మారి జనంలో తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారు” వ్యాఖ్యానించారు. దీనికి మళ్లీ చివర్లో తనకు అనుమానాలున్నాయి అని ముక్తాయింపు ఇచ్చారు. ఇది రాష్ట్ర కరోనా రాజకీయంలో తీవ్ర వాణి గా మారింది.

పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు..?

సరే మంత్రి చెప్పింది కాసేపు నిజమే అనుకుందాం. మంత్రి స్థాయిలో ఆయన పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? నిజంగా తెలుగుదేశం పార్టీ ఇంతటి దుశ్చర్యకి పాల్పడుతుందా?? ఆయన మంత్రి హోదాలో మాట్లాడితే ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ చేపట్టాలి..? లేదా ఆయన వైకాపా ప్రతినిధిగా మాట్లాడితే, ఆధారాలు లేకపోతే దిగజారుడు వ్యాఖ్యలకు కాస్త తలవంపులు ఎదుర్కోవాలి. ఇక్కడ మంత్రి వ్యాఖ్యలు చుట్టూ అనేక అనుమానాలు.
* తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తే పోలీసులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మంత్రి దగ్గర ఆధారాలు ఉంటె ఎందుకు అందించలేదు.
* నిజానికి కరోనా వైరస్ ని స్లీపర్ సెల్ గా వ్యాప్తి చేయాలి అంటే వారికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ జరగాలి. ఇలా నిర్ధారించాల్సింది ప్రభుత్వమే. * ప్రస్తుత ఈ పరిస్థితుల్లో కరోనా ఉన్నవారు బయట తిరిగే అవకాశం ఉందా? తాను అంటించేయాలి అంటే, తనకు తెలియాలి, అంటే ప్రభుత్వము నిర్ధారించాలి. * ఇలా నిర్ధారించిన తర్వాత పాజిటివ్ ఉన్న వ్యక్తిని ప్రభుత్వం అలా విడిచి పెట్టదు కదా..? అంటే మోపిదేవి వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలు, ఒకరకంగా అవి సంచలనం కోసం చేసిన వ్యాఖ్యలే.

మరింత కిందకు రాజకీయం…

వైరస్ ప్రాణం తీస్తుంది. నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుంటున్నారు. సాధారణ జనంలో భయం ఆవహిస్తుంది. ఇది రాజకీయాన్ని మరింత కిందకు దిగజార్చే వ్యవహారమే. ఒకవేళ మంత్రి వ్యాఖ్యలు నిజమైతే తెలుగుదేశం పార్టీ మీద కఠిన చర్యలు తీసుకోవాలి..! పెద్దపెద్ద నాయకులు సైతం అరెస్ట్ చేయాల్సిందే..! మంత్రి వ్యాఖ్యలు నిజం కాకపోతే అతనిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కోరే అవకాశం ఉంది. అంటే ఎటు చూసినా ఇటువంటి వ్యాఖ్యలు కేవలం రాజకీయాన్ని మరింత కిందకు తీసుకెల్లేవే. జనాల్లో లేని భయల్ని పెంచి పోషించేవే.

Related posts

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

Leave a Comment