NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో మేనిఫెస్టో జోష్ తుస్‌.. ఇంత షాక్ ఇచ్చారేంట‌బ్బా…?

ఎన్నిక‌ల వేళ అన్ని రాజ‌కీయ ప‌క్షాలు.. ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు మేనిఫెస్టో(మేం అధికారంలోకి వ‌స్తే.. మీకు ఇది చేస్తాం అని చెప్పే హామీల ప‌త్రం) రిలీజ్ చేస్తాయి. ఇది రాజ‌కీయాలు పుట్టిన నాటి నుం చి ఉంది. అనేక పార్టీలు.. అనేక రూపాల్లో మేనిఫెస్టోల‌ను విడుద‌ల చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఏపీలో మేనిఫెస్టో అంటే.. వైసీపీ, వైసీపీ అంటే మేనిఫెస్టో… నిబ‌ద్ద‌త‌, నిజాయితీ వంటివాటికి కూడా.. త‌మ మేని ఫెస్టో నిలువుట‌ద్దం! అని చెప్పుకొనే ప‌రిస్థితిలో వైసీపీ నాయ‌కులు ఉన్నారు.

ఇదే 2019లో వైసీపీని ముందుకు న‌డిపించింది. అంతేకాదు..దీనినే ఆ పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ భ‌గవ ద్గీత‌, బైబిల్‌, ఖురాన్ అని చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పుడు కూడా ఇదే త‌ర‌హాలో సీఎం జ‌గ‌న్‌.. మేనిఫె స్టోను రిలీజ్ చేశారు. గ‌తంలో చెప్పిన న‌వ‌ర‌త్నాల‌కు కొన‌సాగింపుగా దీనిని తీసుకువ‌చ్చిన‌ట్టు సీఎం చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో ఎంత వ‌ర‌కు చేయాల్నో.. అంతా చేస్తున్నామ‌న్నారు. ఇంత‌కు మించి చేసే ప‌రిస్తితి లేద‌ని… కూడా వెల్ల‌డించారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు మేనిఫెస్టోపై పెద్ద‌గా జోష్ క‌నిపించ‌డం లేదు. జ‌నాల మాట దేవుడెరుగు.. నాయ‌కులు కూడా.. దీనిని ప‌ట్టించుకోవ‌డం లేదు. దీనిని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు కూడా నాయ‌కులు ముందుకు రావ‌డంలేదు. నిజానికి 2019లో న‌వ‌ర‌త్నాల పేరుతో ఇచ్చిన తొలి మేనిఫెస్టో.. అదిరిపోయే రేంజ్‌లో జ‌నాల నాలుక‌ల‌పై నానింది. ఇంకేముంది.. జ‌గ‌న్ వ‌స్తే.. త‌మ బ‌తుకులు మారిపోతాయ‌ని అనుకున్నారు. ఇదే అన్ని చోట్లా క‌నిపించింది.. వినిపించింది.

కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. ఇంత‌కు మించి! అన్న‌ట్టుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు వండివారుస్తామ‌ని చెబుతున్నారు. జ‌నాల‌కు కావాల్సింది.. ఇదే! త‌ర్వాత అమ‌లు చేయ‌ర‌ని జ‌గ‌న్ చెబుతున్నా.. ఆయ‌న చెప్పిన మేనిఫెస్టోలోనే చాలా కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయ‌ని విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. కాబ‌ట్టి.. ఎవ‌రైనా ఎన్ని చెప్పినా.. త‌మ‌కు అవ‌కాశం ఉన్నంత వ‌రకే చేస్తారు. కాబ‌ట్టి జ‌గ‌న్ చెప్పిన ఫార్ములా ఇప్పుడు బాబుకు వ‌ర్తించదు. పైగా ఆయ‌న గ‌ట్టిగా చెబుతున్న రూ.4000 పింఛ‌ను గ్రామీణ స్తాయిలో దూసుకుపోతోంది. దీంతో వైసీపీ నాయ‌కులు కూడా .. త‌మ మేనిఫెస్టో గురించి చ‌ర్చించ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది.

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N