NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పింఛ‌న్లు-ప‌రేషాన్లు.. వైసీపీ ఉచ్చులో టీడీపీ.. !

మ‌రోసారి పింఛ‌న్ల వ్య‌వ‌హారం రాష్ట్రంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. మ‌రో రెండు రోజుల్లోనే మే 1వ తారీకు వ‌చ్చే స్తోంది. ఈ నేప‌థ్యంలో 66.7 ల‌క్ష‌ల మందికి సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్లు మంజూరు చేయాలి. అయితే.. గ‌త నెల మార్చి 1వ తేదీ వ‌ర‌కు ఇంటింటికీ వెళ్లిన వ‌లంటీర్లు.. వీటిని ల‌బ్దిదారులు కాలు క‌ద‌ప‌కుండానే ఇంటి ముందు అందించారు. ఈ నెల‌కు వ‌చ్చే స‌రికిమాత్రంవ‌లంటీర్ల‌ను క‌ట్ట‌డి చేశారు. దీంతో పింఛ‌న్ల వ్య‌వ‌హారం.. తీవ్ర వివాదాస్ప‌దం అయింది.

వ‌లంటీర్ల‌కు ఇంటికి వెళ్లే అవ‌కాశం లేకుండా చేయ‌డంతో గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు వ‌చ్చి.. గంట‌ల త‌ర‌బ‌డి ఎదురుచూసే ప‌రిస్తితి వ‌చ్చింది. ఈ ప‌రిణామం ల‌బ్దిదారుల‌కు క‌ళ్లు బైర్లు క‌మ్మేలా చేసింది. 33 మంది వృద్దులు కూడా చ‌నిపోయిన‌ట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనిని వైసీపీ టీడీపీ ఖాతాలో వేసింది. టీడీపీ మాత్రం… దీనికి త‌మ త‌ప్పు లేద‌ని.. వైసీపీ కావాల‌నే చేసింద‌ని చెబుతోంది. అయినా.. వైసీపీ వ్యూహమే పైచేయి సాధించింది.

ఈ ప‌రిణామాల‌తో ఉలిక్కి ప‌డిన టీడీపీ.. మే 1 న ఇచ్చే పింఛ‌న్ల‌పై ముందుగానే అలెర్ట‌యింది. ఈ నెల 15వ తేదీ నుంచే మే 1వ‌తేదీన ఇచ్చే పింఛ‌న్ల‌పై దృష్టి పెట్టి.. అటు ఎన్నిక‌ల సంఘానికి, ఇటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి కూడా ఇంటింటికీ వెళ్లి ఇచ్చేలా .. విన్న‌పాలు చేసింది. వ‌లంటీర్ల జోక్యాన్ని క‌ట్ట‌డి చేసింది. కానీ.. టీడీపీ ఇంత ముందే మేల్కొన్నా.. ఇక్క‌డ కూడా.. వైసీపీ వ్యూహాత్మ‌కంగానే అడుగులు వేసింది. అస‌లు ఎవ‌రూ వ‌ద్దు .. పింఛ‌న్ల‌ను ల‌బ్దిదారుల బ్యాంకు అకౌంట్ల‌లో వేస్తామ‌ని ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది.

అయితే.. ఇది ఏప్రిల్‌లో 1వ తేదీ నుంచి 6వ తేదీ వ‌రకు జ‌రిగిన వివాదం కంటే కూడా ఎక్కువ‌గానే జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఎందుకంటే.. గ్రామ వార్డు స‌చివాల‌యాలు.. ఇళ్ల‌కు కాస్త దూరంలోనే ఉండేవి.పైగా అక్క‌డ‌కు వెళ్తే.. నిముషాల వ్య‌వధిలోనే ప‌నిజ‌రిగిపోయింది. కానీ, ఇప్పుడు బ్యాంకుల్లో వేస్తే.. (సుమారు 52 ల‌క్ష‌ల మందికి ఇలానే చేయ‌నున్నారు.) ల‌బ్ధి దారులు త‌ప్ప‌ని స‌రిగా బ్యాంకుల‌కు క్యూ క‌ట్టాలి. అక్క‌డ గంట‌ల కొద్దీ నిరీక్షించాలి. పైగా ఓచ‌ర్లు ఫిల్ చేయాలి. చేసినా.. వేచి ఉండాలి.

ఇది వృద్ధులు, దివ్యాంగులు వంటివారికి మ‌రింత క‌ష్టం. అప్పుడు కూడా.. టీడీపీపైనే వైసీపీ నెపం వేసేయ‌డం ఖాయం. అలాగ‌ని టీడీపీ దీనిని వ్య‌తిరేకించే ప‌రిస్థితి లేదు. ఇంకోవైపు.. ల‌బ్దిదారులు ఖ‌చ్చితంగా తాము ప‌డుతున్న క‌ష్టాల‌కు టీడీపీనే కార‌ణ‌మ‌ని చెప్పే అవ‌కాశం ఉంది. ఇలా.. ఏ విధ‌గా చూసుకున్నా మ‌రోసారి టీడీపీ వైసీపీ ఉచ్చులో చిక్కుకున్న‌ట్టే అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N