NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప‌రిస్థితి ఏంటి? గ‌త ఎన్నిక‌ల్లో ఏదో గాలి వాటంగా నెట్టుకొచ్చేసిన ప్ర‌స్తుత ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రికి.. ఇప్పుడు కాక పుడుతోంది. ఇది ఎవ‌రో టీడీపీ వాళ్లో లేదా అపొజిష‌న్ వాళ్లో చెబుతున్న మాట కాదు. సొంత పార్టీనాయ‌కులు.. అబ్బ‌య్య చౌద‌రి వెనుక తిరిగిన నేత‌లే చెబుతున్నారు. ఒకింత ఆశ్చ‌ర్యం వేసినా.. ఇది నిజం. ఎక్కువ మంది వ‌స్తున్నార‌ని.. నాయ‌కులు అనుకున్నా.. ఆ వ‌చ్చేవారిలో ఎంత మంది నిజ‌మైన కార్య‌క‌ర్త‌లో తెలుస్తుంది.

ఇలానే.. జ‌నాలు జై కొట్టినంత మాత్రాన‌, జ‌నాలు జేజేలు పలికినంత మాత్రాన గెలిచిన‌ట్టు కాదు. ఓట‌ర్ల స‌ర‌ళి.. తొలి ప్ర‌చారంలోనే తెలిసిపోతుంది. అలానే.. అబ్బ‌య్య చౌద‌రి ప్ర‌చారానికి భారీగా జ‌నాల‌ను తీసుకువచ్చినా ఓట‌ర్ల నాడి మాత్రం చింత‌మ‌నేని వైపు ఉంద‌ని సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లే… అబ్బ‌య్య చౌద‌రి చుట్టూ ఉన్న‌వారే చెబుతున్నారు. పైకి చెప్ప‌క‌పోయినా.. లోలోన గుస‌గుస‌లాడుతున్నారు. ఇక మావోడు క‌ష్ట‌మేన‌ని అనేస్తున్నారు. ఈ ప‌రిణామం వైసీపీ ప‌రిస్థితిని తేట‌తెల్లం చేస్తోంది.

ఎందుకిలా.. ?
రాజ‌కీయాల్లో క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితిని నాయ‌కుల కన్నా కూడా.. కార్య‌క‌ర్త‌లు, క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేస్తున్న వా రు ముఖ్యంగా ప‌సిగ‌డ‌తారు. ముందుగా కూడా ప‌సిగ‌డ‌తారు. ఇదే అబ్బ‌య్య చౌద‌రి విష‌యంలోనూ జ‌రిగింది. గ‌డిచిన ఏడాది నుంచి కూడా.. ఆయ‌న గ్రాఫ్ బాగోలేద‌న్న‌ది ఆయ‌న వ‌ర్గ‌మే చెబుతున్న మాట‌. అయితే.. స‌హ‌జంగా నాయ‌కుల‌కు ఉండే ల‌క్ష‌ణం ఏంటంటే.. త‌మ‌కు ఎదురుగాలి వీస్తోంద‌ని అంటే.. వారికి న‌చ్చ‌దు. అందుకే.. అబ్బ‌య్య కూడా క‌ళ్లు తెర‌వ‌లేక పోయారు. ఇప్పుడు క‌ళ్లు తెరిచినా.. కాళ్లు తెరిచినా ప్ర‌యోజ‌నం లేద‌నేది ఆయ‌న వ‌ర్గంలోని కీల‌క నాయ‌కులు చెబుతున్నారు. ఆయ‌న పేరు చెప్పుకుని ఆయ‌న కుటుంబ స‌భ్యులు, ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం చేసిన దందాలు, అవినీతి అంతా ఇంతా కాద‌న్న విమ‌ర్శ‌లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

దెందులూరులో అస‌లేం జ‌రిగింది..?

+ క్షేత్ర‌స్థాయిలో కామ‌న్ ప్ర‌జ‌ల‌కు-ఎమ్మెల్యే అబ్బ‌య్యకు మ‌ధ్య భారీ గ్యాప్ పెరిగిపోయింది.

+ ఏ స‌మ‌స్య ఉన్న ఇంటికి వెళ్లాలి.. వెళ్లినా ఎవ‌రో ఒక‌రిద్ద‌రు నేత‌ల‌కు మిన‌హా మిగిలిన వారికి ప‌ల‌క‌రింపులు ఉండ‌వు. పోనీ ఏదోలా స‌మ‌స్య చెప్పుకున్నా ఆ స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌న్న గ్యారెంటీ లేదు. ఇది కూడా అబ్బ‌య్య‌కు మైన‌స్ అయిపోయింది.

+ అన్నింటా తండ్రి పెత్త‌నం. స‌మాంత‌ర ఎమ్మెల్యేగా చ‌క్రం తిప్పిన వైనం కూడా.. ఇప్పుడు మైన‌స్ అయ్యేందుకు దోహ‌ద ప‌డింది.

+ ఎలా చూసుకున్నా.. ఇప్పుడు అబ్బ‌య్య ప‌రిస్థితి `పోలిగాడు పోనూ పోయాడు-రానూ వ‌చ్చాడు!` అన్న సామెత‌ను గుర్తు చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju