NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

పార్టీలు ఏవైనా.. అభ్య‌ర్థుల‌ను ఎంచుకునేముందే.. అన్నీ ప‌రిశీలిస్తాయి. అన్ని కోణాల్లోనూ స‌రిచూసుకుం టాయి. వారి స‌త్తా ఎంత‌? వారు ఏమేర‌కు విజ‌యం ద‌క్కించుకుంటార‌ని ప‌రిశీలిస్తాయి. అందుకే. ఇటు టీడీపీ అయినా.. అటు వైసీపీ అయినా. అనే క స‌ర్వేలు చేసిన త‌ర్వాతే.. నాయ‌కుల‌కు టికెట్లు ఇచ్చాయి. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ ఆశించిన వారికి కూడా.. ఇవ్వ‌కుండా ప‌క్క‌న పెట్ట‌డానికి కార‌ణం.. ప్ర‌త్య‌ర్థులు బ‌లంగా ఉండ‌డ‌మే.

కానీ, అదేంటో వైసీపీ ఈ విష‌యంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం త‌ప్ప‌ట‌డుగులు వేసింద‌ని ఆ పార్టీ నేత‌లే చెబుతున్నారు. ఆ రెండు బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు కాగా.. అక్క‌డ వైసీపీ బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థుల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీస్తోంది. వారే.. అద్దంకిలో పాణెం చిన్న హ‌నిమిరెడ్డికి అవ‌కాశం ఇచ్చింది వైసీపీ. ఇక‌, మ‌రో బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం.. ప‌రుచూరు. ఇక్క‌డ గ‌త రెండు ఎన్నికల్లోనూ టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంటోంది.

ఇలాంటి చోట బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టాల్సిన వైసీపీ ప్ర‌యోగాల‌పై ప్ర‌యోగాలు చేసింది. ఈ క్ర‌మంలోనే పార్టీలో ఒక‌సారి ఉండి.. మ‌ళ్లీ వెళ్లిపోయిన ఎడ‌మ బాలాజీని పిలిచి మ‌రీ టికెట్ ఇచ్చింది. ఇక్క‌డ అసలు ఎడ‌మ బాలాజీ ఏమాత్రం పోటీ ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో ఉన్నార‌ని.. క్షేత్ర‌స్థాయిలో వైసీపీ నాయ‌కులే చెబుతున్నారు.కానీ, అధిష్టానంమ‌త్రం ఆయ‌న‌ను ఎంపిక చేసింది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్తితిని గ‌మ‌నిస్తే.. అద్దంకిని టీడీపీకి కంచుకోట‌గా మార్చ‌డంలో గొట్టిపాటిర‌వి స‌క్సెస్ అయ్యారు.

ఒక‌వైపు.. త‌న బ‌లం.. మ‌రోవైపు .. పార్టీ బ‌లంతో ఆయ‌న వ‌రుస‌గా నాలుగోసారి బ‌రిలో నిలిచారు. ప్ర‌జానా య‌కుడిగా కూడా గుర్తింపు పొందారు. ఇక‌, హ‌నిమిరెడ్డి నాన్ లోక‌ల్ కావ‌డంతో ఇక్క‌డ వైసీపీ నేత‌లే ఆయ న‌కు ముఖం చాటేస్తున్న ప‌రిస్థ‌తి క‌నిపిస్తోంది. అదేవిధంగా ప‌రుచూరులో అసలు ఏమాత్రం పోటీఇచ్చే ప‌రిస్థితిలో ఎడ‌మ బాలాజీ క‌నిపించ‌డం లేదు. గ‌తంలో ఈయ‌న ఇక్క‌డ కేడ‌ర్ క‌లిసి రాక‌పోవ‌డంతోనే వెల్లిపోయారు. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి ఉంది.

అయినా.. వైసీపీ ఆయ‌న‌కే టికెట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. సో.. ఎలా చూసుకున్నా.. ఈ ఇద్ద‌రు నాయ‌కులు, ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ప‌రాజ‌యం ఎన్నిక‌ల‌కు ముందే తేలిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?