NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

Aa Okkati Adakku: ఈ మధ్య సీరియస్ కాన్సెప్ట్ కథలతో ప్రయోగం చేసిన అల్లరి నరేష్.. తాజాగా ఆ ఒక్కటి అడక్కు అని ఓ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించాడు. మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. వెన్నెల కిషోర్, జెమీ లివర్, రవి కృష్ణ, గౌతమి, మురళీ శర్మ, అరియానా, హ‌రి తేజ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల‌ను పోషించారు. గోపి సుందర్‌ సంగీతం అందించాడు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి కలిసి నిర్మించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా భారీ అంచ‌నాల న‌డుమ మే 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

నాంది తర్వాత మళ్లీ ఫ్లాపుల్లో మునిగిన అల్లరి నరేష్.. ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో హిట్ కొట్టాలని ఎంతో ఉత్సాహంగా థియేటర్స్ లోకి వచ్చారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న యువతీయువకులు మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించి ఎలా మోసపోతున్నారు అనే పాయింట్ తో ఆ ఒక్కటి అడక్కు సినిమాను తెరకెక్కించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా మూవీ ఉంటుంద‌ని టీజ‌ర్‌, ట్రైల‌ర్ ద్వారా మేకర్స్ హింట్ ఇచ్చారు.

కానీ అనుకున్న స్థాయిలో కామెడీ లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అయింది. అయితే పెళ్లి కానీ కుర్రాడు గణపతి పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా ఆక‌ట్టుకున్నాడు. అలాగే ఫేక్ పెళ్లి కూతురు సిద్ధి పాత్ర‌కు ఫరియా అబ్దుల్లా పూర్తి న్యాయం చేసింది. ఇక బావ‌కి పెళ్లి చేయాలని తపనపడే మరదలు క్యారెక్ట‌ర్ లో జెమీ లివర్ చేసిన హంగామా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ఈ చిత్రానికి యావరేజ్ టాక్ లభించింది.

అయితే అటువంటి టాక్ తో కూడా అల్లరోడు కలెక్షన్ల పరంగా అద‌ర‌గొట్టేస్తున్నాడు. తాజాగా ఆ ఒక్కటి అడక్కు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ బయటకు వచ్చాయి. మూడు రోజుల ర‌న్ ముగిసే స‌మ‌యానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.73 కోట్ల షేర్‌, రూ. 3.75 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను సొంతం చేసుకున్న ఆ ఒక్క‌టి అడ‌క్కు సినిమా.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 1.98 కోట్ల షేర్‌, రూ. 4.45 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. విడుద‌ల‌కు ముందు ఈ సినిమాకు రూ. 4 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.

దీంతో రూ. 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఆ ఒక్క‌టి అడ‌క్కు చిత్రాన్ని విడుద‌ల చేశారు. ఇప్పుడు ఈ టార్గెట్ ను అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ కొట్టాలంటే వీకెండ్ వ‌ర‌కు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ. 2.62 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మ‌రి వ‌ర్కింగ్ డేస్ లో ఆ ఒక్క‌టీ అడ‌క్కు ప‌ర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Related posts

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri