NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల నుంచి ఎంతమంది కొత్త హీరోయిన్లు వస్తున్న కూడా రెమ్యునరేషన్ విషయంలో నయనతారను మాత్రం ఎవ్వ‌రూ బీట్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక్కో చిత్రానికి రూ. 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ స్టార్ హీరో మూవీలో అక్క పాత్రను ఆఫర్ చెయ్యగా.. నయనతార డబుల్ రెమ్యునరేషన్ అడిగిందట. అంటే రూ. 20 కోట్లు ఇస్తే చేస్తానని చెప్పిందట. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మధ్య‌మాల్లో తెగ చెక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేజీయఫ్ మూవీతో నేష‌న‌ల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న క‌న్నడ రాక్ స్టార్ య‌ష్‌.. ఇటీవ‌ల త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ను మలయాళ న‌టి, లేడీ డైరెక్ట‌ర్ గీతూ మోహన్‌ దాస్‌ చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. వీరి కాంబో ప్రాజెక్ట్ కు టాక్సిక్ అనే టైటిల్ క‌న్ఫార్మ్ అయింది. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ త‌ర‌హాలో రెండు భాగాలుగా టాక్సిక్ మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది.

టాక్సిక్ లో కియారా అద్వానీ, శృతి హాస‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నార‌నే టాక్ ఉంది. అలాగే ఈ చిత్రంలో య‌శ్ సిస్ట‌ర్ క్యారెక్ట‌ర్ ఒక‌టి ఉంది. క‌థ‌లో కీల‌క‌మైన ఆ పాత్ర‌కు హీరోయిన్ల కంటే ఎక్కువ ప్ర‌ధాన్య‌త ఉంటుందట‌. ఈ నేప‌థ్యంలోనే ఆ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ను ఎంపిక చేశార‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు ఓ కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. పాత్ర బ‌లంగా ఉండ‌టం వ‌ల్ల య‌ష్‌కు అక్క‌గా న‌టించేందుకు క‌రీనా క‌పూర్ మొద‌ట అంగీక‌రించిన‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత కాల్షీట్స్ స‌ద్దుబాటు కాక‌పోవ‌డంతో ఆమె టాక్సిక్ నుంచి త‌ప్పుకుంద‌ట‌.

దాంతో ఆ పాత్ర కోసం అనేక మంది న‌టీమ‌ణుల పేర్ల‌ను ప‌రిశీలించి చివ‌ర‌కు లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌ను తీసుకోవాల‌ని మేక‌ర్స్ ఫిక్స్ అయ్యార‌ట‌. ఇందులో భాగంగానే టాక్సిక్ మూవీ టీమ్ న‌య‌న‌తార‌ను సంప్ర‌దించ‌గా.. ఆమె సానుకూలంగా స్పందించింద‌ట‌. య‌ష్‌కు అక్క‌గా చేయ‌డానికి ఇంట్రెస్ట్ ఉన్న‌ట్లు హింట్ ఇచ్చింద‌ట‌. కానీ రూ. 20 కోట్లు రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసింద‌ని.. దాంతో నిర్మాత‌లు ఖంగుతిన్నారంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యంపై నెటిజ‌న్లు రియాక్ట్ అవుతున్నారు. అక్క పాత్రకు ఇర‌వై కోట్లా.. మ‌రీ టూ మ‌చ్ అని కొంద‌రు న‌య‌న్‌ను విమ‌ర్శిస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం లేడీ సూప‌ర్ అంటే ఆ మాత్రం ఉండాలంటూ మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. కాగా, నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ అగ్రతార వెలుగొందుతున్న న‌య‌న‌తార‌.. ఇటీవ‌లె జ‌వాన్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టి బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం న‌య‌న్ త‌మిళంలో మన్నంగట్టి సిన్స్ 1960, టెస్ట్ అనే ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తూ బిజీగా ఉంది.

Related posts

America: అమెరికాలో హైదరాబాదీ యువతి అదృశ్యం

sharma somaraju

OTT: అనుకున్న దానికంటే త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతున్న పాపులర్ వెబ్ సిరీస్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Aranmanai 4 OTT: ఓటిటిలో సందడి చేసేందుకు రెడీ అయినా రాశి కన్నా, తమన్నా కామెడీ హర్రర్ మూవీ.. అప్డేట్ ఇచ్చిన ప్లాట్ ఫామ్..!

Saranya Koduri

Sabari OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా వరలక్ష్మి శరత్ కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్.. డేట్ ఇదే..!

Saranya Koduri

Brahmamudi: బ్రహ్మ ముడి అప్పుతో కళ్యాణ్ వివాహం.. ఎలానో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Project Z: ఓటీటీలో దూసుకెళ్తున్న మెగా కోడలి మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Nuvvu Nenu Prema June 03 Episode 640: కోడలు మీద కోప్పడి కుచల.. చేయి చేసుకున్న నారాయణ.. సుగుణ కి గుడ్ న్యూస్ చెప్పిన పంతులు..

bharani jella

కౌంటింగ్ ఆఫ్ట‌ర్ ఏపీ పాలిటిక్స్‌.. బ‌ల‌య్యేది వీళ్లే…:

అదే జ‌రిగితే వైసీపీ, టీడీపీలో ఈ టాప్ లీడ‌ర్లకు మూడిన‌ట్టే..?

వైసీపీ ఓటు బ్యాంకు చెక్కు చెద‌ర్లేదా… ఎస్ 100 % నిజం ఇది..!

Brahmamudi June 03 Episode  426:రాజ్ మాయల పెళ్లి కోసం రుద్రాణి ప్లాన్.. రాజ్ కి కావ్య నో హెల్ప్.. మాయకి యాక్సిడెంట్.. రేపటి ట్విస్ట్…

bharani jella

జ‌గ‌న్‌, చంద్ర‌బాబు… ఎవ‌రి త‌ప్పులు వారు వెతుక్కుంటున్నారా..?

వైసీపీ, టీడీపీలో జంపిగుల‌కు కూడా.. అదే ముహూర్త‌మా..?

Krishna Mukunda Murari June 03 Episode 486:ముకుంద సరోగసి మదర్ అని నిరూపించాలనుకున్న కృష్ణ..అబద్ధం చెప్పిన వైదేహి అడ్డం తిరిగిన కథ..

bharani jella

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ .. నైరుతి వచ్చేసింది

sharma somaraju