Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎవరు ఊహించని రీతిలో సాగుతోంది. సెప్టెంబర్ మూడవ తారీకు స్టార్ట్ అయిన ఈ సీజన్ సగం పూర్తి చేసుకోవడం జరిగింది. సీజన్ ప్రారంభంలో మొత్తం 14 మంది ఎంట్రీ ఇవ్వగా తర్వాత ఆరుగురు ఎలిమినేట్ అయ్యాక వైల్డ్ కార్డు రూపంలో ఐదుగురు ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు హౌస్ లో 15 మందికి పైగా సభ్యులు ఉన్నారు. అంతేకాకుండా రతిక ఎంట్రీ ఇవ్వడం హౌస్ లో సభ్యులకు ఊహించని షాక్ ఇచ్చినట్లయింది. ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మళ్ళీ హౌస్ లో వచ్చి గేమ్ ఆడుతూ ఉండటంతో… మొదటి నుండి కష్టపడుతూ గేమ్ ఆడుతున్న సభ్యులకు ఏం అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో ఎనిమిదవ వారం నామినేషన్ ప్రక్రియ హోరహోరీగా సాగింది. అయితే ఎనిమిదో వారంలో శివాజీ, భోలె, అమర్, ప్రశాంత్, యవర్, ప్రియాంక, గౌతమ్ నామినేషన్ లో ఉన్నారు. ఇప్పటివరకు ఏడు వారాలకు గాను హౌస్ నుండి ఎలిమినేట్ అయినది అందరూ లేడీసే. అయితే ఎనిమిదో వారం నామినేషన్ లో ఏడుగురు ఉండగా అందులో ఒక్కరే లేడీస్. దీంతో ఎవరు ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా ఉంది. ఎనిమిదో వారంలో నామినేషన్ లో ఉన్న సభ్యులంతా చాలా స్ట్రాంగ్ సభ్యులే.
ఈ సీజన్ లో టాప్ ఫైవ్ అనుకుంటున్నా వాళ్లంతా ఇందులో ఉన్నారు. దీంతో ఎనిమిదో వారం ఓటింగ్ చాలా కీలకంగా మారింది. ఇదిలా ఉంటే హౌస్ లోకి ఎలిమినేట్ అయిన రతిక రీఎంట్రీ ఇవ్వడంతో.. సరికొత్త వాతావరణం ఏర్పడింది. నాలుగో వారంలో రతిక ఎలిమినేట్ అయింది. మళ్లీ ఇప్పుడు ఎనిమిదో వారంలో హౌస్ లో గేమ్ ఆడటంతో.. చూస్తున్న ప్రేక్షకులకు ఇంటిలో ఉన్న సభ్యులకు.. ఉల్టా పుల్టా మాదిరిగా ఉంది. ఈసారి సీజన్ ఎవరు ఊహలకు అందని రీతిలో సాగుతోంది.