NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: పద్మావతి కోసం గొడవ పడిన విక్కీ,కృష్ణ.. పుట్టింటి ప్రేమకి దూరమైన పద్మావతి..

Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,రిసెప్షన్ కి అన్ని ఏర్పాట్లు చేస్తారు.అందరు ఆ వస్తూ ఉంటారు. మాయ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. జలజ ఆమెని అడ్డం పెట్టుకొని ఇంట్లో గొడవ సృష్టించాలి అని అనుకుంటుంది. అరవింద్ అను ముందుగానే భయపెడుతుంది శాంతాదేవి ఏది ఏమైనా సరే ఈరోజు విక్కీ పద్మావతిల పెళ్లి గురించి అందరికీ తెలియాల్సిందే అని చెప్తుంది.

ఈరోజు 373 వ ఎపిసోడ్ లో పద్మావతిని జలజ అందరి ముందు అవమానిస్తుంటుంది. వీళ్లు డబ్బులు కోసమే పెళ్లి చేసుకున్నారు. మా వ్యక్తిని ట్రాప్ లో పడేశారు అని, మాయా వాళ్ళ అమ్మతో కలిసి జలజ కూడా పద్మావతిని అవమానిస్తుంటుంది. అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. పద్మావతి గురించి ఎవరైనా ఇంకొక్కమాటన్నా గాని, పద్మావతిని తక్కువ చేసి మాట్లాడితే, నేను చూస్తూ ఊరుకోలేను ఎందుకంటే తను నా భార్య అని పద్మావతి మీద చేయి వేసి దగ్గరికి తీసుకుంటాడు. ఆ మాటతో పద్మావతి షాక్ అవుతుంది. విక్కీ ని అంతే చూస్తూ ఉండిపోతుంది.

Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights
Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights

అందరి ముందు పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..

పద్మావతి నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్న నా భార్య, తనని మీరు ఏదైనా బాధ పెడితే నేను సహించలేను. తన మనసుని మీరు నొప్పించిన తనకు కష్టం కలిగించాలని మీరు చూసిన, నేను మాత్రం సహించలేను అని అంటాడు విక్కి. మా ఇద్దరికీ పెళ్లి అయింది అని చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. అంతేకానీ నా ముందే నా భార్యని అవమానించడానికి కాదు, మీకు ఇష్టమైతే మమ్మల్ని ఆశీర్వదించండి లేదంటే అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి థట్స్ ఇట్ అని అరుస్తాడు. మా విక్కి అన్నమాట తప్పుగా అర్థం చేసుకోకండి. తనకి తన భార్య మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి అలా మాట్లాడాడు అని అరవింద అంటుంది. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఎవరేమంటారు ఆశీర్వదించడమే అని అంటారు. పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరి ముందు విక్కీ దాని గురించి ఎలా మాట్లాడినందుకు.అందరూ వచ్చి పద్మావతి విక్కి లను ఆశీర్వదిస్తారు. మాయ వాళ్ళ అమ్మ చాలా కోపంగా విక్కీ దగ్గరికి వచ్చి ఆశీర్వదించేసి గిఫ్ట్ ఇచ్చే వెళ్ళిపోతుంది.

Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights
Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights

పద్మావతి ఆలోచన..

రిసెప్షన్లో అందరి ముందు పద్మావతి గురించి విక్కీ పాజిటివ్ గా మాట్లాడడం, విడిగా ఆరు నెలలు కలిసి ఉండమంటాడు అందరి ముందు ఒకలా మాట్లాడుతున్నాడు. ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జలజ వచ్చి, ఆ గిఫ్ట్లు అన్నీ మిమ్మల్ని సంతోషించి ఇచ్చినవి కాదు, మా మీద సానుభూతితో ఇచ్చిన గిఫ్ట్ లు అవన్నీ, మీరేం మాట్లాడుతున్నారండి అని అంటుంది పద్మావతి. నేనిప్పుడు అన్న దాంట్లో తప్పేముంది నువ్వు ఆస్తి కోసమే కదా ఈ పెళ్లి చేసుకున్నావు. వచ్చిన వాళ్ళందరూ కూడా అదే కదా అంది అని అంటుంది. పదేపదే అలా మాట్లాడకండి నేను ఆస్తి కోసమే రాలేదు. విక్కిరి నీ వైపు తిప్పుకొని నువ్వు తన చేత, నువ్వు కావాలనే తాళి కట్టించుకున్నావు అని అంటుంది.

Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights
Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights

పద్మావతి మీద ఇష్టాన్ని ప్రదర్శించిన శాంతాదేవి..

జలజ, పద్మావతి తో గొడవ పడుతూ ఉండగానే,అక్కడికి అరవింద, శాంతాదేవి వస్తారు.ఎందుకు పిన్ని ఇప్పుడు అయింది చాల్లేదనే మళ్లీ నువ్వు కొత్త గొడవలు పెడుతున్నావు అని అంటుంది అరవింద. మాట్లాడాలి ఇలానే మాట్లాడాలి నీకు తెలియదా అవ్విందా వీళ్ళు కావాలని ఇలా చేశారు. ఏ అత్తయ్య నేను అన్న దాంట్లో ఏమన్నా తప్పు ఉందా అని శాంతాదేవితో అంటుంది. ఏరోజైనా విక్కీ ఇలా మాట్లాడాడ ఇలా మాట్లాడాడు అంటే కారణం ఈ పద్మావతి కదా అని అంటుంది. ఈరోజు మనవికి మనం మాట వినట్లేదు అంటే అది ఈ అమ్మాయి వల్లే కదా కాదని ఎవరైనా అంటారా, చెప్పండి అని శాంతాదేవితో అంటుంది. శాంతాదేవి కూడా నిజమే, వికీల మారిపోవడానికి కారణం పద్మావతి. మన గురించి మన కుటుంబం గౌరవం గురించి ఎప్పుడూ ఆలోచించే విక్కి ఈ అమ్మాయి కోసం మన కుటుంబ గౌరవం పోయే పనులు చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ వెళ్లిపోమనడం కూడా, నాకు అసలు నచ్చలేదు అదంతా ఈ పద్మావతి వల్లే అని అంటుంది.అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు.

Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights
Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights

మేమిద్దరము ఇష్టపడే పెళ్లి చేసుకుందాం నానమ్మ, అందులో నాకు ఎటువంటి ప్రాబ్లం కనిపించట్లేదు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే అది నా ప్రాబ్లం కాదు. ఇకపై ఎప్పుడూ ఇలాంటివి రిపీట్ చేయకండి నేను కూడా ఇలానే రియాక్ట్ అవుతాను. అని అక్కడి నుంచి చెప్పేసి వెళ్లిపోతాడు. చూశారా అత్తయ్య విక్కీ మాటల్లోనే ప్రవర్తనలోనూ చాలా తేడా వచ్చింది. పిన్ని ప్లీజ్ దీని గురించి వదిలేయండి అని అంటుంది అరవింద. ఏదో మనవాళ్ళు అని చెప్పాను. మీకు నేను చెప్పింది నచ్చకపోతే వదిలేయండి. నేనువెళ్లొస్తాను అని జలజ బయలుదేరుతుంది. ఎందుకు పిన్ని కుచ్చులు పిన్ని వచ్చేదాకా ఉండండి అని అంటుంది అరవింద. నాకు ఊర్లో చాలా పనులు ఉన్నాయి అమ్మ, మళ్లీ వస్తానులే అని అంటుంది జలజ. వెలుతూ వెళ్తూ పద్మావతికి వారిని ఇచ్చి వెళ్తుంది. నువ్వు అనుకున్నట్లే అంతా జరుగుతుందని సంతోషంగా ఫీల్ అవ్వకు, నిన్ను సాధించడానికి మా అక్క కుచలా ఉంది తను వస్తుంది అని చెప్పేసి వెళ్తుంది.పద్మావతి నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అని అంటుంది. నానమ్మ నువ్వు విక్కీ అన్నమాట ని పట్టించుకోకు అని అరవిందా అంటుంది. దేవుడా తొందరగా ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని స్వామి అని అరవింద అనుకొని వెళ్తుంది.

Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights
Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights
అందరూ పద్మావతిని అవమానించారని బాధపడిన అను..

అని రూమ్ లోకి వచ్చి చాలా కోపంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ మా అమ్మానాన్నలని అన్నారు. అసలు మా అమ్మ నాన్నలు ఇందులో ఎందుకు వస్తారు వాళ్ళకి ఏం తెలుసు అని అలా మాట్లాడారు. అమాయకురాలైన మా పద్మావతిని మా అమ్మ నాన్నని అనడానికి వాళ్ళు ఎవరు, అను కోపంగా ఉంటుంది అప్పుడు అక్కడికి ఆర్యా వస్తాడు. ఎందుకు అను అంత కోప్పడుతున్నావు అని అంటాడు. వాళ్లెవరు అండి మా అమ్మ, నాన్నని పద్మావతిని అనడానికి అని అంటుంది. చెప్పకుండా పెళ్లి చేసుకున్నంత మాత్రాన దానిలో తల్లిదండ్రి పాత్ర ఉన్నట్టేనా, మా పద్మావతి అమాయకురాలు, తను ఎంత బాధ పడుతుంది. ఉన్నంతలో మా అమ్మ నాన్న మమ్మల్ని బాగా పెంచారు ఏ రోజు ఒకరి తో మాటలు అనిపించుకోలేదు. అను ప్లీజ్ ఎమోషనల్ అవ్వకు అని అంటాడు ఆర్య. నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు సమాధానం చెప్పు. నిన్ను ఇంట్లో నా తర్వాత అభిమానంగా చూసేది ఎవరు, అరవింద,అమ్మమ్మ గారు, మామయ్య, విక్కీ అని అంటుంది. వీళ్లను ఎవరైనానిన్నేమైనా అన్నారా,నాన్నని ఏమైనా అన్నారా, లేదండి వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏమీ అనలేదు కలలో కూడా అనరు. మరి నువ్వు ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు. అయిన వాళ్ళు ఏమీ అననప్పుడు ఎవరు పరాయి వాళ్ళు అన్నారు అని ఎందుకు బాధపడుతున్నావు. ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్లే వాళ్ళ, మాట నువ్వు పట్టించుకోవాల్సిన పని ఏముంది వాళ్ళు అలా వచ్చి అలా వెళ్తారు. నువ్వు అలా బాధపడితే ఇంకా బాధపడతారు. అందుకే అనవసరమైన మాటలు పట్టించుకోకుండా, మనవాళ్ళు అందరితో సంతోషంగా ఎలా ఉండాలో అలా ఉండు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అను ఒకసారి నవ్వు అని అంటాడు.

Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights
Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights
కృష్ణ కోపం.. విక్కీ తో గొడవ..

కృష్ణ ఉదయం జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. విక్కీ పద్మావతిని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, తనని మీరు ఏమీ అనొద్దు అని విక్కీ అందరికీ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని కృష్ణ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అందరి ముందు పద్మావతి వికీ ఇష్టపడి పెళ్లి చేసుకున్న అని చెప్పిన, ఎవరికి చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు. అడిగితే ఎందుకుమాతో చెప్పట్లేదు పెళ్లి చేసుకున్న విషయం. కచ్చితంగా నా నుంచి పద్మావతి దూరం చేయడానికి చేసుకున్నాడు. నువ్వు చేసిన దానికి, నీ మీద నేను అంతకన్నా ఎక్కువ పగే తీర్చుకుంటాను. అనుకొని పక్కకు తిరిగేలోపే, విక్కీ కృష్ణ ఎదురుగా వచ్చి నిలబడతాడు. అరవింద కూడా ఫోన్ చార్జింగ్ పెట్టుకోవడం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నాకు తెలుసు రా నీ గురించి, ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నువ్వు మారవు, చేయొద్దన్న పని చేస్తున్నావు, అని కృష్ణ తో అంటాడు విక్కీ. నీకు అసలు బతకాలని లేదా ఎందుకు మళ్ళీ మళ్ళీ మా గురించి ఆలోచిస్తున్నావు. అని అంటాడు విక్కీ. ఏంట్రా ఒకప్పుడు బావగారు అని పిలిచే వాడివి ఇప్పుడేంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు మీ అక్క నా భార్య ఆ విషయం నువ్వు మర్చిపోయావా అనిఅంటాడు కృష్ణ.అయితే ఏంటి బెదిరిస్తున్నావా,మహా అయితే తనకి నా గురించి బ్యాడ్ గా చెప్తావ్ అంతే కదా, అలా కాదు నీ తనని ఏమైనా చేయాలని చూశావో, నా విశ్వరూపం చూస్తావు జాగ్రత్త అని అంటాడు విక్కి. పరిస్థితి అంతదాకా వస్తే నేను చూస్తే ఎందుకు కోరుకుంటాను తాడోపేడో తేల్చేస్తాను అని అంటాడు కృష్ణ. నీకు అంత దమ్ము ధైర్యం ఉందా, పద్మావతి నా కాకుండా చేశావు నేను కోరుకున్న లైఫ్ నాకు లేకుండా చేశావు, మీ అక్క నేను వదిలేస్తానని పద్మావతి నాకు దూరం చేశావు కదా, పద్మావతి నువ్వు పెళ్లి చేసుకున్న అందుకే కదా నా మీద పగతోనే కదా అని విక్కీ కాలర్ పట్టుకుని అడుగుతాడు కృష్ణ. నీకెంత ధైర్యం ఉంటే తప్పు చేసి నా కాలరే పట్టుకొని నన్ను నిలదీస్తావా అని అంటాడు. నాలో నువ్వు చూసింది ఒక యాంగిల్, నాకు అడ్డుగా ఎవరైనా వస్తే, నాలో ఇంకో యాంగిల్ బయటకు వస్తుంది అని అంటాడు కృష్ణ.

Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights
Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights

వాడి వెనక బయటకు వస్తే నువ్వు తట్టుకోలేవు విక్కీ అని అంటాడు. అదే గనుక జరిగితే నేను నీ అంత చూస్తాను. చూద్దాం ఎవరెవరుంది చూస్తారో అని అంటాడు విక్కీ.. అప్పుడే అక్కడికి అరవింద వస్తుంది. వెంటనే ఇద్దరు కాలర్ పట్టుకున్న వాళ్ళు వదిలేసేసి, పెళ్లయిన తర్వాత అంతే విక్కీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని అంటారు. ఏంటి ఇద్దరు చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు అడుగుతుంది అరవింద. బావ బతుకు కోరి కదా బావమరిది అందుకే తన జీవితం కూడా బాగుండాలి అని మాట్లాడుకుంటున్నాం అని అంటాడు కృష్ణ. అందరూ అలా మాట్లాడుతుంటే, ఎక్కడ బాధపడతాడు అని తనతో అలా మాట్లాడుతున్నాను రానమ్మ అని అంటాడు కృష్ణ. అసలు ఏమైంది ఇప్పుడు అంటుంది అరవింద. ఏం లేదురా నమ్మ తన భార్యతో ఎలా ఉండాలి. ఎలా ఉంటే తన కాపురం బాగుంటుంది చిన్నచిన్న గొడవలు వస్తే ఎలా సర్దుకుపోవాలో నాకు తెలిసిన సలహాలు అన్ని వికీతో చెప్తున్నాను రానమ్మ అని అంటాడు కృష్ణ. అవునా, అయినా మా గురించినువ్వేం కంగారు పడకు బావ పద్మావతిని ఎలా చూసుకోవాలి ఎలా ఉండాలో నాకు తెలుసు, కానీ నీకే మా అక్కని ఎలా చూసుకోవాలి తెలియడం లేదు అని అంటాడు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా అక్కని చూసుకో అని అంటాడు విక్కీ. అరవింద వైపు చూసి, అంటే నా ఉద్దేశం తాను కడుపుతో ఉంది కదా తన దగ్గర ఉండి, నాకేం కావాలో ఏం కాకుండా చూసుకో, ఏ అక్క ఈ మాత్రం జాగ్రత్త నేను చెప్పకూడదా అని అంటాడు.సరిపోయింది ఇద్దరికి ఇద్దరే, ఇందాక నుంచి మీకు ఫోన్ వస్తుంది తీసుకోండి అని ఫోన్ ఇస్తుంది. సరే పద్మావతి ఎదురుచూస్తుంది విక్కీ నువ్వు వెళ్ళు అని అంటుంది. విక్కీ కోపంగా కృష్ణ చూసి వెళ్ళిపోతాడు. నాకు తెలుసండి మీరు బయటపడరు గాని వికీ పద్మావతి కలిసి ఉండాలని మీకు కూడా అనిపిస్తుంది కదా నా కోరిక కూడా అదేనండి విక్కీ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అంటుంది. వాళ్ళిద్దరూ ఎలా కలిసి ఉండటం నేను చూడలేకపోతున్నాను వీలైనంత త్వరగా ఇద్దరిని విడగొట్టి తీరుతాను అని మనసులో అనుకుంటాడు కృష్ణ.

Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights
Nuvvu Nenu Prema 27 July 2023 today 373 episode highlights

రేపటి ఎపిసోడ్ లో పెళ్లయిన తర్వాత ఆనవాయితీ ప్రకారం, పుట్టింటికి ఆడపిల్లను తీసుకెళ్లాలి కదా నా కూతురు అనుని తీసుకెళ్లడానికి వచ్చాను అని భక్త అంటాడు. పద్మావతి కూడా మీ కూతురే కదా, కాదమ్మా నా కూతురు కాదు. అని భక్త అనేసరికి పద్మావతి ఒకసారిగా షాక్ అవుతుంది..

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri