Paluke Bangaramayenaa Latest Episode: నాయుడు మినిస్టర్ అయి ఇంటికి వస్తాడు. జయంతి హారతి యిచీ మినిస్టర్ గారు కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి అని అంటుంది. మావయ్య గారు మీరు మినిస్టర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కంగ్రాజులేషన్స్ అని విశాల్ అంటాడు. విశాల్ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు కాబట్టి నువ్వు మినిస్ట్రీ అయ్యావు అన్నయ్య అని కళ్యాణి అంటుంది. హంసను చూసి కాకి ఉయ్యారంగా వలకబోసిందట అని జయంతి అంటుంది. ఇప్పుడు ఆ సామెత నాకెందుకు చెప్తున్నారు వదిన గారు అని కళ్యాణి అంటుంది. ఎదుటి వాడి విజయమ్మ వల్లే వచ్చిందని నలుగురు అనుకుంటారు కదమ్మా అందుకే అలా అన్నది అని పార్టీలో కార్యకర్త అంటాడు. అన్నయ్య మీరు మినిస్టర్ అయ్యారు కదా ఇక పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం అని కళ్యాణి అంటుంది.

ఇంక నిశ్చితార్థం కూడా అవలేదు అప్పుడే పెళ్లేంటి అని స్వర వాళ్ళ అమ్మ అంటుంది. ఇంక నిశ్చితార్థం ఏంటి వదిన గారు డైరెక్ట్ గా పెళ్లి చేసేద్దాం అని కళ్యాణి అంటుంది. ఎందుకు త్వరలోనే ఎంగేజ్మెంట్ కు ఏర్పాటు చేస్తాము అని జయంతి అంటుంది. ఎంగేజ్మెంట్ ఏమి అక్కర్లేదు పెళ్లెప్పుడు చేద్దాం చెప్పండి అన్నయ్యగారు అని కళ్యాణి మళ్లీ అంటుంది. ఏంటి పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని కంగారుగా తొందరపడి అంటున్నారు వైజయంతి మాట ఇచ్చింది కదా ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది మీరేం కంగారు పడకండి ముందు ఎంగేజ్మెంట్ ఆ తర్వాతే పెళ్లి అని నాయుడు అంటాడు. అమ్మ నువ్వు ఎక్కువగా లాగకు నిజం తెలిసిపోతుంది అని విశాల్ అంటాడు. కట్ చేస్తే అభిషేక్ స్వర మాట్లాడుకుంటూ ఉండగా ఝాన్సీ అక్కడికి వస్తుంది. ఏంటి ఏమో మాట్లాడుకుంటున్నారు అని ఝాన్సీ అంటుంది.

ఏమీ లేదు ఝాన్సీ విశాల్ చంటి ఒకరేనా అని స్వరికి డౌట్ వచ్చింది ఎందుకంటే విశాల్ ఫోన్లో ఇందు ఫోటో చూసిందట అందుకే కంగారు పడుతుంది అని అభిషేక్ అంటాడు. అవునా అయితే అతను చంట విశాల అని తెలుసుకోవాలి అంటే అతనితో పెళ్లి ఇష్టం లేనట్టుగా ఉండదు ప్రేమగా ఉండి నువ్వే ఆ నిజం ఏంటో తెలుసుకోవాలి లేదంటే ఇందుకీ అన్యాయం జరిగిపోతుంది నువ్వు కూడా బలైపోతావు అని ఝాన్సీ అంటుంది. ఇంతలో ఝాన్సీ వాళ్ళ ఆఫీస్ బాయ్ వచ్చి స్వర మేడం మీ నాన్నగారి మినిస్టర్ అయ్యాడు అంట అని అంటాడు.అవునా మేడమ్ నేను ఒకసారి ఇంటికి వెళ్లి వస్తాను మా నాన్నకు కంగ్రాట్స్ చెప్పాలి చిన్నప్పటినుంచి మా నాన్నగారు మినిస్టర్ కావాలని కోరిక ఈ న్నాళ్ళకి నెరవేరింది నేను వెళ్ళొస్తాను మేడం అని స్వర అంటుంది. స్వర నేను చెప్పింది గుర్తుంది కదా ఏమాత్రం విశాల్ కి డౌట్ రాకుండా చూడు అన్ని ఝాన్సీ అంటుంది.కట్ చేస్తే స్వర వాళ్ళ నాన్నకి కంగ్రాజులేషన్స్ నాన్న మీరు మినిస్టర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని స్వర అంటుంది.

అంకుల్ మీకే కాదు స్వరకి కూడా కంగ్రాజ్ లేషన్స్ చెప్పాలి అని విశాల్ కంగ్రాజులేషన్స్ ఎందుకంటే మీ నాన్నగారు మినిస్టర్ అయ్యగారు ఆ సంతోషం మీ నాన్న కన్నా నీ కళ్ళలోనే ఎక్కువ కనిపిస్తుంది అ విశాల్ అంటాడు. అన్నయ్య గారు ఎంగేజ్మెంట్ కి ముహూర్తం పెట్టి నాకు ఫోన్ చేయండి అని కళ్యాణి కొడుకుని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే బాబాయ్ చంటి గురించి నీకు ఇంకా ఏమైనా ఆధారాలు తెలుసా అతని పేరు చంటి ఇంకా ఏదైనా పేరు ఉందా అని ఝాన్సీ అంటుంది. లేదమ్మా మా అమ్మాయి కూడా చంటి అని పిలిచేది అంతకుమించి నాకు వేరే వివరాలు తెలియవు అని విశ్వం అంటాడు. ఇప్పుడు ఎలా చంటే విశాల్ ని తెలుసుకోవడం అని అభిషేక్ అంటాడు.

నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మీకు చెబుతాను వినండి అమ్మ ఆ చంటి గాడికి ఇప్పుడు రాజకీయవేత్త తోడయ్యాడట వాడికి బల్లగం పెరిగిపోయింది బలం కూడా పెరిగిపోయింది ఇప్పుడు వాడిని ఏమీ చేయలేము అని విశ్వం అంటాడు. అవునా ఎవరు బాబాయ్ అతను అని ఝాన్సీ అంటుంది. ఏమో నాకు తెలియదు అమ్మ ఈ రోజే మినిస్టర్ అయి వచ్చాడంట ఆ మినిష్టర్ కూతుర్నే చంటి పెళ్లి చేసుకోబోతున్నాడు అంట అని విశ్వం అంటాడు. ఈరోజే మినిస్టర్ అయినవాడు స్వర వల్ల నాన్న ఒక్కడే అంటే చంటినే విశాల్ డౌటే లేదు స్వరని ఎలాగైనా కాపాడాలి అభిషేక్ అని ఝాన్సీ అంటుంది. కట్ చేస్తే కీర్తి బర్త్డే దగ్గరికి స్వరా వస్తుంది. రాస్వరా మీ నాన్నగారు మినిస్టర్ అయ్యారు అంట కదా అభిషేక్ చెప్పాడు అని వాళ్ళ బామ్మ అంటుంది. అవునండి మా నాన్నగారి కల ఇన్నాళ్లకు నెరవేరింది ఇంతకీ బర్త్ డే పాప కీర్తి ఎక్కడ అని స్వర అంటుంది. అదిగో కీర్తి వచ్చేస్తుంది అని అభిషేక్ అంటాడు. కీర్తి కిందికి వచ్చి నన్ను ఆశీర్వదించు అన్నయ్య అని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది