Paluke Bangaramayenaa november 6 episode 66: అభిషేక్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిపోతాడు. స్వరమాత్రం వాళ్ళ అమ్మకు చిన్నప్పుడు వేసి ఇచ్చిన డ్రాయింగ్ పట్టుకొని అలా చూస్తూ ఏడుస్తూ నిలబడి అమ్మ నాన్న నువ్వు నేను కలిసి ఇలా సంతోషంగా ఉందామనుకున్నాను కానీ నాకు నీ ప్రేమ నీ దూరం చేసిన వాళ్లు ఎవరో నాకు తెలియదు కానీ నిన్ను నన్ను దూరం చేసి నన్ను చాలా బాధ పెడుతున్నారు అని ఆ డ్రాయింగ్ చూసుకుంటూ ఏడుస్తు స్వర ఉండగా. గాలి వచ్చే తన చేతిలో డ్రాయింగ్ కొట్టుకుపోయి పూజ మందిరంలో పడుతుంది. దశ దిశ కర్మ కూడా అవలేదు పూజా మందిరంలోకి ఎలా వెళ్ళను అని స్వర అక్కడే నిలబడి చూస్తూoది. అటుగా వెళుతున్న కీర్తి స్వరని చూసి ఏంటి స్వర ఇక్కడ నిలబడ్డావు దేవుడికి దండం పెట్టుకుందాంమని వచ్చావా అని కీర్తి అంటుంది. ఏమీ లేదు కీర్తి నేను గుడిలోకి వెళ్ళకూడదు దేవుడి దగ్గర ఒక కాగితం పడింది అది తీసుకురావాలి అని స్వర అంటుంది.
నువ్వు వెళ్లకూడదు కానీ నేను వెళ్లొచ్చు కదా అని కీర్తి నేను తీసిస్తాను ఉండు స్వరా అని కీర్తి లోపలికి వెళ్లి ఆ డ్రాయింగ్ తెచ్చి ఇస్తుంది. అప్పుడు స్వర కీర్తిని దగ్గరికి తీసుకొని తన మీద పడి ఏడుస్తుంది.కట్ చేస్తే, రంగరాజు శాసనసభలో ఏం జరిగింది నా రాజీనామను తీసుకున్నారా సభ్యులు ఎవ్వరు వద్దనే చెప్పలేదా అని నాయుడు అంటాడు. ఎవరు అంటారు నాయుడు సీటు ఒకటి కాళీ అయింది అంటే నాకు కావాలంటే నాకు కావాలి అని పోటీ పడతారు కానీ ప్రత్యక్ష అభ్యర్థికి ఇవ్వమని ఎవరంటారు చెప్పు నీ మీద నింద పడటంతో అందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నారు అని రంగరాజు అంటాడు. బావ ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు నీ స్థానంలో వేరే వాళ్ళు నిలబడే బదులు నేనే నిలబడతాను ఏమంటావు బావ అని వైజయంతి నాయుడుని అడుగుతుంది.
ఏమి అవసరం లేదు నా మీద నింద పోయాక నేనే నిలబడతాను నాకోసం ఇంకెవరు నిలబడాల్సిన పనిలేదు వచ్చే ఎలక్షన్ల కోసం భార్యని చంపానని అందరూ అనుకుంటున్నారు ఇక నిన్ను నిలబడితే భార్యని నిలబెట్టి తను గెలిచాడని నన్ను నానా మాటలని అవమానిస్తారు ఇప్పుడు పడుతున్న అవమానం చాలు నాకోసం నువ్వు ఏమి కష్టపడొద్దు నీకు రాజకీయం ఇష్టమైతే నువ్వే నిలబడు కానీ నా పేరు చెప్పి నువ్వు నాకోసం నిలబడకు అని నాయుడు అంటాడు. ఆవేశపడకుండా నేను చెప్పేది ఒక్కసారి విను బావ అని వైజయంతి ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. చూడు ఆఫీసర్ ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది నేను నిర్దోషిని తెలియడానికి చూసావా ఇంట్లో బయట ఎలా అవమానం జరుగుతుందో త్వరగా చేయండి లేదంటే మానసికంగా కుమిలి కుషించిపోతాను అని నాయుడు వెళ్ళిపోతాడు. అక్కడే అభిషేక స్వరా నిలబడి వాళ్ళ మాటలన్నీ వింటూ చూస్తూ నిలబడతారు. ఆ మాటలు విన్న రంగరాజు ఏమి మాట్లాడకుండా తన ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, విశాల్ ఝాన్సీ ని చంపడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు.
వాళ్ల ఇంట్లోకి వెళ్లి నా విశాల్ ముందు మెయిన్ బంద్ చేస్తాడు కరెంటు పోయింది ఉండమ్మా లైటర్ తెస్తానని కాంతా బాయ్ వెళ్లిపోతుంది. కొద్దిసేపటి తర్వాత కా తాబాయి కాంతా బాయ్ అంటూ ఝాన్సీ ఇల్లంతా వెతుకుతుంది. కాంతా బాయ్ రాదు తనను నిద్రపుచ్చాను అని విశాల్ ముసుగేసుకుని అంటాడు. ఎవరు నువ్వు విశాల్వే కాదు అని ఝాన్సీ అంటుంది. నిన్ను చంపడానికి వచ్చాను ఈరోజు నువ్వు ఎలాగైనా చావాల్సిందే నా చేతిలో అని విశాల్ అంటాడు. భయంతో ఝాన్సీ విషయాల్ని పక్కకు నెట్టేసి వేరే గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకుంటుంది. ఝాన్సీ నా చేతిలో నుంచి తప్పించుకోలేవు అని విశాల్ తలుపు కొడుతూ ఉంటాడు. డోర్ ఎక్కడ వస్తుందోనని తన చేతిలో పూల కుండీ పట్టుకొని విశాల్ బయటికి వస్తే కొడదామని ఝాన్సీ అనుకుంటూ ఉండగా డోర్ తీసుకొని అభిషేక్ వస్తాడు. తనే విశాల్నుకునే ఝాన్సీ పూలకుండి పైకి లేపి తనమీద వేయబడుతుంది.
ఝాన్సీ చెయ్యి పట్టుకొని అభిషేక్ ఏంటి ఝాన్సీ ఏమైంది ఎందుకు ఇలా భయపడుతున్నావు ఏం జరిగింది అని అంటాడు. అభి ని చూసిన ఝాన్సీ తన మీద పడి ఏడుస్తూ విశాల్ నన్ను చంపడానికి వచ్చాడు అని ఝాన్సీ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఫోను కార్లో ఉండిపోయింది ఝాన్సీ అందుకే నేను చూసుకోలేదు ఆ తర్వాత వెళ్లి చూస్తేనే ఫోన్ కాలు ఉంది మళ్లీ ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయడం లేదు అందుకే ఏం జరిగి ఉంటుందని తొందరగా వచ్చేసాను ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు ఝాన్సీ నిన్ను l చంపడానికి విశాల్ వస్తాడని తెలుసు తప్పంతా నాదే ఝాన్సీ నిన్ను సేఫ్టీలో ప్లేస్ లోపెట్టకుండా ఇక్కడే ఉంచి చాలా పెద్ద తప్పు చేశాను అని అభిషేక్ ఝాన్సీ ని తీసుకొని వెళ్ళిపోతాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Brahmamudi: బ్రహ్మ ముడి అప్పుతో కళ్యాణ్ వివాహం.. ఎలానో తెలిస్తే షాక్..!