NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 16 2023 Episode 1127: ఆర్య వర్ధన్ ని కలవడానికి వెళ్తున్న హరీష్ దివ్య..

Prema Entha Madhuram Today Episode December 16 2023 Episode 1127 Highlights

Prema Entha Madhuram December 16 2023 Episode 1127: ఉష ఈ చీర తీసుకువెళ్లి రాధా కి ఇచ్చి రా అని సుగుణ చెప్తుంది. అమ్మ నేను ఇవ్వడం దేనికి తీసుకున్న అన్నయ్య ఇస్తాడు తనను తీసుకువస్తాను అని ఉష అంటుంది. ఇగో చిన్న మరదలా నీ వయసుకు తగ్గ పనులు చెయ్యి ఆడవాళ్ళకి ఆడవాళ్లు చీర ఇవ్వాలి కానీ మీ అన్నయ్యతో ఇప్పియడమేంటి తను చాలా ఇబ్బంది పడుతుంది అని యాదగిరి అంటాడు. బావగారు మనమందరం ఇక్కడ ఉంటే తను ఒక్కతి మాత్రం గదిలో ఉండి ఏం చేస్తుంది ఉండండి నేను తీసుకొస్తాను అని ఉష వెళ్తుంది. ఉష మాటలు విన్న అను గబగబా పరిగెత్తికెళ్ళి తన గదిలో కూర్చుంటుంది. రాధ గారు మా అన్నయ్య మీ కోసం చీర తీసుకొచ్చాడు ఇస్తాడంట రండి అని పిలుస్తుంది. ఉష ఇప్పుడు ఏం అవసరం లేదులే నేను తర్వాత తీసుకుంటాను అని అను అంటుంది. మీకు ఇంత మొహమాటం ఏంటండీ  మీరు రండి అని ఉష బలవంతంగా తీసుకువస్తుంది అనుని.

Prema Entha Madhuram Today Episode December 16 2023 Episode 1127 Highlights
Prema Entha Madhuram Today Episode December 16 2023 Episode 1127 Highlights

అయ్యో మేడం వచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి అని కంగారు పడిపోయి యాదగిరి కరెంటు ఆఫ్ చేసేస్తాడు. అను మూసుకు వేసుకొని హాల్ లోకి వస్తుంది. రండి రాధా గారు మా అన్నయ్య చీరిస్తాడు అంటూ తీసుకువస్తుంది ఉష. ఇంతలో కరెంటు పోతుంది ఒక్కసారి అను ఊపిరి పీల్చుకుంటుంది. కరెంటు ఈ సమయంలో పోయిందేంటి చీరలు చూసుకోకుండా అని దివ్య  అంటుంది. కరెంటు తీసేసిన వాడి చెయ్యి విరిగిపోను కాళ్లు పడిపోను చీరలు చూసుకొని ఇవ్వకుండా ఎప్పుడు కరెంటు తీసేశాడు అని జ్యోతి తిడుతుంది. ఒసేయ్ సొంత మొగుడి కాళ్లు చేతులు పడిపోవాలని తిడతావా నీకు పుట్టగతులు ఉండవే అని యాదగిరి కరెంట్ దగ్గర ఉండి అంటాడు. నాన్న ఆర్య ఇప్పటంతల కరెంటు వచ్చేలా లేదు చీర రాధకు ఇచ్చే వెళ్ళిపోతుంది అని సుగుణ చెప్తుంది.అలాగే అమ్మ అని ఆ చీకట్లో అనుని చూడకుండానే చీర ఇచ్చేస్తాడు ఆర్య.

Prema Entha Madhuram Today Episode December 16 2023 Episode 1127 Highlights
Prema Entha Madhuram Today Episode December 16 2023 Episode 1127 Highlights

ఆ చీర తీసుకొని వెళ్ళిపోతుంది అను. తన రూమ్ లోకి వెళ్లి ఆ చీరలు తీసి చూసుకుంటుంది. కట్ చేస్తే, హలో బాబాయ్ ఎలా ఉన్నావు అని హరీష్ అడుగుతాడు. హలో హరీష్ నీకు పెళ్లి కుదిరింది అంట కదా అమ్మాయిని ఎప్పుడు చూపిస్తావ్ రా అని వాళ్ళ బాబాయ్ అంటాడు. కాంట్రాక్టర్ పని మీద ఆర్య వర్ధన్ ఇండస్ట్రీకి వస్తున్నాను అక్కడికి తనని తీసుకువచ్చి పరిచయం చేస్తాను బాబాయ్ అని హరీష్ అంటాడు. కట్ చేస్తే, దివ్య రెడీ అయ్యావా మనం బయటికి వెళ్లాలని చెప్పాను కదా అని హరీష్ అంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు దివ్య అని ఆర్య అడుగుతాడు. దివ్య నిన్ను బయటికి తీసుకువెళ్లాలంటే మీ ఇంట్లో వాళ్లకి చెప్పాలా అని హరీష్ అంటాడు. కనీసం అమ్మకైనా చెప్పాలి కదా హరీష్ అని ఆర్య అంటాడు. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు మనం వెళ్దాం పద హరీష్ అని దివ్య అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 16 2023 Episode 1127 Highlights
Prema Entha Madhuram Today Episode December 16 2023 Episode 1127 Highlights

ఇగో మరదలా ఇవ్వాళ రేపట్లో పెళ్లి కావాల్సిందని వి ఇలాగేనా మాట్లాడేది మీ అన్నయ్యకి మర్యాద ఇవ్వట్లేదు ఇక అత్తవారింట్లో ఎలా ఉంటావు అని యాదగిరి అంటాడు. అలా గడ్డి పెట్టేయ దనికి ఎంత చెప్పినా మారడం లేదు ముక్కు మీద కోపం తెచ్చుకుంటుంది అని సుగుణ అంటుంది. సారీ అత్తయ్య నేనే మీకు చెప్పాల్సింది అని హరీష్ అంటాడు. బావగారు ఫంక్షన్ హాల్ బుక్ చేశారా అని హరీష్ అంటాడు. ఆ పని మీదే బయటికి వెళుతున్నాను హరీష్ అని ఆర్య వెళ్ళిపోతాడు. అది సరే మీరు ఏ పెద్ద కంపెనీనీ కలవడానికి వెళ్తున్నారు అని యాదగిరి అంటాడు. ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తున్నాం అని హరీష్ అంటాడు. అలాంటి ఇండస్ట్రీలు వీళ్ళకి చెప్తే ఏం అర్థం అవుతాయిలే హరీష్ వెళ్దాం పద అని దివ్య అంటుంది. చూశారా మేడం దేవుడితో పని ఉండి కళ్ళ ముందు ఉన్నా దేవుని పట్టించుకోవడం లేదు అని యాదగిరి అంటాడు.ఆ దేవుడి విలువ ఎప్పుడు వీలు అర్థం చేసుకుంటారో అని అను అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 16 2023 Episode 1127 Highlights
Prema Entha Madhuram Today Episode December 16 2023 Episode 1127 Highlights

మీరే మీ ఫిగర్ చేయకండి మేడం ఆరోజు తొందరలోనే వస్తుంది అని యాదగిరి అంటాడు. కట్ చేస్తే, ఏంటి గత ఆరు నెలలుగా మన కంపెనీ లాస్ లో నడుస్తుంది అసలు ఏమైంది కంపెనీకి అని నిరాజ్ అంటాడు. నేను ఇదే విషయం ఆర్యతో చెబుదాం అనుకున్నాను సార్ కానీ కుదరలేదు అని జెండి అంటాడు. వెంటనే మీటింగ్ ఏర్పాటు చెయ్యి దాదాని రమ్మని ఫోన్ చెయ్యి అని నిరాజ్ అంటాడు. అలాగే సార్ అని జెండి ఆర్య కి ఫోన్ చేసి అర్జెంటుగా మీటింగ్ ఉంది సార్ మీరు ఒకసారి ఆఫీస్ కి వచ్చి వెళ్ళండి అని చెప్తాడు. అలాగే జెండి వస్తున్నాను అని ఆర్య ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే, దివ్య హరీష్ ఆర్య వర్ధన్ ఇండస్ట్రీకి వస్తారు. వాచ్మెన్ వాళ్ళని వెళ్ళనీయకుండా బయటే నిలబెడతాడు. మా బాబాయ్ ఇదే కంపెనీలో పని చేస్తున్నాడు ఆయనతో మాట్లాడదామని వచ్చానండి అని హరీష్ అంటాడు. మీ బాబాయికి ఫోన్ చేయండి మాట్లాడక పంపిస్తాను అని వాచ్మెన్ అంటాడు. తన ఫోను కలవట్లేదు అని హరీష్ అంటాడు. అయితే రిసెప్షన్ దగ్గర కూర్చోండి ఫోన్ కలిశాక నాకు చెప్పండి నేను పంపిస్తాను అని వాచ్మెన్ అంటాడు. అలాగే అని వాళ్ళు వెళ్లి అక్కడ కూర్చుంటారు.ఇక్కడే మా బాబాయి పని చేస్తున్నాడు దివ్య ఆర్య వర్ధన్ సార్ ని కలవాలంటే రెండు నెలల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి అలాంటిది మనకు బాబాయ్ ఉండడంతో ఈరోజే ఆయనను కలిసె అదృష్టం కలుగుతుంది అని హరీష్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 16 2023 Episode 1127 Highlights
Prema Entha Madhuram Today Episode December 16 2023 Episode 1127 Highlights

ఎంత పెద్దగా ఉందండి ఈ ఆఫీసు అని దివ్య ఆశ్చర్య పోతుంది. కట్ చేస్తే ఆర్య ఆఫీస్ కి వచ్చేస్తాడు. ఆర్య వర్ధన్ సార్ వచ్చేసాడు అని వాచ్మెన్ అంటాడు. ఆఫీస్ స్టాప్ అంతా వెళ్తూ ఉండగా అందులోనే ఆర్య కూడా వెళ్ళిపోతాడు. ఆర్య వర్ధన్ ని చూద్దామని దివ్య హరీష్ అందులో వెతుకుతారు కానీ ఆర్య కనిపించడు వాళ్ళ బాబాయ్ ని పిలుస్తాడు హరీష్. హరీష్ ఇప్పుడు మాట్లాడడం కుదరదు నాకు అర్జెంటు పని ఉంది నేను తర్వాత వచ్చి కలుస్తాను ఇక్కడే కూర్చోండి అని వాళ్ళ బాబాయ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మీటింగు జరుగుతుంది. దాదా రాజనందిని చీరల మార్కెట్ స్టాపు రోజురోజుకీ పడిపోతుంది అందులో లాస్ అవుతున్నాం అని నీరజ్ చెప్తాడు. మనం లాస్ అవుతున్నామంటే ఎదుటివాడికి ప్రాపర్టీ వస్తుందనే కదా అర్థం అది ఎలా జరుగుతుందో నాకు రెండు రోజుల్లో తెలి అని ఆర్య అంటాడు. సార్ మన వాళ్ళు ఆ పని మీదే ఉన్నారు మీకు రెండు రోజులలో ఆ డీటెయిల్స్ అంత ఇస్తారు అని జెండి చెప్తాడు. స్టాప్ అందరితో ఆర్య మాట్లాడతాడు మీటింగు అయిపోతుంది. సారీ దాదా కంగారు పడిపోయే నిన్ను అర్జెంట్గా రమ్మన్నాను అని నిరాజ్ అంటాడు.  ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు అందులో ఒడిదుడుకులు సహజం దానికి కంగారు పడిపోతే మన ముందుకు సాగలేము ఒకసారి లాభాలు వస్తాయి ఒకసారి నష్టాలు వస్తాయి అందుకని మనం వెనకడుగు వేయకూడదు అని ఆర్య అంటాడు. ఇంతలో సుగుణ ఫోన్ చేసి నాన్న కళ్యాణమండపం దొరికిందా అది అడుగుదామనే ఫోన్ చేశాను అని అంటుంది.

రెండు మూడు చూశానమ్మా అవి ఆల్రెడీ బుక్ అయిపోయాయి ఇంకొకటి చూసి వస్తాను అని ఆర్య అంటాడు. నాన్న ఎక్కువ రేట్లో ఫంక్షన్ హాల్ చూడకురా మన చేయి అందగలిగే అంతే చాపాలి లేదంటే కిందపడిపోతాం అని సుగుణ అంటుంది. లేదమ్మా మనకు తగ్గట్టే చూస్తాను అని ఆర్య అంటాడు. సరే ఆర్య ఏదైనా అవసరం ఉంటే నీకు ఫోన్ చేస్తాను అని జెండి అంటాడు. కట్ చేస్తే. ఇంత పెద్ద కంపెనీలో సాలరీ చాలా ఎక్కువే ఉంటుంది కదా అండి అని దివ్య అంటుంది. అందుకే మా బాబాయి బాగా డబ్బులు సంపాదించాడు ఈ ఆర్య వర్ధన్ ఇండస్ట్రీలు ఎన్నో ఉన్నాయి అనాధ సంస్థలు అన్ని ఉన్నాయి ఆర్యా సార్ ఫ్యామిలీ నాలుగు తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి ఉందంట అని హరీష్ అంటాడు. అమ్మో అంత ఆస్తి ఉందా అని దివ్య షాక్ అవుతుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri