NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri December 16 2023 Episode 102: నిషికను కొట్టిన ధాత్రి, క్షమాపణ చెప్పమంటున్న నిషిక వాళ్ళ అమ్మ..

Jagadhatri Today Episode December 16 2023 Episode 102 Highlights

Jagadhatri December 16 2023 Episode 102:  కళ్ళకు గంతలు ఉండడంతో కీర్తి చూసుకోకుండా చీర మీద కాలు వేసి తొక్కిస్తుంది. అది చూసినా నిషిక కీర్తిని లాగిపెట్టి  చెంప మీద కొడుతుంది. ఆ దెబ్బకి కింద పడిపోయి తలకి దెబ్బ తగులుతుంది కీర్తికి. ధాత్రి కేదార్ పరిగెత్తుకొచ్చి కీర్తిని లేపుతారు. నిషిక నువ్వేం చేస్తున్నావ్ నీకు అర్థం అవుతుందా చిన్న పిల్ల తను అని ధాత్రి అంటుంది. అది చేసిన పనికి కొట్టాలా చంపాలా చెవిటి మొహం దాన్ని అని నిషిక అంటుంది. ఆ మాటకి ఎక్కడలేని కోపం వస్తుంది రాత్రికి నిషిక చంప చెడేమనిపిస్తుంది. ధాత్రి నన్ను కొడతావా ఆ పిల్ల చేసిన తప్పుకి అని నిషిక అంటుంది. నువ్వు చేసిన పనికి కొట్టాలా చంపాలా ఒక్క దెబ్బతో సరిపెట్టాను అని ధాత్రి అంటుంది.ఎదుటి వాళ్ళ లోపాన్ని ఎత్తి చూపించి ఆనందించే మనిషితో ఎంత మాట్లాడిన వేస్ట్ అని కౌశిక కీర్తిని తీసుకొని వెళుతుంది. చూసావా అత్తయ్య ఈ దాత్రిమో నన్ను కొట్టింది మీ కూతురేమో నోటికి వచ్చినట్లు మాట్లాడి వెళ్ళిపోతుంది ధాత్రి నన్ను కొడతావా మా అమ్మతో చెప్తాను ఉండు అని నిషిక కోపంగా వెళ్ళిపోతుంది. ఇదిగో ఆమె ఎంతైనా నువ్వు చేయ్యోతడం తప్పు అని వాళ్ళ అత్తయ్య వెళ్ళిపోతుంది. ధాత్రి నువ్వు చేసింది తప్పు ఇంట్లో వాళ్ళు నిన్ను ఒక మాట అంటేనే కేదార్ ఊరుకోడు అలాంటిది నా కళ్ళ ముందే నా భార్యను కొడతావా నువ్వు అని యువరాజ్ అంటాడు. ఆరోజు ధాత్రి తప్పు ఏమీ లేదు కాబట్టి నేను మాట్లాడాను ఈరోజు నిషిక చేసింది తప్పు కాబట్టి దాత్రి చేయి చేసుకుంది అని కేదార్ అంటాడు. ఏదేమైనా నువ్వు చేసింది తప్పు ధాత్రి అంటూ వెళ్ళిపోతాడు యువరాజ్. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 16 2023 Episode 102 Highlights
Jagadhatri Today Episode December 16 2023 Episode 102 Highlights

వీళ్ళ సంగతి చెప్తాను మా అమ్మకి ఫోన్ చేసి అమ్మను రమ్మంటాను అని అంటుంది నిషిక. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు వస్తే పెద్ద గొడవ అవుతుంది వద్దు అని యువరాజ్ అంటాడు. అలా ఎన్ని రోజులని సర్ది చెప్పుకుంటాం రా ఆ కౌశిక అండ చూసుకొని ధాత్రి రెచ్చిపోతుంది నువ్వు మీ అమ్మకి ఫోన్ చెయ్ అమ్మ ఏదైతే అదే అవుతుంది అని వాళ్ళ అత్తయ్య అంటుంది. నిషిక వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. హలో నిషిక ఏంటి అలా మాట్లాడుతున్నావ్ ఏమైంది అని అడుగుతుంది వాళ్ళ అమ్మ. ధాత్రి నన్ను కొట్టింది అమ్మ అని ఏడుస్తూ చెప్తుంది నిషిక. దానికి ఎంత ధైర్యం ఉంటే నిన్ను కొడుతుంది అసలు ఏం జరిగింది అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. జరిగిన విషయం అంత చెప్తుంది. సరే నేను వెంటనే బయల్దేరి వస్తున్నాను ఉండు అని వాళ్ళ అమ్మ అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 16 2023 Episode 102 Highlights
Jagadhatri Today Episode December 16 2023 Episode 102 Highlights

ధాత్రి దాత్రి అంటూ పిలుచుకుంటూ వస్తుంది నిషిక వాళ్ళ అమ్మ. అందరూ హాల్లోకి వస్తారు. ధాత్రి మాకు చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న పోనీలే ఆడపిల్ల రోడ్డు మీద పడుతుందని ఊరుకున్నాను నా కూతురు అత్తవారింటికి వచ్చి నువ్వు ఇక్కడ ఉండి పెత్తనం చాలా ఇస్తున్నావా నా కూతుర్ని ఎందుకు కొట్టావే అని అడుగుతుంది నిషిక వల్ల అమ్మ. నిషిక తప్పు చేసింది పిన్ని అందుకే కొట్టాను అని ధాత్రి అంటుంది. అయినా తప్పు చేస్తే వాళ్ళ అత్తయ్య ఉంది వాళ్ళ భర్త ఉన్నాడు ఇంటి పెద్దలు ఉన్నారు నువ్వు ఎవరే తనని కొట్టడానికి అని వాళ్ల పిన్ని అంటుంది. నా చెల్లి తప్పు చేస్తే ఒక అక్కగా సరిదిద్దుదామనుకున్నాను పిన్ని అని ధాత్రి అంటుంది. అసలు నీకు మాటలతో కాదే అని ధాత్రి మీదికి చేయలేరుతుంది వాళ్ళ పిన్ని. కేదార్ తన చెయ్యి పట్టుకుంటాడు. అత్తయ్య నిషిక తప్పు చేసింది అందుకే ధాత్రి చేయి చేసుకుంది మీరు సర్ది చెప్పాల్సింది పోయి తనను కొడతారా అని కేదార్ అంటాడు. నీ భార్య మీద చెయ్యి వెయ్యబోతేనే అడ్డుకున్నావు అలాంటిది నా కూతురుని ఎలా కొడుతుంది రా నీ భార్య అయినా నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అని ధాత్రి వాళ్ళ పిన్ని అంటుంది. అత్తయ్య నిజా నిజాలు తెలుసుకోకుండా మీరు నిందిస్తే బాగోదు అని కౌశికి అంటుంది. పిన్ని కేదార్ మన ఇంటి అల్లుడు వాడు వీడని మాట్లాడకండి మర్యాద ఇచ్చి మాట్లాడు అని దాత్రి అంటుంది.

Jagadhatri Today Episode December 16 2023 Episode 102 Highlights
Jagadhatri Today Episode December 16 2023 Episode 102 Highlights

వీడు నాకు అల్లుడు ఏంటే వీడికి నేను ఎందుకు మర్యాద ఇస్తాను ఇదిగో కౌశిక నా కూతురు ఇంట్లో ఉండాలి అంటే ఈ ధాత్రినా కూతురికి క్షమాపణ చెప్పాలి అని వాళ్ళ పిన్ని అంటుంది. అయితే నా నిర్ణయం కూడా వినండి అత్తయ్య ధాత్రి ఏ తప్పు చేయలేదు తను ఎందుకు సారీ చెప్పాలి తను సారీ చెప్పదు అని కౌశిక అంటుంది. వాళ్ల నిర్ణయం వాళ్ళు చెప్పారు నిషిక నీ బట్టలు సర్దుకో మనం ఇంటికి వెళ్ళిపోదాం అని వాళ్ళ అమ్మ అంటుంది. పిన్ని నేను సారీ చెప్పడమే కదా నీకు కావాలి నేను చెప్తాను నిషికను తీసుకువెళ్ళకు అని దాత్రి అంటుంది. తన మాట ఏమీ పట్టించుకోకుండా నీషికాన్ని తీసుకొని పైకి వెళ్తారు. ధాత్రి నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు సారీ చెప్పాలి వాళ్ళు ఎంత చెప్పినా వినరు వెళ్లని అంటాడు కేదార్. నేను క్షమాపణ చెప్పడం వల్ల అందరూ బాగుంటారు అంటే వంద సార్లు నేను క్షమాపణ చెప్తానండి అని ధాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 16 2023 Episode 102 Highlights
Jagadhatri Today Episode December 16 2023 Episode 102 Highlights

పైకి వెళ్లే బ్యాగులన్నీ సర్దుతారు. పిన్ని చెల్లెలికాపురం పాడు చేయకు నేను కావాలంటే సారీ చెప్తాను పిన్ని అని దాత్రి బ్రతిమలాడుతుంది. తన మాటను పట్టించుకోకుండా నెట్టేసి బ్యాగు తీసుకుని కిందికి వచ్చేస్తుంది వాళ్ళ పిన్ని. ధాత్రి నువ్వు ఎంత బ్రతిమిలాడినా వాళ్ల కూతురు వాళ్ళు వినిపించుకోరు నువ్వు ఎందుకు చెప్పు ఇంత బాధపడుతున్నావ్ అని కేదార్ అంటాడు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు నరకం అయిపోతాయండి అని ధాత్రి అంటుంది కట్ చేస్తే.

Jagadhatri Today Episode December 16 2023 Episode 102 Highlights
Jagadhatri Today Episode December 16 2023 Episode 102 Highlights

ఇదిగో కౌశికి నా కూతురు ఇంట్లో ఉండాలి అంటే ధాత్రి కేదార్ ఇంట్లో ఉండకూడదు అనీ తెగేసి చెప్తుంది నిషిక వాళ్ళ అమ్మ. చూడండి అత్తయ్య మీరు ఎన్ని చెప్పినా మేము ఇక్కడి నుంచి వెళ్ళాము 10 రోజుల దాకా ఇక్కడే ఉంటాము అని కేదార్ అంటాడు. అయితే పద నిషిక మనం ఇక్కడ ఏం చేస్తాం అని వాళ్ళ అమ్మ అంటుంది. చూడమ్మా గొడవల వల్ల ఎవరికి మనశ్శాంతి ఉండదు వాళ్లు పది రోజుల తర్వాత వెళ్ళిపోతాం అంటున్నారు కదా వదిలేయి అని యువరాజు వాళ్ళ నాన్న అంటాడు. అయినా ధాత్రి వాళ్లు చేసిన తప్పుకి నా కొడుకు ఎందుకమ్మా నువ్వు శిక్ష చేస్తావు నా కొడుకు ఏం తప్పు చేశాడని వాళ్ళ అమ్మ అంటుంది.చూడమ్మా నేను ధాత్రి వాళ్లతో మాట్లాడుతాను కౌశికి పదమ్మ అని వాళ్ళ బాబాయ్ అంటాడు. బాబాయ్ ఏం మాట్లాడాలి అని కౌశికి అంటుంది. నువ్వు ఇంకేం మాట్లాడకు అమ్మ పదా అని వాళ్ళ బాబాయ్ కౌశికి ని తీసుకొని వెళ్తాడు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella